Saturday, February 21

వంటలు - పన్నీర్‌బ్రెడ్‌

కావలసిన వస్తువులు:
శాండ్‌విచ్ బ్రెడ్ ముక్కలు - ఎనిమిది.
పన్నీర్ - 100గ్రాములు.
ఉల్లిపాయ - ఒకటి.
కారం - టీస్పూను.
అల్లంవెల్లుల్లి - అరటీస్పూను.
సెనగపిండి - 100గ్రాములు.
ఉప్పు - తగినంత.
మంచినీళ్లు - కప్పు.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
ఉల్లిపాయ సన్నగా తరగాలి. పన్నీర్‌ సన్నగా తురమాలి. బాణలిలో టేబుల్ స్పూన్ నూనె వేసి అల్లం వెల్లుల్లి, ఉల్లిముక్కలు వేయించాలి. తరువాత పన్నీర్, ఉప్పు, కారం, గరం మసాలా కూడా వేసి ఓ ఐదు నిమిషాలు వేయించి దించి పక్కన ఉంచాలి. [ఇంకా... ]

భక్తి గీతాలు - మంగళగౌరి మాహేశ్వరీ

మంగళగౌరి మాహేశ్వరీ మముగన్న తల్లి పరమేశ్వరీ
కరుణామయి నీ కంటిపాపలో
చల్లన పెరుగును ముల్లోకాలు ||క||

తల్లి నీపేరు తలచిన చాలును
కలిగెను శతకోటి కళ్యాణాలు ||మ||

అమ్మలగన్న అమ్మవునీవే
శుభములనోసగే శుభమూర్తి నీవే
వెండికొండపై వెలసింది నీవే
ఇంటింట నెలకొన్న ఇలవేల్పునీవే
మా ఇలవేల్పు నీవే ||మ|| [ఇంకా... ]

మీకు తెలుసా - మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు

మహిళలకు ఋణాలు అందించే సంస్ధలు - అభివృద్ధి పధకాలు

అన్ని రంగాలలోను స్త్రీలు ముందంజ వేస్తున్న రోజులివి. ఒకప్పుడయితే స్త్రీలకు వంటిల్లే చాలుననుకునేవారు. వారిని చదవనిచ్చి, ఆలోచించగలిగేలా చేస్తే పురుషులతో సమానంగా అభివృద్ధిపధం వైపు పయనించగలరని గుర్తించారు. స్త్రీ, పురుష అసమానతలను పక్కనపెట్టి వారిని ప్రొత్సహిస్తే రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించగల నేర్పరితనం వారిలో ఉంది. అందుకే పట్టణ ప్రాంత మహిళలకే కాకుండా, చదువురాని గ్రామీణ స్త్రీలు సైతం కుటీర పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమల ద్వారా స్వావలంబన సాధిస్తారని వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలను అమలు చేస్తున్నాయి.

జాతీయబ్యాంకులు, గ్రామీణ సహకార బ్యాంకులు, స్టేట్ పైనాన్స్ కార్పొరేషన్, రాష్ట్ర మహిళా కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి ఆర్ధిక సంస్ధలు ఋణాలు మంజూరు చేస్తున్నాయి. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - పొషక విలువల తోటకూర

ఉపయోగాలు:

గుండె జబ్బులు ఉన్నవారు తోటకూరను ఉడకబెట్టి తినడం ద్వారా గుండెజబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎవరికైనా గోర్లు పెరగవు. పళ్లమీద పచ్చని పొరలు ఏర్పడుతుంటాయి. కాబట్టి నిత్యం ఆహారంలో తోటకూరను తీసుకోవడం వలన వీటన్నింటిని నివారించుకోవచ్చు, రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్ లోపించిన వారు రక్తహీనతలకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎక్కువగా పెసరపప్పు, తోటకూర కలిపి వండినటువంటి కూరలను తినడం ద్వారా ఎంతోమంచి జరుగుతుంది. తోటకూరలో ఉండేటటువంటి కాల్షియం, ఐరన్‌లు బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పోషక విలువలు అందజేస్తాయని వైద్యశాస్త్రం సూచిస్తుంది. [ఇంకా... ]

పిల్లల ఆటలు - చెప్పింది చెయ్యి

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా ఆడవచ్చు.

ఈ ఆటలో లీడర్ ఉండాలి. లీడర్ ముందుగా చిన్న చిన్న తెల్ల కాగితాలపై రకరకాల పనులు రాసి మడత పెట్టాలి. అంటే ఒక దాంట్లో పాట పాడాలి, రెండవ దాంట్లో పకపకానవ్వాలి, వరుసగా కుంటుకుంటూ రావాలి, బ్రహ్మానందం లాగా మాట్లాడాలి., బాలకృష్ణ లాగా డైలాగ్ లు చెప్పాలి అని రాయాలన్నమాట. కూర్చున్న పిల్లలందరికి తలొకటి ఇచ్చి అవి విప్పి లోపల ఉన్నది చెప్పి వరుసగా అవి చేయ్యాలని చెప్పాలి. ఒక అమ్మాయికి మగాడిలా షేవింగ్ చేసుకోవాలి అని అందులో ఉంటే షేవింగ్ చేస్తున్నట్లు నటించాలి. మగపిల్లాడికి వంట చేయమని వస్తే వంట చేస్తున్నట్లు నటించాలి. భలే సందడిగా నవ్వులతో హోరెత్తిపోతుంది. ఒక సారి ప్రయత్నం చేసి చూద్దామా! [ఇంకా... ]

