కావలసిన వస్తువులు :
కొబ్బరికాయ | - | ఒకటి. |
బియ్యం | - | రెండు కప్పులు. |
ఉప్పు | - | తగినంత. |
జీలకర్ర | - | ఒక స్పూను. |
పచ్చిమిరపకాయలు | - | 6. |
నూనె | - | అర కప్పు. |
తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంచేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, వేసి మెత్తగా దోసెల పిండిలా గ్రైండ్ చేయాలి. తరవాత పెనం మీద నూనె వేసి ఓ గరిటెడు పిండి వేసి పలుచగా దోసెలు పోసి రెండువైపులా కాల్చాలి. వీటిని వేడివేడిగా కారప్పొడితో తింటే బాగుంటాయి. [ఇంకా...]