Thursday, November 29

మీకు తెలుసా - గడ్డం - గత వైభవం

ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం సాక్షిగా జరిగేవి. మనిషి గడ్డాన్ని పట్టుకోవడం అన్నది క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో సన్నిహిత స్నేహానికి గుర్తుగా పరిగణింపబడేది. గడ్డాన్ని పట్టుకొని లాగడం అన్నది మొరటైన పనిగా మాత్రం కాదు అతి అవమానకరమైన పనిగా గుర్తింపబడేది. కొంతమంది గడ్డాన్ని వివేకపు చిహ్నంగా పరిగణిస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టువారి సంఘంలో గడ్డం ఒక హోదాను సూచించేది. గడ్డం ఎంత పొడవుగా ఉంటే వారు అంత గొప్ప హోదాకలవారిగా గుర్తింపబడేవారు.  [ ఇంకా...]

Wednesday, November 28

నీతి కథలు - తగిన శాస్తి

అనగనగా ఒక పెద్ద అడవి వుండేది. ఆ అడవిలో ఒక గుర్రం, గేదె వుండేవి. అవి పక్క పక్కనే మేస్తుండేవి. ఒకే సెలయేటిలో నీళ్ళూ కూడా తాగేవి. కానీ వాటికి ఏనాడు పడేదికాదు. ఎప్పుడూ పోట్లాడుకునేవి. . నేను గొప్పంటే నేను గొప్పని బడాయిలు పోయేవి. ఎప్పటిలానే ఒక రోజు ఆ రెండూ పోట్లాడుకున్నాయి. కోపం ఆపుకోలేని గేదె తన కొమ్ములతో గుర్రాన్ని బాగా పొడిచింది.  [ ఇంకా...]

ఆహార పోషణ - చక్కెర వ్యాధి-చేదు నిజాలు

ఎబెర్స్ పేపిరస్ (ఈజిప్టు, 1500 బి.సి.)లో చక్కెర వ్యాధి అనే మాట వాడబడింది. మన దేశపు సుప్రసిద్ధ వైద్యుడు శుశ్రుతుడు క్రీ.పూ. 400లో ఈ వ్యాధిని తేనె మూత్రంగా అభివర్ణించాడు. క్రీ.శ. ఆరంభమైన మొదటి శతాభ్దంలోనే ఈ వ్యాధి రోం, చైనా, జపాను భాషా గ్రంధాలలో నమోదై ఉంది. డయాబెటిస్ అన్న పదాన్ని తొలుత గ్రీకులు వాడారు. ఈ పదం నీళ్ళ ద్వారా విసర్జనం అన్న అర్ధాన్ని ఇస్తుంది. మూత్రాన్ని వేడిచేసి పరీక్షించి, ఆవిరి చేసి డాక్టర్ విల్లిస్ 1674లో అందులో జిగటలాంటి పదార్ధం ఉందని కనుగొన్నాడు. ఆ ఉన్న వస్తువు చక్కెరే. కానీ అప్పట్లో ఇంగ్లాండు వారికి చక్కెర విషయం తెలియదు.  [ ఇంకా...]

విజ్ఞానం - కల్తీలను కనిపెట్టండి

ఆహార వస్తువులను కల్తీ చేయడం నేరం. కల్తీ పదార్ధాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఖనిజ తైలంతో కల్తీ చేసిన ఆవ నూనును ఉపయోగించిన వ్యక్తికి కంటిదృష్టి పోవచ్చు లేక గుండె జబ్బు రావచ్చు. సున్నితమైన రంపపు పొట్టుతో కల్తీ చేసిన మిరపకాయల పొడి తిన్న వారికి ఆరోగ్యం చెడిపోతుంది. [ ఇంకా...]

నాటికలు - తెలుగు నాటక రంగం చరిత్ర

కావ్యాంత నాటకం" అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అన్ని కావ్య ప్రక్రియలలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకమని అర్ధం. కవిత్వం, వ్యాసం, కథ... ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలను స్పృశించిన తరువాత మాత్రమే నాటకాన్ని రచించాలని ఆయన తెలిపాడు. అప్పుడు మాత్రమే నాటక రచనకు నిండుదనం చేకూరుతుందని ఆయన భావన.  [ ఇంకా...]

