Saturday, May 26

వంటలు - కొబ్బరి అన్నం

కావలసిన వస్తువులు:
బియ్యం లేదా పలావు బియ్యం - అరకిలో.
కొబ్బరికాయ - ఒకటి.
ఉప్పు - తగినంత.
ఎండుమిర్చి - నాలుగు.
పచ్చిమిర్చి - నాలుగు.
మినపప్పు - రెండు స్పూన్లు.
శనగపప్పు - రెండు స్పూన్లు.
ఆవాలు - ఒక స్పూను.
కరివేపాకు - రెండు రెమ్మలు.
నెయ్యి లేదా రిపైన్డ్ ఆయిల్ - అర కప్పు.
జీడిపప్పు - కొద్దిగా.
కిస్‌మిస్ - కొద్దిగా.


తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని అన్నం వండాలి. (అన్నం పొడిపొడిగా ఉండాలి) కొబ్బరి తురిమి ఉంచాలి. ఓ వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి, సగం నూనె పోసి కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మిగతా సగం నూనె పోసి కాగిన తరువాత పోపు వేసి అవి వేగిన తరవాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించాలి. [ఇంకా...]