Thursday, May 31
భక్తి సుధ - శ్రీ లక్ష్మీ నృసింహా అష్టోత్తర శతనామావళిః
2. ఓం మహాసింహాయ నమః
3. ఓం దివ్యసింహాయ నమః
4. ఓం మహాబలాయ నమః
5. ఓం ఉగ్రసింహాయ నమః
6. ఓం మహాదేవాయ నమః
7. ఓం ఉపేంద్రాయ నమః
8. ఓం అగ్నిలోచనాయ నమః
9. ఓం రౌద్రాయ నమః
10. ఓం శౌరాయ నమః [ఇంకా...]
శతకాలు - వేమన శతకము
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ! [ఇంకా...]
వంటలు - కాలీఫ్లవర్ పచ్చడి
కాలీఫ్లవర్ ముక్కలు - 1400 గ్రా. (వీస)
ఉప్పు - 1 డబ్బా.
కారం - 1 డబ్బా.
ఆవ పిండి - 1 డబ్బా.
నూనె - 350 గ్రా.
తయారు చేసే విధానం :
ముందుగా కాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి వీసె ముక్కలకు ఉప్పు, కారం కలిపిన మిశ్రమాన్ని ఆ ముక్కలలో వేసి కలిపి తాలింపు పెట్టి చల్లారిన తరువాత అందులో కలపాలి. [ఇంకా...]
నీతి కథలు - రామలింగడు-నలుగురు దొంగలు
Wednesday, May 30
వంటలు - లస్సీ
పెరుగు - ఒకటిన్నర కప్పులు.
ఐసుముక్కలు - ఆరు.
చల్లటినీళ్ళు - ఒకటిన్నర కప్పులు.
పంచదార - 2 టీస్పూన్లు.
ఉప్పు - చిటికెడు.
చెక్కరకేళీలు - 3.
తయారు చేసే విధానం :
ఐసుముక్కల తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసి బాగా నురుగువచ్చే వరకూ తిప్పాలి. పొడవాటి గ్లాసులో పోసి ఐసుముక్కలు వేసి అందించాలి. [ఇంకా...]
భక్తి సుధ - శ్రీ బిల్వాష్టకమ్
త్రిజన్మ పాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్.
2. త్రిశాఖై ర్బిల్పపత్రైశ్చ - హ్యచ్ఛిద్రైః కోమలై శ్శుభైః
శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణమ్. [ఇంకా...]
భక్తి గీతాలు - అంతరంగమెల్ల
వింతవింత విధముల వీడునా బంధములు
మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా
తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా [ఇంకా...]
Tuesday, May 29
పెద్దల ఆటలు - టీ ఆట
ఉదా:
అన్ని రంగాలలో ఉండే టీ - పోటీ
పండ్లరసంలో ఉండే టీ - ఫ్రూటీ
ఆఫీసులో ఉండే టీ - డ్యూటీ
అందమైన టీ - బ్యూటీ
పోలీసు వాడే టీ - లాటీ
పైన చెప్పిన విధంగా ఇంకా మీరు ఫ్రేం చేసుకొని అన్నింటిని వైట్ పేపర్లో వ్రాసి ఎదురుగా ఖాళీలు పెట్టి ఆ పేపర్ని మీ పార్టీలో ఉన్న మెంబర్స్ అందరికీ జీరాక్స్ తీయించి ఇవ్వాలి. [ఇంకా...]
భక్తి సుధ - శ్రీ వెంకటేశ సుప్రభాతమ్
ఉత్తిష్ఠ నరసార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం.
2. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద, ఉత్తిష్ఠ గరుడధ్వజ,
ఉత్తిష్ఠ కమలాకాన్త! త్రైలోక్యం మంగళం కురు.
3. మాతః సమస్త జగతాం మధుకైటభారేః - వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే,
శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే - శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతం
4. తవ సుప్రభాత మరవిందలోచనే - భవతు ప్రసన్న ముఖచంద్రమండలే,
విధిశంకరేంద్ర వనితాభిరర్చితే - వృషశైలనాధదయితే దయానిధే [ఇంకా...]
వంటలు - పొన్నగంటి కూర
పొన్నగంటి కూర - ఆరు కట్టలు(చిన్నవి).
ఉల్లిపాయలు - రెండు.
పచ్చికొబ్బరి చిప్ప - పావు.
నూనె - తగినంత.
పసుపు - చిటికెడు.
పోపులోకి కావలసినవి:
ఎండుమిరపకాయలు, మిపపప్పు, ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లి.
తయారు చేయు విధానం:
ఆకు కడిగి సన్నగా తరగాలి. ముందుగా పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. [ఇంకా...]