Tuesday, November 27

వ్యక్తిత్వ వికాసం - కల్పనా శక్తి (క్రియేటివిటీ)ని పెంచడమెలా?

మంచి ఆలోచనలు, కల్పనలు కేవలం పిల్లలకూ, రచయితలకూ, కళాకారులకే సొంతం కాదు. నిజం చెప్పాలంటే ఆలోచన, కల్పన అన్నది ప్రతి ఒక్కరి మేధాసంపత్తిపై ఆధారపడివుంటుంది. ఈ కల్పనాశక్తిని మనం మనకు అనుకూలమైన విధంగా, లాభాన్ని తెచ్చేవిధంగా మలచుకోవచ్చు. తన కల్పనాశక్తి ఆధారంగా పేరుప్రఖ్యాతులు గడించిన సోమర్సెట్ మాం ఒకసారి "కల్పనాశక్తి కసరత్తువల్ల అధికమవుతుంది. అందరూ అనుకుల్లట్లు కాకుండా యువకులలోకంటే అనుభవజ్ఞులైన వారిలోనే శక్తివంతమైన కల్పనలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి" అన్నాడు. [ ఇంకా...]

Monday, November 26

వంటలు - చిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:
చిక్కుడు కాయలు : 1/2 కిలో.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.

తయారుచేసే విధానం:
చిక్కుడు కాయలు కడిగి ఈనలు తీసివేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి, పొయ్యి మీద గిన్నె పెట్టి తాలింపు వేసి ఈ చిక్కుడు ముక్కలు వేసి, కారం, ఉప్పు వేసి కొంచం నీళ్ళు పోసి మగ్గే వరకు ఉంచి దించాలి. [ ఇంకా...]

మీకు తెలుసా - నోబెల్ బహుమతి నేపథ్య కథ

స్వీడెన్‌కు చెందిన నోబెల్ బహుమతి గురించి ప్రపంచమంతటికీ తెలుసు. 1833లో స్టాక్‌హోంలో జన్మించి, 1896 డిసెంబెర్ 10న శాన్‌రెమోలో మరణించిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాను అనుసరించి "ది నోబెల్ ఫౌండేషన్" స్థాపించబడింది. 1895లో నవంబర్ 27న వ్రాసిన వీలునామా ద్వారా ఆల్ఫ్రెడ్ నోబెల్ తన యావదాస్తిని 30 మిలియన్ క్రోనార్‌లకు మించినది (19.40 క్రోనార్లకు ఒక స్టెర్లింగ్ సమానం) ఒక నిధికి చట్టపూర్వకంగా వ్రాసి ఇచ్చారు. ఈ నిధిపై వచ్చే వడ్డీని అంతకుముందు సంవత్సరాలలో మానవాళికి అత్యంత ఉపయోగకరమైన సేవలందించిన వారికి ప్రతి సంవత్సరం చెల్లించాలని ఆ శాసనంలో వ్రాశారు. [ ఇంకా...]

విజ్ఞానం - మనోదక్షతకు మార్గాలు

తమ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకునేందుకు క్రీడాకారులు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. శారీరకంగా ఎంతో దృఢంగా తయారవుతూ మరిన్ని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. ప్రతి మనిషీ ఏ రంగంలో ఉనా మానసికంగా కూడా అటువంటి శక్తి సామర్ధ్యాలను సంపాదించుకోవచ్చు. మానసికి శక్తి సామర్ధ్యాలను విస్తృతపరుచుకుంటే సావధానత పెరుగుతుంది. దానివల్ల కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే చతురత ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక ఉన్నతిని సాధించవచ్చు. అనేకమైన లాభాలను పొందవచ్చు. [ ఇంకా...]