Friday, February 20

ముఖ్యమైన ఘట్టాలు - పెళ్ళి చేయటం

వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. వ్యక్తి తానే కేంద్రబిందువుగా ఉండే స్థితినుంచి మరో వ్యక్తి కేంద్రబిందువుగా ఉండే స్థితికి ఎదిగే నిజమైన జీవిత యాత్ర వివాహంతోనే ఆరంభమవుతుంది. నైతిక సూత్రాలనే బీజాలు వివాహం తరువాతనే మొలకెత్తి వేగంగా పెరగనారంభిస్తాయి. ప్రేమ, తన్మయత, త్యాగం, భక్తి, ఓరిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదిగేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం. ఈ భావాన్ని పెండ్లి కుమారునికి కలిగించడానికే వేదాలు ఇలా ప్రకటించమని అతనికి సలహా ఇస్తుంది. ప్రియా! ఆవాహనం చేయబడిన దేవతల సన్నిధిలో, మన జీవితంలోని పవిత్ర సందర్భంలో, నీ పాణిగ్రహణం చేస్తున్నాను. ఆశీర్వదించబడిన ఓ స్త్ర్రీ రత్నమా! దీర్ఘకాలం నా జీవిత భాగస్వామిగా ఉండు. నా కుటుంబ బాధ్యతలను నీ కప్పగిస్తున్నాను. సంతోషముగా నీ బాధ్యతను నెరవేర్చు. పవిత్రమైన ఈ ప్రమాణం దైవసన్నిధిలో పెండ్లి కుమారుడు చేసే ఆ క్షణం నిజానికి ఎంతో ఆనందకరమైనది. [ఇంకా... ]

వంటలు - గుమ్మడికాయ బజ్జీలు

కావలసిన వస్తువులు:
గుమ్మడికాయ - 250 గ్రా.
శనగపిండి - 1 కప్పు.
పచ్చిమిరపకాయ ముక్కలు (చిన్నవిగా తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు.
తురిమిన అల్లం - 1 టేబుల్ స్పూను.
కారం - చెంచా సగం.
తినే సోడా - చిటికెడు.
తురిమిన చీజ్ - ఒక టేబుల్ స్పూను.
ఉప్పు - తగినంత.
నూనె - సరిపడినంత.

తయారు చేసే విధానం:
మొదట గుమ్మడికాయ చిన్న చిన్న ముక్కలుగా, సన్నని స్లైసుల్లా కట్ చేసుకోవాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - బాలలం - బాలలం - 1

బాలలం, బాలలం మేమంత బాలలం

కన్న తల్లిదండ్రులకు - కదలాడే బొమ్మలం

భరతమాత పెంచుతున్న - భావి మావి కొమ్మలం

చదువుకునే దీపాలం - సమత నాత రూపాలం

నవ భారత మందిరాన - నవ జీవన శిల్పాలం [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - హిమోగ్లోబిన్ పెరగాలంటే!

ఆహార లోపం, ఆహారంలోని పోషకాల్ని శరీరం శోషించుకోలేకపోవడం, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, పొట్టలో పురుగులు ఊండడం, ఎముకల మూలుగులో రక్తకణాలు తగిన పరిమాణంలో ఉత్పత్తి కాకపోవడం వంటివి ప్రధాన కారణాలు.

ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు :

1. పొద్దున టిఫిన్ తో పాటు ఒక గ్లాసు పాలు, ఒక పండు, నాలుగైదు ఖర్జూరాలు చేర్చాలి.
2. సాయంత్రం నాలుగు గంటలకు రాగిజావ, ఒక అరటిపండు తీసుకోవాలి.
3. భోజనంలో ప్రతిరోజూ పప్పు, ఆకుకూర (రెండూ కలిపి కాదు) ఉండేట్లు చూసుకోండి.
4. పడుకునే ముందు ఒక గుప్పెడు వెరుశనగలు, కాస్తబెల్లం,నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - టంగుటూరి ప్రకాశం

పేరు : టంగుటూరి ప్రకాశం పంతులు.
తండ్రి పేరు : శ్రీ గోపాలకృష్ణయ్య.
తల్లి పేరు : శ్రీమతి సుబ్బమ్మ.
పుట్టిన తేది : 1872.
పుట్టిన ప్రదేశం : ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు.
చదివిన ప్రదేశం : ఇంగ్లాండ్.
చదువు : ప్లీడరు (న్యాయవాది).
గొప్పదనం : ఆంధ్రరాష్ట్ర అభివృద్దికై పాటుపడినారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొని దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. స్వరాజ్య అనే పత్రికను స్థాపించాడు.
స్వర్గస్తుడైన తేది : 25-5-1957.