పండుగలు - గణతంత్ర దినోత్సవం
నీతి కథలు - ఉంగరం దొంగ ఎవరు?
ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు. అక్బర్‌ను ఏడిపించటానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పని చేస్తున్న ఒక అతన్ని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతని చేతికి ఇచ్చాడు. ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకొని తన దగ్గర దాచిపెట్టాడు. [ఇంకా...]
Monday, May 28
వంటలు - పండుమిరపకాయల పచ్చడి
పండు మిరపకాయలు - 1 కిలో.
ఉప్పు - డబ్బా మీద కొంచెం.
చింతపండు - 1/4 కిలో.
తయారు చేసే విధానం :
పండుమిరపకాయలు శుభ్రంగా తుడిచి ఉప్పు, చింతపండు, పండుమిరపకాయలు కలిపి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బవలెను. [ఇంకా...]
సాహిత్యం - సూక్తులు
అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
కష్టాలను జయించడానికి నిస్పృహకంటే చిరునవ్వు చాలా బలవంతమైనది.
తన అఙ్ఞానాన్ని గురించి గ్రహించినవాడే నిజంగా తెలివైనవాడు.
పరులను జయించినవాడు విజేత, తనను తాను జయించినవాడు మహా విజేత.
వాడని ఇనుము తుప్పు పడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది. [ఇంకా...]
వంటలు - మినపచెక్క వడలు
నల్ల మినుములు - 500 గ్రా.
జీలకర్ర - 10 గ్రా.
మిరియాలు - 5 గ్రా.
పచ్చిమిర్చి - ఆరు.
కొత్తిమీర - 2 కట్టలు.
ఉల్లిపాయలు - రెండు.
ఉప్పు - తగినంత.
రిఫైన్డ్ ఆయిల్ - వేయించడానికి సరిపడినంత.
తయారు చేసే విధానం :
మినుముల్ని నానబెట్టండి. తరువాత జల్లెడలో వడగట్టి గంటసేపు ఆరబెట్టండి. కాస్త తడిగా ఉన్న మినుముల్లో మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి గట్టిగా రుబ్బండి. ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, ఉప్పు కలపండి. [ఇంకా...]
Saturday, May 26
వంటలు - కొబ్బరి అన్నం
బియ్యం లేదా పలావు బియ్యం - అరకిలో.
కొబ్బరికాయ - ఒకటి.
ఉప్పు - తగినంత.
ఎండుమిర్చి - నాలుగు.
పచ్చిమిర్చి - నాలుగు.
మినపప్పు - రెండు స్పూన్లు.
శనగపప్పు - రెండు స్పూన్లు.
ఆవాలు - ఒక స్పూను.
కరివేపాకు - రెండు రెమ్మలు.
నెయ్యి లేదా రిపైన్డ్ ఆయిల్ - అర కప్పు.
జీడిపప్పు - కొద్దిగా.
కిస్‌మిస్ - కొద్దిగా.
తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం శుభ్రం చేసుకుని అన్నం వండాలి. (అన్నం పొడిపొడిగా ఉండాలి) కొబ్బరి తురిమి ఉంచాలి. ఓ వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి, సగం నూనె పోసి కలపాలి. స్టవ్ మీద కళాయి పెట్టి మిగతా సగం నూనె పోసి కాగిన తరువాత పోపు వేసి అవి వేగిన తరవాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించాలి. [ఇంకా...]
వంటలు - సగ్గుబియ్యం వడియాలు
సగ్గుబియ్యం - 1 కప్పు.
మంచినీళ్లు - 4 కప్పులు.
పచ్చిమిర్చి - 4.
జీలకర్ర - కొద్దిగా.
ఉప్పు - తగినంత.
నువ్వులపప్పు - పావుకప్పు.
తయారు చేసే విధానం :
మందపాటి గిన్నెలో నీళ్లు పోసి స్టవ్‌మీదపెట్టాలి. బాగా మరిగిన తరవాత సగ్గుబియ్యం పోసి మంట తగ్గించాలి.
మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఓ గంటసేపు సగ్గుబియ్యాన్ని ఉడికించాలి. [ఇంకా...]
నీతి కథలు - అభిమాని
Thursday, May 24
నీతి కథలు - కలిసి ఉంటే కలదు సుఖం
పండుగలు - శ్రీ నృసింహ జయంతి
ప్రహ్లాద భేద పరిహార పరావతార లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్
సంసార కూప మతిఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్పసమాకులస్య
దీనస్యదేవ కృపాయ శరణాగతస్య లక్ష్మినృసింహ మమదేహి కరావలంబమ్
అని తొలుత అలా! శ్రీ నృసింహస్వామివారిని ప్రార్థించి ఆ స్వామి వారి ఆవిర్భావమునకు గల కారణాలు ఏమిటో? ఒక్కసారి మననంచేసుకుందాం! [ఇంకా...]