నాటికలు - బాబోయ్ కవి

అంజి: (బస్కీలు తీస్తూ) : 95, 96, 97, 98, 99, 100 ...(అని బస్కీలు తీసి, అక్కణ్ణుంచి లేచి, రూంకి ఒక మూల పడేసున్న స్కిప్పింగ్ రోప్‌ని తీసుకుని కాసేపు స్కిప్పింగ్ చేసి, తాడుని దూరంగా విసిరేసి, చైర్ మీద ఆరేసున్న టవల్‌ని తీసుకుని మొహం తుడుచుకుని, క్రింద చాప మీద పడుకున్న మూర్తిని నిద్ర లేపుతూ) మూర్తీ! లేరా! (తట్టి) రేయ్ మూర్తీ! నిద్ర లేవరా! టైం ఎనిమిది దాటింది లే! లే! [ ఇంకా...]

Saturday, November 24

నీతి కథలు - అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు.తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. [ ఇంకా...]

అందరి కోసం - అంత్యాక్షరికి ఉపయోగపడే పల్లవులు

రామచిలకమ్మా కొమ్మల్లో దాగిపోకమ్మా వాన చినుకమ్మ మబ్బులో ఆగిపోకమ్మా
చెంతే ఉన్న సొంతం కాని పాలరాతి బొమ్మా ఏంచేయాలే జంటే ఉన్న బ్రహ్మచారి జన్మ
చెప్పమ్మా చిన్నారి, చూపమ్మా నాదారి రామచిలకమ్మా.
[ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - మృత్యువుకు భయపడవద్దు

ఒక చెట్టునుంచి రాలే ఆకు మృత్యువుకి భయపడుతుందా? ఒక పక్షి మృత్యువుకు భయపడుతూ జీవిస్తుందని అనుకుంటున్నావా? మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు దానిని అది కలుసుకుంటుంది. అంతేగాని మృత్యువును గురించి ఆందోళన చెందదు. కీటకాలను పట్టుకు తింటూ, గూళ్ళు నిర్మించుకుంటూ, పాటలు పాడుకుంటూ, నిశ్చింతగా జీవించడానికి కుతూహలపడుతుంది. [ ఇంకా...]

మీకు తెలుసా - దువ్వెన కథ

దువ్వెన జటిలమైన యంత్ర పరికరం కాకపోయినప్పటికీ అది ఏమిటో మనిషికి తెలియని రోజులు ఉండేవి. పురాతన ఈజిప్టులోని మనుషులు తమ కేశాలను మందు నీరు, తైలాలు, సుగంధ్ వస్తువులతో జాగ్రత్తగా సంస్కరించుకునేవారు. వారి జుట్టుని ఒక రకమైన ముళ్ళతో ఉన్న పుల్లలతోను, చేపల అస్థిపంజరాలతో దువ్వుకునేవారు. [ ఇంకా...]

Friday, November 23

పిల్లల ఆటల సూచిక - సెన్సిబుల్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు : ఎంతమందైనా.
ఆడే స్థలం : గదిలో, ఆరుబయట ఆడవచ్చు.
కావలసిన వస్తువులు : కాఫీ పొడి, రెండు రకాల పళ్ళముక్కలు , టీ పొడి, మట్టి, సబ్బుబిళ్ళ, ఇంకు, నిమ్మ ఆకులు, ప్లాస్టిక్, చెక్క , ఈకలు, పెన్ను, ఏనుగు బొమ్మ, కళ్ళజోడు.
ఆటగాళ్ల వయస్సు : 6 సం రాల నుండి.
ఈ ఆట ఆడటానికి మనిషి కుండే సెన్సెస్-రుచి , వాసన, స్పర్శ లని ఉపయోగించాలి . ఆటలో పాల్గొనేవారి కళ్ళకి గంతలు కట్టాలి.
[ ఇంకా...]

ఆధ్యాత్మికం - సన్మార్గ జీవితం

మన మనస్సు, మాట, ప్రవర్తన నిష్కల్మషంగా ఉండాలంటే ఒకటే మార్గం. ఎప్పుడూ సదాలోచనలతో, సత్కార్యాలు చేస్తూండాలి. సమర్ధ రామదాసు, తులసీదాసు, అప్పయ్య దీక్షితారు, తాయుమానపర్, పట్టినత్తార్ మొదలైన భక్తులు, తేవారం మొదలైన వాటిని రచించిన అందరూ భగవంతుని భక్తులుగా ఉంటూ మనసులోగానీ, చేతల్లోగానీ, ప్రవర్తనలోగానీ ఏనాడూ ఎట్టి పాపం ఆచరించలేదు. [ ఇంకా...]