శ్రీ ప్రకాశం 1872 లో అప్పటి గుంటూరు జిల్లా, ఒంగోలు తాలూకాలోని కనుపర్తి గ్రామంలో (ఇప్పుడు ప్రకాశం జిల్లా) జన్మించాడు. తండ్రి శ్రీ గోపాలకృష్ణయ్య, తల్లి శ్రీమతి సుబ్బమ్మ. ఆ దంపతులకు ఆరుగురు సంతానం. వారిలో ప్రకాశం మూడవవాడు. [ఇంకా... ]

Thursday, February 19

పుణ్య క్షేత్రాలు - పెదకాకాని

కాకానిలో సాంబశివాలయము మహా మహిమాన్వితమై యున్నది. ఈ స్వామి వారి ప్రతిభ అనేక రకాలు. ప్రతి ఆదివారం భక్తులు తండోపతండాలుగా వచ్చి మొక్కుబడులు చెల్లించుకొంటూ ఉంటారు. ఇక్కడ సత్రాలున్నాయి. అన్ని వస్తువులూ దొరకుతాయి ప్రభలు, బండ్లు గట్టుకొనివచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. వివాహ ఉపనయనాదులు నిర్వహించుకుంటూ స్వామి దయకు పాత్రులవుతారు. వ్యాధిగ్రస్తులు, సంతానహీనులు అక్కడనే వుండి ఆలయంచుట్టూ ప్రదక్షిణలు చేసి వారికోర్కెలను సాఫల్యం చేసికొంటూ ఉంటారు. ఇక్కడకు దగ్గరలోనే నంబూరు స్టేషన్ కెదురుగా రేడియో బ్రాడ్ కాస్టింగ్ స్టేషను, హేమలతా టెక్స్‌టైల్సు మిల్లు ఉన్నాయి. [ఇంకా... ]

వంటలు - క్వీన్స్ కేక్స్

కావలసిన వస్తువులు:
వెన్న - 30 గ్రా.
పంచదార పొడి - 50 గ్రా.
గుడ్డు - 1.
పాలు - 15 మి.లీ.
మైదాపిండి - 50 గ్రా.
బేకింగ్ పౌడర్ - 1/4 చెంచా.
ఎండు ద్రాక్ష - 30 గ్రా.
వెనిల్లా ఎస్సెన్స్ - కొన్ని చుక్కలు.

తయారు చేసే విధానం:
ఎండుద్రాక్ష తొడిమలు తీసి, నీళ్ళతో శుభ్రం చేయాలి. తర్వాత ఒక ఉతికిన, శుభ్రమైనబట్టతో తడి లేకుండా తుడవాలి. మైదాను, బేకింగ్ పౌడర్‌ను జల్లించాలి. వెన్నను, పంచదార పొడిని బాగా క్రీమింగ్ చేయాలి. [ఇంకా... ]

అవీ, ఇవీ కొనుక్కొనేటప్పుడు - సోఫా సెట్

ఫర్నీచరు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు పైపై మెరుగులు చూసి కొనేయడం. డబ్బు పెట్టి కొనే వస్తువు అందం ఎంత ముఖ్యమో నాణ్యతా అంతే ముఖ్యం. అందుకని నచ్చిన మోడల్ ఎంచుకున్నాక వెంటనే డబ్బు చెల్లించకండి. ముందుగా దాని నాణ్యతా ప్రమాణాలపై దృష్టిపెట్టండి. సోఫా ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్ రూముల్లో తప్పనిసరి ఫర్నీచరు అయ్యింది. కాబట్టి అది కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.

1. ఎంచుకున్న సోఫా మీద కనీసం పదినిమిషాలు కూర్చోండి. సౌకర్యంగా ఉందీ లేనిదీ తెలుస్తుంది.
2. చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగుల్తుందా గమనించండి.
3. దాని మీద కూర్చొని అటూ ఇటూ కదలండి. కీచుమని ధ్వని రాకుండా ఉంటేనే సరిగా ఉన్నట్లు. [ఇంకా... ]

నీతి కథలు - దొంగ దొరికాడు

అక్బర్ చక్రవర్తి కాలంలో ఒక ముసలావిడ ఉండేది. పాపం ఆవిడకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కత్తీ వంటరిగా ఉండేది. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజున ఆవిడకు హజ్ యాత్రకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే ఊళ్ళో మరికొందరు కలిసి హజ్ యాత్రకు వెడుతున్నారని ఆవిడకు తెలిసింది. ఇంకేముంది వాళ్ళతో కలిసి యాత్రకు వెడితే బావుంటుందని ఆవిడకు అనిపించింది. సరే వాళ్ళను కలిసి ఇలా తను కూడా యాత్రకు రావాలని అనుకుంటన్నట్టుగా వారితో చెప్పింది. వాళ్ళు సరేనని అన్నారు.