నీతి కథలు - అసూయ
వంటలు - పానీపూరీలు
బొంబాయి రవ్వ - అరకప్పు.
మైదా - అరకప్పు.
నెయ్యి - 4 స్పూన్లు.
సోడా ఉప్పు - చిటికెడు.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం :
ముందుగా మైదా పిండి, బొంబాయి రవ్వ జల్లించి ఒకగిన్నెలో పోసి, నెయ్యి, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్ళతో చపాతీ పిండిలా కలపాలి. ఆ పిండిపైన తడి బట్ట వేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరవాత దాన్ని సమానమైన ఉండలు చేసి అంగుళంన్నర సైజులో పూరీల్లా వత్తాలి. [ఇంకా...]
Wednesday, May 23
వంటలు - బియ్యపిండి వడియాలు
బియ్యపిండి - 2 కప్పులు.
మంచినీళ్లు - 4 కప్పులు.
పచ్చిమిర్చి - 8.
ఉప్పు - తగినంత.
జీలకర్ర - కొద్దిగా.
నువ్వులపప్పు - 4 టీస్పూన్లు.
తయారు చేసే విధానం :
మందపాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లుపోసి, స్టవ్‌మీద పెట్టాలి. బియ్యప్పిండిలో రెండు కప్పుల చల్లటి నీళ్లు పోసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్‌మీద నీళ్లు బాగా మరిగిన తరువాత బియ్యప్పిండిలో నీళ్లను పోసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పిండి ఉడికిన తరువాత మెత్తగా దంచిన పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిశ్రమాన్ని వేయాలి. నువ్వులపప్పు కూడా వేసి కలపాలి. చల్లారిన తరవాత జంతికల గొట్టంలో ఈ పిండి ఉంచి ప్లాస్టిక్ కవర్‌మీద జంతికల మాదిరిగా కావలసిన సైజులో వత్తి ఎండలో పెట్టాలి. బాగా ఎండిన తరవాత జాగ్రత్తగా విరిగిపోకుండా డబ్బాలో భద్రపరచాలి. ఇదే పిండితో చిన్న చిన్న వడియాలు కూడా పెట్టుకోవచ్చు. [ఇంకా...]
భక్తి గీతాలు - తెలిసిన వారికి దేవుండితడే
వలవని దుష్టుల వాదములేల
పురుషులలోపల పురుషోత్తముడు
నరులలోన నరనారాయణుడు
పరదైవములకు పరమేశ్వరుడు
వరుసమూఢుల కెవ్వరోయితడు [ఇంకా...]
వంటలు - కాలీఫ్లవర్ పరోటాలు
గోధుమ పిండి - రెండు కప్పులు.
మంచినీళ్లు - తగినన్ని.
ఉప్పు - తగినంత.
నూనె - తగినంత.
పరోటాలోకి
కాలీఫ్లవర్ తురుము - రెండు కప్పులు.
పచ్చిమిర్చి - రెండు సన్నగా తురిమినవి.
కొత్తిమీర - ఒక టీస్పూను.
కారం - అర టీ స్పూను.
ఉప్పు - తగినంత.
తయారు చేసే విధానం :
గోధుమపిండి జల్లించి ఉప్పు, నీళ్లు వేసి చపాతీ పిండిలా కలపాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, తురిమిన కాలిఫ్లవర్ అన్నీ బాగా కలిపి నీళ్లు పిండేయాలి. ఇందులో కారం వేసి బాగా కలపాలి. పరోటాపిండిని చిన్న చిన్న ముద్దలుగ చేసుకోవాలి. [ఇంకా...]
పిల్లల పాటలు - జన్మభూమి
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము. [ఇంకా...]
అవీ, ఇవీ కొనుక్కునేటప్పుడు - కుక్కర్
- కుక్కర్‌లో పదార్థాలను వండేటప్పుడు మొత్తం గిన్నెలతో నింపకూడదు. మూతకు, గిన్నెకు మధ్య కొంచెం గ్యాప్ ఉంచాలి.
- ఆవిరి బయటకు వస్తున్నప్పుడు మాత్రమే వెయిట్ పెట్టాలి తప్ప ముందుగానే పెట్టేయకూడదు.
Monday, May 7
పిల్లల పాటలు - ముద్దుబిడ్డలు
పిల్లల్లారా! బుడతల్లారా
నవ్వులు రువ్వే పువ్వుల్లారా
రాగాలొలికే పిట్టల్లారా
పాటలు పాడే కూనల్లారా [ఇంకా...]