Thursday, November 22

స్త్రీల పాటలు - సీతాదేవి పెండ్లి పాట

సీతాకళ్యాణ మహోత్సవ సమయము చూతము రారెచెలీ
రాతి నాతిగ చేసి ఘోరాసుర వర్గమునెల్ల దునిమి
భూమిజచేకొని జనకసుత ప్రఖ్యాతిగ వరించినాడట ...సీతా...

బంగారు మంటపాంతరమున నవరత్న శృంగార పీఠమందు
రంగుగ చేమంతి విరుల రంగుదండలు కాంతివైనుప్పొంగి
తొంగిచూచుటకు రఘుపుంగవుండు వేంచేసి వేడిన ...సీతా... [ ఇంకా...]

వ్యక్తిత్వ వికాసం - వృద్ధ తరంగం - విశేషాలు

60 లేదా 60 సంవత్సరాలకు మించిన వ్యక్తులను ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారు వయసుమళ్ళిన వారిగా భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి 60 లేదా అంతకు మించిన వయసు కలిగివున్నారు. 2050 నాటికి మన జనాభాలోని 27 శాతం, 80 లేక అంతకుమించిన వారితో కూడివుంటుంది. వయసు మళ్ళిన వారిలో అధిక సంఖ్యాకులు ఆడవారు. 80 అంతకు మించి వయసున్న వారికో ఆడవారి శాతం 65. [ ఇంకా...]

మీకు తెలుసా - స్టెతస్కోప్

వైద్యులు గుండె, ఊపిరితిత్తులు, ఉదరం లాంటి అవయవాల చప్పుడు విని పరీక్షించడానికి వాడే స్టెతస్కోప్ ఒక పరికరం. దానిని రెని థియోఫిల్ హయసింత్ లేనెక్ అనే ఫ్రెంచ్ వైద్యుడు 1819లో కనుగొన్నాడు. 1781 నుండి 1826 వరకు జీవించిన లేనెక్ ప్రతిభాశాలియైన కల్పనాచరుతుడే కాక అనుభవశాలియైన వైద్యుడు కూడా. 1816లో అతను ఒక యువతిని పరీక్షించసాగాడు. [ ఇంకా...]

Wednesday, November 21

మీకు తెలుసా - కాఫీ

కాఫీ మొక్క గింజల నుండి తయారుచేయబడే వేడి పానీయం. కాఫీ దాక్షిణాత్యులకు అత్యంత ప్రియమైన పానీయం. మొత్తం ప్రపంచంలో కాఫీని అతి ఎక్కువగా వాడే దేశాలలో ఒకటిగా మన దేశం గుర్తింపబడుతోంది. ప్రాధమికంగా ఇది పాశ్చాత్యుల పానీయం. గ్రీన్ కాఫీ అన్నది ఒక ప్రత్యేక రకము. దీన్ని చాలామంది అమెరికన్లు ఇష్టపడతారు. 13వ శతాబ్దంలో కాఫీ గింజల నుండీ రుచికరమైన పానీయాన్ని అరబ్బులు తొలిసారిగా తయారుచేశారు. [ ఇంకా...]

విజ్ఞానం - ప్రణాళిక

మన రోజువారీ కార్యకలాపాలలో ప్రణాళిక అన్నది చాలా ముఖ్యమైనది. దీనికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం చాలా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. ముఖ్యంగా మన కోరికలను, లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు బాగా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదెద్దుకోవడానికి ప్రణాళిక అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. [ ఇంకా...]