మరి యాత్రకు వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా! అందుకని తన దగ్గర వున్న బంగారు నగలన్నింటిని అమ్మేసింది. నగలు అమ్మగా వచ్చిన డబ్బులో కొంత తన దారి ఖర్చులకు ఉంచుకుంది. మిగిలిన డబ్బులను ఒక సంచిలో వేసి మూట కట్టింది. ఆ సంచిని మైనంతో అతికించేసింది.
[ఇంకా... ]

చిట్కాలు - వంటల తయారికి సంబంధించినవి

1. అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
2. అప్పడాల్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు
3. అల్లం తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం, పది రోజుల వరకూ తాజాగానే ఉంటుంది.
4. ఆకుకూరలను ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకండి.
5. ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
6. ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్‌ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి. [ఇంకా... ]

Wednesday, February 18

పెద్దల ఆటలు - బెలూన్ పగలగొట్టే ఆట

ఈ ఆట చాలా సరదాగా ఉంటుంది. దీనికి కావలసిందల్లా బూరలు, దారం మాత్రమే.

పాల్గొనే వారందర్నీ రెండు గ్రూపులుగా విడదీయాలి. ఇప్పుడు మొదటి గ్రూపువారికి బూరని ఊది గట్టిగా ముడివేసి ఒక మూర దారం వదిలి తెంపి కాలిబొటనవేలికి కట్టుకోమనండి. అలా మొదటి గ్రూపు వారందరూ చేసిన తరువాత హాలు మధ్యలో రౌండ్ గీయండి. గీసిన రౌండ్ లో బూర కట్టుకొన్న వారిని ఒకరిని నుంచోమనండి. తరువాత రెండో గ్రూపు వారి నుంచి ఒకరిని వచ్చి నుంచోమనండి. ఆట ఏమిటంటే రౌండు లోనే ఇద్దరూ ఉండాలి. బూరకట్టుకొని ఉన్నవారు బెలూనును కింద ఆనించి తీస్తూ ఉండాలి. [ఇంకా... ]

జానపద గీతాలు - చీరల్ కావలెనా

చీరెల్ కావలెనా రవికల్ కావలెనా
నీకేమి కావలెనే పొద్దుటూరి సంతలోనా

చీరల్ నా కొద్దురో రవికల్ నా కొద్దురో
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా

డావుల్ కావలెనా ఆరం కావలెనా
నీకేం కావలెనే పులివెందుల సంతలోనా

డావుల్ నాకొద్దురో ఆరం నాకొద్దురో
నీవే నీవే నీవే కావాలిరో రంగమ్మత్త కొడుకా [ఇంకా... ]

నీతి కథలు - మోసం చేసిన మోసం

ఒక పిల్లల కోడి, తన చిట్టి పొట్టి కోడి పిల్లలను వెంట బెట్టుకొని చెత్తకుప్పల మీద తిరుగుతూ పురుగులను ఏరుకొని తింటూ వుంది. కోడిని, కోడిపిల్లలను చూడగానే, ఆ పక్కనే కలుగులో వున్న పాముకు నోరూరింది. ఎలాగైనా ఓ కోడి పిల్లను మింగాలనుకుంది. తల్లి కోడి చూస్తూ వుండగా, పిల్ల కోడిని పట్టుకుంటే, తల్లి కోడి వాడి ముక్కుతో తన కళ్ళు పొడిచేస్తుందని పాముకు తెలుసు!

అందు కోసం ఏదైనా ఎత్తు వేయాలని అనుకొని, చచ్చిన దానిలాగ ఓ పక్కగా పడుకుంది. పాము! పాము అంటే ఇంకా భయం ఎరుగని కోడి పిల్లలు ఇటూ అటూ తిరుగుతూ, ఆ పాము మీద నుంచి ఈ పక్కకూ, ఆ పక్కకూ గెంతుతూ వున్నా పాము కదలకుండా, మెదలకుండా పడుకునే వుంది. [ఇంకా... ]

ఇతిహాసాలు - శుక్రాచార్యుని జన్మవృతాంతం

శుసనుడనే ముని ఒకసారి కుబేరుని సంపదను దోచుకుపోతాడు. అప్పుడు కుబేరుడు లబోదిబోమని మొత్తుకుంటూ వెళ్ళి శివుని దగ్గర మొరపెట్టుకొన్నాడు అతడి మొరను ఆలకించిన శివుడు కుబేరునికి అభయహస్తమిచ్చి, శుశనుడి కోసం గాలిస్తాడు. విషయం అర్ధం చేసుకొన్న శుసనుడు సరాశరి ఈశ్వరుని శూలం మీదనే కూర్చున్నాడు. అది గమనించిన గరళకంఠుడు తన శూలాన్ని కిందకు వంచుతాడు. అలా వంగిన శూలమే 'పినాకి ' అయినది. [ఇంకా... ]

ఆహార పోషణ సూచిక - ఆరోగ్యానికి మేలుచేసే బాక్టీరియా

ప్రోబయోటిక్స్ అంటే
మనిషి ఆరోగ్యాన్నిచ్చే సజీవ బాక్టీరియాలో సాక్రోమైటిక్స్ అని ఎఫ్ఎఒ నిర్వచనం చెప్పింది. ఈ కోవకు చెందిన బాక్టీరియాలో సాక్రోమైసస్ బౌలార్డ్, లాక్టో బాసిల్లన్ లేదా బైఫిడో బాక్టీరియం వగైరాలున్నాయి.

