బియ్యం - 1 కిలో.
బెల్లం - 800 గ్రాములు.
నూనె లేక నెయ్యి - 1/2 కిలో.
నువ్వులు - 100 గ్రాములు.
తయారు చేసే విధానం:
బియ్యాన్ని రెండు రోజులు నానబెట్టాలి. ప్రతి పూటా బియ్యంలో నీళ్ళు మార్చి కొత్త నీళ్ళు పోస్తూ ఉండాలి. రెండవ రోజు సాయంత్రం బియ్యాన్ని పిండి కొట్టుకోవాలి. పిండిని రెండు సార్లు జల్లిస్తే అరిసెలు బాగుంటాయి. తరువాత బెల్లాన్ని మెత్తగా దంచి అడుగు మందం ఉన్న గిన్నెలో వేసి ఓ కప్పు నీళ్ళుపోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగి పాకం అయ్యేటప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేటులో కొంచెం నీళ్ళు పోసి పాకం కొంచెం అందులో వెయ్యాలి. [ఇంకా... ]