Tuesday, November 20

ఆధ్యాత్మికం - గురునానక్

గొప్ప సంఘసంస్కర్తగా, మత గురువుగా ప్రసిద్ధిని పొందిన గురునానక్ 15వ శతాబ్దానికి చెందిన అతి విశిష్టమైన వ్యక్తి. ఇతడు పవిత్రతనూ, న్యాయాన్నీ, మంచితనం, భగవత్ ప్రేమలాంటి విషయాలను గురించి ప్రజలకు ఉపదేశం ఇచ్చాడు. లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న నగరం)కు సమీపంలో ఉన్న తల్వండి రాయె భోయిలోని ఖత్రీల కుటుంబంలో గురునానక్ 1469 ఏప్రిల్ 15వ తారీఖున పౌర్ణమి రోజున జన్మించాడు. [ ఇంకా...]

విజ్ఞానం - వ్యక్తిత్వ వికాసం

వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. వ్యక్తిత్వం లేకపోతే మనిషి ఇతరులపై ఆధారపడవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడ్డప్పుడు మనిషికి గౌరవం వుండదు. గౌరవం లేని వ్యక్తి జీవితం దుఃఖమయమవుతుంది. దుఃఖం మనిషిని జీవితాంతం మానసికంగాను, శారీరకంగానూ కృంగదీస్తుంది. అందువల్ల వ్యక్తిత్వానికి అంత ప్రాముఖ్యత వుంది మరి. ప్రతి మనిషి తనదంటూ ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. వ్యక్తిత్వం వల్లనే మానవుడు మహనీయుడు కాగలడు. [ ఇంకా...]

సంగీతం - ముత్తుస్వామి దీక్షితర్

కర్ణాతక సంగీతత్రయంలో ఒకరైన వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితర్ 1775లో పుట్టాడు. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా వీరు పుట్టారు. భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. [ ఇంకా...]

అందరికోసం - హాస్య సంపద

కొత్త కుక్క
రాము : ఓరే గోపీ మా యింటికి రారా.
మా కొత్త కుక్క పిల్లను చూద్దువుగాని
గోపి : అమ్మో! అది కరవదా?
రాము : ఆ విషయం తెలుసుకోవడానికే నిన్ను పిలుస్తున్నది.
గోపి : ????? [ ఇంకా
...]

సాహిత్యం - భాష - ఉత్పత్తి

మానవ జీవితం సుఖ దుఖాల సమ్మేళనం. తనలో సంఘర్షణలను రేకెత్తిస్తున్న భావాలను, తన కష్ట సుఖాలను సాటి మానవుడితో పంచుకోవడానికి ఆది మానవుడు సంజ్ఞలు (Gestures) చేసేవాడు. వాటి ద్వారా ఒకరినొకరు సమాచారాన్ని పరస్పరం వ్యక్తపరుచుకునేవారు. ముఖ వికాసం వలన సుఖాన్ని, ముఖ వికారం వలన దుఖాన్ని బహిర్గతం చేసుకునేవారు. అట్లేగాక కొన్ని ధ్వనుల ద్వారా కూడా అంతరంగాన్ని వెల్లడించుకునేవారు. అంటే అభిప్రాయాన్ని వ్యక్తపరచే ఒక సాధనం భాష అన్నమాట. [ ఇంకా...]

Monday, November 19

విజ్ఞానం - మన ఆంధ్రప్రదేశ్

భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఒక ప్రకాశవంతమగు అధ్యాయము. భారతదేశపు భాగ్యవిధాతగా, అన్నపూర్ణగా వాసికెక్కిన రాష్ట్రం మనది. ఎందరో మహానుభావుల త్యాగఫలంగా సంపాదించుకొన్న తొలిభాషా రాష్ట్రం మనది. అంతకు ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేది. క్రీ శే పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణంతో ఏర్పడ్డ మన రాష్ట్రం అనతి కాలంలోనే సర్వతోముఖాభివృద్ధి చెందింది. త్రిలింగ భూమిగా పేరు గాంచిన తెలుగునేలే నేటి ఆంధ్రప్రదేశ్‌గా రూపొంది విరాజిల్లుతోంది. [ ఇంకా...]

