Saturday, February 9
నీతి కథలు - దొంగలో మార్పు
రాంబాబు అయిదో తరగతి చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు. స్కూలులో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు, కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు. స్కూల్లో ఇంటర్‌వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బైటికి వెళ్ళిపోతే వారి స్కూలు బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు. ఒకసారి ధీరజ్ అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేసాడు. వాడు ఏడుస్తూ రెండురోజులు బడికి కూడా రాలేదు. స్కూల్లో అమ్మే నోటుపుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటుపుస్తకంలో అయిదు, పది రూపాయల నోట్లు పెట్టుకుని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు. [ఇంకా... ]