వీటి ఉపయోగం:
1. కొలోన్ (పెద్దపేగు లో పిహెచ్ స్థాయిని తగ్గించి హానికర బాక్టీరియాను నాశనం అయ్యేటట్లు చేస్తాయి.
2. వ్యాధినిరోధక వ్యవస్థను బలపరచి, పాధీజెనిక్ బాక్టీరియాకు నిరోధకశక్తిని అభివృద్ది చేస్తాయి. మాక్రోఫేగస్, లింఫోసైట్‌ల చర్యలను పెంచుతాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ కారకాలను వృద్ధిచేస్తాయి. దీనివల్ల వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
3. ఇంఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా వెజినోసిస్ ( మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ ఫెక్షన్లు ) వంటి వాటిని తగ్గిస్తుంది. [ఇంకా... ]

Tuesday, February 17

ఆధ్యాత్మికం - శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట

గోదావరీ నదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన షిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ నిత్యం తన మశీదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు. దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షావుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు. మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి, వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు, శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు. పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - చెట్టు నీడ చల్లనేల

గోడనీడ వేడిగా ఉంటుంది. కానీ చేట్టు నీడ చల్లగా ఉంటుంది. ఈ తేడా ఏమిటి. ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది తెలుసుకుందామా!

గోడ ఓ నిర్జీవ ఘన పదార్థం. దృశ్యకాంతి ఏమాత్రం గోడలోంచి దూసుకుపోదు. కాబట్టి గోడకు ఇవతల వైపు నీడ ఏర్పడుతుంది. అయితే సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటు, అధిక శక్తిమంతమైన అతినీల లోహిత కాంతి, తక్కువ శక్తిమంతమైనదే అయినా ఉష్ణభాగం అధికంగా ఉన్న పరారుణ కాంతి కూడా ఉంటాయి. గోడ మీద పడిన కాంతిలో కొంత భాగం ఆవలి వైపున పరానవర్తనం చెందినా, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతిశక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడస్ నుంచి అన్ని వైపులకు ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలివైపు కూడా వస్తుంది. [ఇంకా... ]

వంటలు - మ్యాంగో స్క్వాష్

కావలసిన వస్తువులు:
మామిడిపండ్లు గుజ్జు - 3 కప్పులు.
సిట్రిక్ ఆసిడ్ - 15 గ్రా.
పొటాషియం మెటాబైసుల్ఫేట్ - 1/2 స్పూను.
పంచదార - 750 గ్రా.
నీరు - 4.5 కప్పులు.

తయారు చేసే విధానం:
ముందుగా మామిడి పండ్ల గుజ్జు తీసి, పంచదార, నీరు పోసి చక్కగా ఉడికించాలి. ఉడికిన గుజ్జు దించి చల్లార్చి సిట్రిక్ ఆసిడ్ పొడిచేసి పొటాషియం మెటాబైసల్ఫేట్ వేడినీళ్ళలో కలిపి గుజ్జులో కలపాలి. మరల గుజ్జును పల్చగా చేసి 5 నిమిషాలు ఉడికించాలి. [ఇంకా... ]

పిల్లల పాటలు - చిన్నోడమ్మా చిన్నోడు

చిన్నోడమ్మా చిన్నోడు
చిన్ని సైకిలు కొన్నాడు

రాళ్ళ మీద తిప్పాడు
కాలు జారి పడ్డాడు

ఆసుపత్రిలో చేరాడు
మందు బిళ్ళలు మింగాడు

మళ్ళీ ఇంటికి వచ్చాడు
మంచం ఎక్కి పన్నాడు [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - శ్రీకూర్మం

శ్రీకాకుళంకి దగ్గరలోనే శ్రీ కూర్మనాధస్వామి ఆలయం దర్శించదగినది. ఇందుకు తోడు శ్రీ రామానుజాచార్యులు, శ్రీ వరదరాజస్వామి, శ్రీ మధ్వాచార్యులు, శ్రీ కోదండరామస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అయితే శ్రీ కూర్మవతారము విష్ణ్వంశదశావతారాల్లో ఒకటయి మొదటి ఇది శివక్షేత్రంగా వెలసిఉన్నా శ్రీరామానునాజాచార్యులు వారివలన ఇదివైష్ణవక్షేత్రంగాను, దివ్యప్రదేశంగాను మలచారని చెప్తున్నారు. ఆలయం అతి ప్రాచీనమయినది. చుట్టూ మండపాదుల స్తంభాలమీది శిల్ప చాతుర్యం వేనోళ్ళకొనియాడ దగినది. గోపురాలమీద కూడ విశాలమైన స్ధలమున్నది. ఇక్కడ అనేక పుష్కరిణిలు కూడా వున్నాయి. [ఇంకా... ]

Monday, February 9

భరతమాత బిడ్డలు - మోక్షగుండం విశ్వేశ్వరాయ

పేరు : మోక్షగుండం విశ్వేశ్వరాయ (మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాదు).
తండ్రి పేరు : శ్రీ శ్రీనివాసశాస్త్రి.
తల్లి పేరు : వెంకాయమ్మ.
పుట్టిన తేది : 1816 వ సంవత్సరంలో పుట్టారు.
పుట్టిన ప్రదేశం : ముద్దినేహళ్ళి.
చదివిన ప్రదేశం : చిక్ బల్లాపూర్ , బెంగుళూరులో సెంట్రల్ కాలేజీ.
చదువు : ఇంజనీరింగు.
గొప్పదనం : ఆయన మైసూరు రాష్ట్రప్రగతిలో మరపురాని పాత్ర వహించారు. కృష్ణరాజసాగర్ డాం నిర్మాణం, మైసూరు యూనివర్శిటీ స్థాపన, మైసూరు బ్యాంకు స్థాపన, ఆయన కృషివల్లనే జరిగాయి.
స్వర్గస్తుడైన తేది : 14 - 4 -1962.

