Saturday, February 2
చిట్కాలు - చుండ్రు-చిట్కాలు
ఏఏ కాలంలో అయినా ఎల్లప్పుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు, వయసుతో సంబంధం లేకుండా పెద్దవారికి, చిన్నవారికి అందరికీ తలలో చుండ్రు రావడం సాధారణం. చుండ్రు రావడానికి కారణాలు అనేకం. చుండ్రు వంశపారంపర్యంగా కూడా వస్తుంది. అధిక వత్తిడికి గురయినా తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురి కావడం సహజం. అలాగే ఎక్కువ సమయం ఎసి గదుల్లో గడపడం వల్ల, ఫోన్ కింద కూర్చున్నా తల మీది చర్మం పొడిగా అయిపోయి పొట్టులా లేస్తుంది. షాపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలపోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం వుంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ. కలుషిత వాతావరణం కూడా చుండ్రును పెంచుతుంది. ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది.సముద్ర తీరప్రాంతాల్లో నివసించినా పర్వత ప్రాంతాల్లో నివసించినా తప్పించుకోలేకపోతున్నారు. [ఇంకా... ]