Wednesday, November 28
ఆహార పోషణ - చక్కెర వ్యాధి-చేదు నిజాలు
ఎబెర్స్ పేపిరస్ (ఈజిప్టు, 1500 బి.సి.)లో చక్కెర వ్యాధి అనే మాట వాడబడింది. మన దేశపు సుప్రసిద్ధ వైద్యుడు శుశ్రుతుడు క్రీ.పూ. 400లో ఈ వ్యాధిని తేనె మూత్రంగా అభివర్ణించాడు. క్రీ.శ. ఆరంభమైన మొదటి శతాభ్దంలోనే ఈ వ్యాధి రోం, చైనా, జపాను భాషా గ్రంధాలలో నమోదై ఉంది. డయాబెటిస్ అన్న పదాన్ని తొలుత గ్రీకులు వాడారు. ఈ పదం నీళ్ళ ద్వారా విసర్జనం అన్న అర్ధాన్ని ఇస్తుంది. మూత్రాన్ని వేడిచేసి పరీక్షించి, ఆవిరి చేసి డాక్టర్ విల్లిస్ 1674లో అందులో జిగటలాంటి పదార్ధం ఉందని కనుగొన్నాడు. ఆ ఉన్న వస్తువు చక్కెరే. కానీ అప్పట్లో ఇంగ్లాండు వారికి చక్కెర విషయం తెలియదు. [ ఇంకా...]