మోక్షగుండం విశ్వేశ్వరాయ 1816 లో బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. మోక్షగుండం అనే గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - మైక్రోవేవ్‌ ఓవెన్

వంటలో సమయాన్ని, ఇంధనాన్ని, ఖర్చును ఆదాచేసే మైక్రోవవ్‌ను ఆధునిక సాధనంగా చెప్పవచ్చు. మైక్రోవేవ్ మీద వంట వండుకోవడమో, లేక మైక్రోవేవ్ మీద వంటను చేసుకుంటే బాగుండును అనుకోవడం తప్ప దాని గురించి మరేమీ తెలియకపోవచ్చు. మైక్రోవేవ్ ఓవెన్ ప్రయోజనాలు, సాంకేతిక వివరాలు ఇవి.

మైక్రోవేవ్ ఓవెన్‌లో ముఖ్యంగా వాట్‌ల వ్యవస్థ, నియంత్రణ ప్యానెల్, పవర్ లెవల్స్ ఉంటాయి. 350 ఆపైన వాట్‌లను ఉపయోగించి వీటిని తయారుచేస్తారు. అయితే చాలా వరకు ప్రామాణికంగా 700 వాట్‌లను ఉపయోగిస్తారు. అలాగే చాలా వరకు టి.విల్లో వచ్చే వంట కార్యక్రమాలు, పత్రికలు, మ్యాగజైన్లలో రాసే ప్రత్యేక వంటకాలను ఎక్కువగా ఈ 700 వాట్‌ల ఓవెన్ లోనే ప్రయోగించి చేసి చూస్తారు. మార్కెట్‌లో 700 వాట్‌ల ఓవెన్‌ను కొన్నవారికి వంటల పుస్తకాన్ని బహుమతిగా కూడా ఇస్తుంటారు. ఎవరైనా 700 వాట్‌లకు పైన ఉన్న ఓవెన్ ఎంచుకోవడం దూరదృష్టితో చేసే పని. లేదా చాలా తక్కువ వంట చేసే వారు మాత్రం తమకు తగ్గ వ్యాట్‌తో ఓవెన్‌ను ఎంపికచేసుకోవచ్చు. [ఇంకా... ]

వంటలు - మామిడికాయ తురుం పచ్చడి

కావలసిన వస్తువులు:
మామిడికాయ - 1(చెక్కు తీసి తురమాలి).
వేయించిన ఆవాలు - 1 చెంచా.
మెంతులు - 1 చెంచా.
కారం - 2 లేక 3 చెంచాలు.
ఇంగువ - తగినంత.
ఉప్పు, పసుపు - తగినంత.
నూనె - 2 గరిటెలు.

తయారు చేసే విధానం :
అవాలు, మెంతులు వేయించి పొడిచేసుకోవాలి. మూకుడులో నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఇంగువ పోపు వేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కారం, మెంతులు, ఆవాల పొడి వేసి పెట్టుకోవాలి. అదే మూకుడులో మరికాస్త నూనె వేసి మామిడి తురుము, పసుపు, ఉప్పు, వేసి మగ్గనివ్వాలి. [ఇంకా... ]

పిల్లల ఆటలు - టమోటా రేసు

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.

ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు : "టమోటా" లేదా "బంగాళదుంప" లేదా "కోడిగుడ్డు" లేదా "బంతి".

ఆటగాళ్ల వయస్సు : 3 సం|| రాల నుండి.


A) పిల్లలు ఎక్కువ మంది వుంటే ఈ ఆట రక్తి కడుతుంది. పిల్లలని నేల మీద ఒకరి పక్కన మరొకర్ని కూర్చోమనాలి .వాళ్ళకి పోటీ టీంగా అదే సంఖ్య గల పిల్లల్ని వాళ్ళకి ఎదురుగా అదే పద్దతిలో కూర్చోమనాలి. అలా కూర్చున్న రెండు వరుసల్లోని పిల్లల్లో మొదట చెరో టమోటా ఇవ్వాలి. స్టార్ట్ చెప్పగానే పిల్లలు కుడినించి ఎడమకి ఆ టమోటా మారుతూ చివరకి ఆఖరిలో కూర్చున్న పిల్ల చేతికి చేరుతుంది. [ఇంకా... ]