వంటలు - కట్‌లెట్

కావలసిన వస్తువులు:
ఉడికించి చితిపిన ఆలుగడ్డ - 2 కప్పులు.
పెసర మొలకలు - 1 కప్పు.
పచ్చిమిరపకాయలు - 2 (సన్నగా తరగాలి).
అల్లం - చిన్న ముక్క (సన్నగా తరగాలి).
గరం మసాలా - 1/2 చెంచా.
తరిగిన క్యారెట్ - 2 గరిటెలు.
బ్రెడ్డు - 2 స్లైసులు
నెయ్యి లేదా నూనె - వేయించడానికి సరిపడినంత.
ఉప్పు - తగినంత.

తయారు చేసే విధానం:
క్యారెట్ ఉడికించి సన్నగా ముక్కలు తరిగి కాస్త మెత్తగయ్యేలా చితపాలి. [ ఇంకా...]

వంటలు - అల్లం కొత్తిమీర వంకాయ కూర

కావలసిన వస్తువులు:
వంకాయలు - 10.
పచ్చిమిర్చి - 30 గ్రా.
అల్లం పేస్ట్ - 20 గ్రా.
ఉల్లిపాయలు (తరిగి) - తగినన్ని.
కొత్తిమీర - 2 కట్టలు.
జీరా - 10 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారుచేసే విధానం:
ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీరా, కొత్తిమీర మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ తయారుచేసుకోవాలి.
[ ఇంకా...]

నీతి కథలు -పులి మీసం

ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె వుంటున్న ఊరికి ఒక ఋషి వచ్చాడు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొదుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతి కొన్ని కష్టాలు వున్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా వున్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. [ ఇంకా...]

పిల్లల పాటలు - ఆడుకుందాం రారండి

పిల్లల్లారా రారండి
పిడికెడు బియ్యం తెండి
ఆడుకుందాం రారండి
అట్టుముక్కలు తెండి [ ఇంకా
...]

Saturday, November 17

పిల్లల పాటలు - వేసవి సంబరాలు

సైకిల్ స్కూటీ సంబరము
ఆటో మోటార్ సంబరము
జీపులు బస్సుల సంబరము
చికుబుకు రైలు సంబరము
కోటల తోటల సంబరము
కొండలు కోనల సంబరము [ ఇంకా...]

వంటలు - మినప పొట్టుతో వడియాలు

కావలసిన వస్తువులు:
మినపప్పు - 1 కప్పు.
మినపొట్టు - 4 కప్పులు.
ఇంగువ - కొద్దిగా.(ఇష్టమైతేనే).
ఉప్పు - తగినంత.
పచ్చిమిరపకాయలు - పది.

తయారు చేసే విధానం :
ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి. తరవాత పొట్టు, ఉప్పు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు పోసి రుబ్బాలి(మరీ మెత్తగా వద్దు). మినప వడియాల మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి. [ ఇంకా...]

వంటలు - మాల్‌పురా

కావలసిన వస్తువులు:
పేమిరవ్వ లేదా బొంబాయి రవ్వ - 1 కప్పు.
మైదా - 1 కప్పు.
పాలు - 4కప్పులు.
పంచదార - 1 1/2 కప్పులు.
మంచినీళ్లు - 1 కప్పు.
ఎసెన్స్ - 3చుక్కలు.
బాదం, పిస్తాపప్పు - కొద్దిగా.
నూనె - వేయించడానికి సరిపడా.

తయారు చేసే విధానం:
మైదా, బొంబాయి రవ్వల్ని బాగా కలిపి అందులో పాలు పోసి పూరీ పిండిలా కలపాలి. ఈ పిండిముద్దను ఫ్రిజ్‌లోగానీ తడిబట్ట కప్పిగానీ పది నిమిషాలు ఉంచాలి. [ ఇంకా...]

నీతి కథలు - ధర్మబుద్ధి

పూర్వము రంగాపురం అనే గ్రామములో ధర్మయ్య అనే ఆసామి కలడు. ఆయన భార్య సుమలత. వారిద్దరూ ధర్మబుద్ధిగలవారు. పాపభీతి, దైవభక్తిగలవారు. వారు వ్యాపారము లో బాగా సంపాయించటమేగాక దాన ధర్మాలు చేయటంలో కూడా కీర్తి ప్రతిష్ఠలు గడించారు. పేదలకు భోజనము పెట్టందే తినేవారుకాదు. ధర్మయ్య, సుమలత దంపతులకు ముగ్గురు కుమారులు కలిగి యుక్తవయసుకి వచ్చారు. [ ఇంకా...]

