Monday, February 25
నీతి కథలు - మోసానికి శిక్ష
ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న రాజయ్య స్కూలుకు సెలవుదినమైతే ఇంట్లో నుంచి కదలడు. ఏదో పుస్తకమో, పేపరో చదువుతూ కాలక్షేపం చేయడం ఆయనకలవాటు. ఒకరోజు ఉదయంపూట మార్కెట్టుకు వచ్చాడు. మామూలుగా అతను మార్కెట్టుకు రాడు. ఆ పని భార్య నిర్మలే చేస్తుంది. అయితే ఇంట్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నారు. నిమ్మకాయ పచ్చడి అంటే రాజయ్యకు ప్రాణం. నిమ్మకాయలు మీరు తెచ్చేపక్షంలో నిమ్మకాయ పచ్చడి పెడతానంది భార్య నిర్మల. దానితో ఇక లాభం లేదనుకొని ఆ కాయలు కొనడం కోసమే రాజయ్య మార్కెట్టుకు రావడం జరిగింది. ఆదివారం కావడంవల్ల ఆ రోజు మార్కెట్టు చాలా రద్దీగా ఉంది. రాజయ్య నాలుగు దుకాణాలు తిరిగాడు. ఈ చివరగా ఉన్న బండిని సమీపించాడు. [ఇంకా... ]