పండుగలు - ఏరువాక పూర్ణిమ

ఇది రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ. ఈ "ఏరువాక పూర్ణిమ"ను రైతులు ప్రతి సంవత్సరం 'జ్యేష్ఠ శుద్ద పూర్ణిమ ' నాడు తమపొలలాలలో దుక్కు దున్ని ఎంతో వైభవంగా దీనిని ఆచరించెదరు. ఈదినమందు మరో ముఖ్య విషయం, వార్కి అను నిత్యము వ్యవసాయ పనులలోను వ్యవసాయ అభివృద్దికి చేదోడు వాదోడుగా ఉంటూ, కాలి అందియలు ఘల్లు ఘల్లుమని గంటలు మ్రొగించుకుంటూ "ధాన్యలక్ష్మిని" ఇంటికి తోడ్కొని వచ్చే, వాటి మెడలో కొత్త గంటలు, పలురంగుల పూసలు, పూలతో నిండిన దిష్టితాళ్ళతో వాటిని అలంకరించి, పిదప మంగళవాద్యములతో పొలమునకు తోడ్కొని పోయి అచ్చట నాగలిని, ఈ బసవన్నలను ధూపదీపనైవేద్యములతో పూజించి అనంతరము భూమిని దుక్కిదున్ని "ఏరువాక " ప్రారంభించే శుభదినము 'అన్నదాతలకు '. అలా ఆచరించటవలన వార్కి చక్కని సిరులపంట పండుతుందని వారు విశ్వాసముగా భావిస్తారు. అది కేవలం వారి విశ్వాసమేకాదు వాస్తవము కూడా! అటువంటి వేడుకలు తిలకించాలి అంటే, ప్రకృతి రమణీయ డృశ్యాలతో పచ్చని పైరులతో పాడిపంటలతో నిండి ఉండే పల్లెసీమలే పట్టుగొమ్మలు. [ఇంకా... ]

Monday, February 2

మీకు తెలుసా - ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవం

ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు పేరిట మూడు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలను కలుపుకొని 1970 ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లాగా ఏర్పాటుచేశారు. స్వాతంత్రోద్యమ కాలంలో పోరాటాల గడ్డగా పేరొందిన ఈ ప్రాంతానికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ' ఆంధ్రరత్న ' దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు మరెందరో యువ ప్రకాశాలతో, స్వాతంత్ర్య ఉద్యమం ప్రకాశించింది. అందుకే ఈ జిల్లాకు ' ప్రకాశం' గా నామకరణం చేశారు. జిల్లా ఆవిర్భావ సందర్భంగా ఉద్యమాల గడ్డ గురించి స్మరించుకుందాం.

దుగ్గిరాలగోపాలకృష్ణయ్య:

1889 జూన్ 2 జన్మించిన దుగ్గిరాలగోపాలకృష్ణయ్య అర్థశాస్త్రంలో ఎం.ఏ పట్టాపొంది దేశభక్తితో 1854 నుంచి సహాయ సమీకరణ, శాసనోల్లంఘన, విదేశీవస్తు బహిష్కరణ తదితర ఉద్యమాలలో ప్రధానపాత్ర పోషించారు. 1920లో చీరాల - పేరాల ఉద్యమం ప్రారంభించారు.1921లో మార్చి 28న విజయవాడలో జరిగిన అఖిలభారత కాంగ్రేస్ మహసభ అనంతరం 1921 ఏప్రియల్ 21న మహాత్మాగాంధీ చీరాల వచ్చి 'దుగ్గిరాల ఉద్యమాన్ని కొనియాడారు. [ఇంకా... ]

నీతి కథలు - పెద్దపులి - బాటసారి

రామాపురం అనే గ్రామంలో శివశర్మ అనే బ్ర్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఆ చుట్టుప్రక్కల ఉన్న నాలుగైదు గ్రామాలకు పురోహితుడు. ఒకనాడు పొరుగున ఉన్న కృష్ణాపురంలో వ్రతం చేయించటానికి బయలుదేరాడు. రామాపురం నుంచి కృష్ణాపురం వెళ్ళటానికి మధ్యలో రెండు మైళ్ళ దూరం అడవిని దాటి చేరుకోవాలి. ఆ అడవిలో కౄర జంతువులు లేకపోవటం వల్ల రామాపురం గ్రామస్థులు భయం లేకుండా అడవిని దాటి వెళ్ళేవారు. శివశర్మ అడవిలో నడుస్తుండగా అతనికి ఒక చెరువు గట్టు మీద దర్భలు చేతిలో పట్టుకుని కూర్చున్న పెద్దపులి కనిపించింది. దానిని చూడగానే శివశర్మ గుండెల్లో రాయి పడింది. భగవంతుడా! 'ఈ అడవిలో కౄర జంతువులు ఉండవు కదాని ఒంటరిగా బయలుదేరాను... ఇప్పుడు ఈ పెద్దపులి కనిపించింది. దీని బారి నుంచి నన్ను నువ్వే కాపాడాలి' మనసులో దేవుడిని తలచుకుంటూ అనుకున్నాడు. ఆ సమయంలోనే ఆ పెద్దపులి శివశర్మను చూడనే చూసింది. శివశర్మ కాళ్ళు చేతులు భయంతో వణికాయి. ఓ! బ్ర్రాహ్మణుడా నన్ను చూసి భయపడకు. కౄర జంతువయినా... ఇప్పుడు మాంసాహారిని కాదు... ఇప్పటిదాకా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని భగవంతుడిని ప్రార్దించాను... [ఇంకా... ]

పుణ్య క్షేత్రాలు - మహానంది

గిద్దలూరు నుండి గాజులపల్లి స్టేషనులోదిగి వెళ్ళవచ్చు. గాజులపల్లికి సుమారు 6 కి.మీటర్లుంటుంది, మహానంది. ఇది కూడా పేరెన్నికగన్న శైవక్షేత్రాల్లో ఒకటి. నంధ్యాల నుండి 16 కిలోమీటర్లుంటుంది. ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్.