పుణ్యక్షేత్రాలు - మంగళ గిరి
ఇటు విజయవాడ నుండి సిటీ బస్సులు, అటు కాకాని నుండి విజయవాడ వచ్చే బస్సులలోను మంగళగిరి రావచ్చు. మంగళగిరి ఎన్నో శతాబ్దాలుగా పేరొందిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు భక్తుల పూజలందుకుంటున్నారు. ఒకరు ఎగువ సన్నిధి పానకాల నరసింహస్వామి, రెండవ వారు దిగువ సన్నిధి లక్ష్మీనరసింహస్వామి కాగా, కొండ శిఖరాగ్రాన గండాల నరసింహస్వామి మూడవవారు. కృష్ణానదికి అతి దగ్గరలో యీ వైష్ణవక్షేత్రం నెలకొని వుంది. [ఇంకా...]
వంటలు - సబ్జా షర్బత్
కావలసిన వస్తువులు:
సబ్జా | - | ఒక స్పూన్. |
చక్కెర | - | తగినంత. |
నీళ్ళు | - | ఒక గ్లాసు. |
తయారు చేసే విధానం :
సబ్జాను ముందుగా వేడినీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. ఒక గ్లాసు నీళ్ళలో చక్కెర తగినంత వేసి బాగా కలిపి దానిలోకి నానబెట్టిన సబ్జాను వేసి బాగా కలపాలి. సబ్జా నీళ్ళు చల్లగా కావాలంటే తరువాత కొంచం సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. [ఇంకా...]
Saturday, May 5
పండుగలు - కూర్మ జయంతి
భక్తి గీతాలు - పురుషోత్తముడవీవు
పురుషోత్తముడవీవు పురుషాధముడనేను
ధరలోననాయందు మంచితనమేది
అనంతాపరాధములు అటునేముసేసివి
అనంతమైనదయ అది నీది
నినునెఱగకుండేటి నీచ గుణము నాది
ననునెడయకుండేటి గుణము నీది [ఇంకా...]
Friday, May 4
భక్తి గీతాలు - ఏమొకో చిగురుటధరమున
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు
నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా [ఇంకా...]
పిల్లల ఆటలు - గురి చూసి విసరడం
ఎంతమంది ఆడవచ్చు | : | ఎంతమంది అయినా. |
ఆడే స్థలం | : | ఖాళీ స్థలంలో. |
కావలసిన వస్తువులు | : | క్రింద ఇచ్చిన వస్తువులు. |
ఆటగాళ్ల వయస్సు | : | ఏ వయసు వారైనా. |
ఈ ఆటంటే భలే సరదా పిల్లలకు, గురిచూసి విసరడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. చిన్న చిన్న రాళ్ళు గురిచూసి విసరడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ ఆట ఆడదామంటే ఉరుకులు పరుగులతో ముందుకొస్తారు. [ఇంకా...]
వంటలు - కొబ్బరి అట్టు
కావలసిన వస్తువులు :
కొబ్బరికాయ | - | ఒకటి. |
బియ్యం | - | రెండు కప్పులు. |
ఉప్పు | - | తగినంత. |
జీలకర్ర | - | ఒక స్పూను. |
పచ్చిమిరపకాయలు | - | 6. |
నూనె | - | అర కప్పు. |
తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంచేసి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, వేసి మెత్తగా దోసెల పిండిలా గ్రైండ్ చేయాలి. తరవాత పెనం మీద నూనె వేసి ఓ గరిటెడు పిండి వేసి పలుచగా దోసెలు పోసి రెండువైపులా కాల్చాలి. వీటిని వేడివేడిగా కారప్పొడితో తింటే బాగుంటాయి. [ఇంకా...]
శతకాలు - శ్రీ కాళహస్తీశ్వర శతకము
శ్రీ విద్యుత్క వితాజవంజన మహాజీమూత పాపాంబుధా
రావేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్
దేవా! మీ కరుణా శరత్సమయమింతేచాలు, చిద్భావనా
సేవందామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా! [ఇంకా...]
నీతికథలు - సమయస్ఫూర్తి
సరళ,రాధ ఇద్దరూ బస్సుదిగి మాట్లాడుకుంటూ రంగాపురంలోకి వస్తున్నారు. వారిద్దరి ఒంటి మీద దాదాపు లక్షరూపాయల విలువగల బంగారముంది. సరిగ్గా అదే సమయంలో రంగన్న వీరిద్దరినీ చూశాడు.
నల్లటి చారలున్న బనియన్, గళ్ళ లుంగీ, పొడవైన మీసాలు, పెరిగిన జుట్టుతో రంగన్నను చూస్తే చిన్న పిల్లలు సైతం జడుసుకుంటారు. అతని పేరు వింటే చాలు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరూ హడలిపోతారు. [ఇంకా...]