Wednesday, May 23

వంటలు - బియ్యపిండి వడియాలు

కావలసిన వస్తువులు:
బియ్యపిండి - 2 కప్పులు.
మంచినీళ్లు - 4 కప్పులు.
పచ్చిమిర్చి - 8.
ఉప్పు - తగినంత.
జీలకర్ర - కొద్దిగా.
నువ్వులపప్పు - 4 టీస్పూన్లు.

తయారు చేసే విధానం :
మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లుపోసి, స్టవ్‌మీద పెట్టాలి. బియ్యప్పిండిలో రెండు కప్పుల చల్లటి నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యప్పిండిలో నీళ్లను పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పిండి ఉడికిన తరువాత మెత్తగా దంచిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిశ్రమాన్ని వేయాలి. నువ్వులపప్పు కూడా వేసి కలపాలి. చల్లారిన తరవాత జంతికల గొట్టంలో ఈ పిండి ఉంచి ప్లాస్టిక్ కవర్‌మీద జంతికల మాదిరిగా కావలసిన సైజులో వత్తి ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తరవాత జాగ్రత్తగా విరిగిపోకుండా డబ్బాలో భద్రపరచాలి. ఇదే పిండితో చిన్న చిన్న వడియాలు కూడా పెట్టుకోవచ్చు.
[ఇంకా...]