ఇక్కడ మహానందీశ్వరాలయం - ఆలయానికెదురుగా కోనేరు. కోనేరులోకి నీరు ఒకనంది నోటిగుండా నిరంతరం ప్రవహిస్తూనే వుంటుంది. చాలా తేలికై నీరు స్వచ్ఛంగా వుంటుంది. కోనేరు సుమారు 6 అడుగుల లోతుంటుంది. నీటి అడుగున ఎంత చిన్న వస్తువైనాసరే స్పష్టంగా పైకి కనబడుతుంది. కోనేటి నీటిమట్టం ఒకే విధంగా వుండటానికి కొన్ని తూములు కట్టబడినాయి. నీరంతా కాలువలద్వారా కొన్ని వందల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేస్తూ విస్తారంగా అరటి తోటలు పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడి అరటిపండ్లు చాల ప్రసిద్ధం. తిరిగి నంద్యాల వచ్చి అక్కడినుండి శ్రీశైలమునకు రావచ్చును. [ఇంకా... ]

ఎందుకు, ఏమిటి, ఎలా ... - కార్టూన్

ఇప్పుడు మన దేశంలో ఎన్నో కార్టూన్లు చూస్తున్నాం కానీ అసలు ఈ కళ మనది కాదు. యూరప్ వారిది. అందుకే మన లలిత కళల్లో దీనికి చోటు లేదు. అయినప్పటికీ మిగతా కళలన్నిటికంటే భిన్నమైనది కనుక అందరినీ రంజింప చేసే కళగా ఈ ప్రక్రియ ఎదిగింది. రంగులు, కుంచెలు, కాన్వాస్‌లతో రోజుల తరబడి వేసిన పెద్ద పెయింటింగ్ కంటే ఇండియన్ ఇంక్‌తో పేపర్ పై నాలుగు గీతల్లో వేసిన కార్టూన్‌కి అందరూ స్పందిస్తారు. అందుకే ప్రపంచదేశాలన్నీ దీనిని ఆదరిస్తున్నాయి రాజకీయనాయకులపై వ్యంగ్యచిత్రాలు గీసే సంప్రదాయం బ్రిటీషు కార్టూనిస్ట్ డేవిడ్‌లో మొదలుపెట్టాడు. మనదేశంలో తొలి కార్టూనిస్ట్ కేరళకు చెందిన శంకర్ పిళ్లై. ఈయన 'శంకర్స్ వీక్లీ' అనే కార్టూన్ పత్రిక చాలా కాలం నిర్వహించారు. చిన్నారులకోసం ఢిల్లీలో ఓ కార్టూన్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. శంకర్ తర్వాత ఎందరో కార్టూనిస్టులు ఇప్పుడు పత్రికల్లో కనిపిస్తున్నారు. [ఇంకా... ]

భరతమాత బిడ్డలు - దాదాభాయి నౌరోజి

పేరు : దాదాభాయి నౌరోజి.
పుట్టిన తేది : 14-09-1825.
పుట్టిన ప్రదేశం : బొంబాయి.
చదివిన ప్రదేశం : బొంబాయి సొసైటీ స్కూల్.
చదువు : ఉపాధ్యాయుని చదువు చదివాడు.
గొప్పదనం : బాల్యవివాహాలను ఖండించి, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు.
స్థాపించిన సంస్థలు - "బోంబే అసోసియేషన్, పార్శీ జిమ్నాయిజం, విడోరీమ్యారేజి అసోసియేషన్, స్టూడెంట్స్ లిటరరీ అండ్ సైంటిఫిక్ సొసైటీ, లండన్ ఇండియా సొసైటీ".
ప్రారంభించిన పత్రిక : ఇండియా జర్నల్.
వ్రాసిన వ్యాసాలు : భారతదేశంలో పేదరికం, పేదరికం నిర్మూలన.
స్వర్గస్థుడైన తేది : 1919 వ సంవత్సరంలో స్వర్గస్థుడైనారు.

దాదాభాయి బొంబాయి మహానగరంలో 1825 సెప్టెంబర్ 4న ఒక పేద పార్శీ కుటుంబంలో జన్మించాడు. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. ఉన్నప్పుడు తింటూ, లేనప్పుడు పస్తులుంటూ కాలం వెళ్ళబుచ్చేవాడు. తన గారాల కుమారునికి ఆడుకోవడానికి బొమ్మలుకూడా కొనివ్వలేకపోయాడు. [ఇంకా... ]