Friday, November 16

పిల్లల పాటలు - బడి గంట మోగింది

బడి గంటదిగో బడి గంటదిగో
గణగణమోగెను బడిగంటదిగో
పలకా బలపం చేతను పట్టి
పుస్తకాల సంచి మూపునబెట్టి
పరుగున పోవాలి బడికి
వడిగా పోవాలి బడికి [ ఇంకా
...]

నీతి కథలు - శ్రధ్ధ లోపించిన పూజ

ఒక ఊరిలో ఒక ధనికుడు నివసించుచుండెను. అతనికి ఆస్తిపాస్తులు కొల్లలుగా గలవు. వ్యాపారము, వ్యవసాయము రెండింటియందును అతడు ధనమును బాగుగా గడించి శ్రీమంతుడయ్యను.
రెండు మూడు పెద్ద భవనములు కూడ అతనికి కలవు. అతని ఇంటిలో ఎందరో పరిచారికులు, సేద్యగాళ్ళు, గుమస్తాలు పనిచేయుచుందురు. ఒకనాడా ధనికునకు సత్యనారాయణవ్రతము చేయవలెనని సంకల్పము కలిగినది. [ ఇంకా...]

కాలచక్రం - కాలగణనం

ప్రాచీన శాస్త్రవేత్తల కాలగణనం
1 క్రాంతి = 1 సెకెండులోని 34,000లో భాగం
1 త్రుటి = 1 సెకెండులో 300వ వంతు
1 త్రుటి = 1 లవము, లేశము
2 లవములు = 1 క్షణం
30 క్షణములు = 1 విపలం
60 విపలములు = 1 పలం
60 పలములు = 1 చడి (సుమారు 24 నిమిషాలు) [ ఇంకా
...]

Thursday, November 15

వంటలు - బ్రెడ్ పకోడి

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1 కప్పు.
జొన్నపిండి - 1 కప్పు.
బఠాణీ పిండి - అర కప్పు.
మజ్జిగ - 1 కప్పు.
బ్రెడ్ - 6 స్లైసులు.
ఉల్లి (తురుము) - 3 పాయలు.
మిర్చి, అల్లం పేస్టు - 2 టీ స్పూనులు.
కొత్తిమీర - 1 కట్ట.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం :
గిన్నెలో శనగపిండి, జొన్నపిండి, ఉల్లి తురుము, అల్లం, మిర్చి పేస్టు, బఠాణీ పిండి, ఉప్పుల మిశ్రమాన్ని సరిపడినన్ని నీళ్ళతో కలిపి జారుగా చేసుకోవాలి. [ ఇంకా
...]

వంటలు - స్వీట్ కార్న్ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
కండెన్స్‌డ్ మిల్క్ - 1/4 టిన్.
బేకింగ్ పౌడర్ - 1 స్పూను.
మైదా - 150 గ్రా.
సోడా బై కార్బనైటు - 1/4 స్పూను.
వెన్న - 5 స్పూన్లు.
పాలు - 1 కప్పు .
వెనీలా ఎస్సెన్సు - 1/2 స్పూను.
పసుపు మిఠాయిరంగు - 1/4 స్పూను.

తయారు చేసే విధానం:
ముందుగా వెన్న కరిగించి, కండెన్స్‌డ్ మిల్క్, ఎస్సెన్సు, పసుపు మిఠాయి రంగు కలిపి బాగా గిలక్కొట్టాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - అందరం సోదరులం

మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరమూ మానవులం అందరమూ సోదరులం [ ఇంకా
...]

Wednesday, November 14

పిల్లల పాటలు - బుజ్జి మేక

బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివీ?
రాజు గారి తోటలోన మేత కెల్తినీ.
రాజు గారి తోటలోన ఏమి చూస్తివీ?
రాణి గారి పూలచెట్ల సొగసు చూస్తినీ!
పూలచెట్లు చూసి నీవు ఊరకుంటివా?
నోరూరగా పూల చెట్లు మేసివస్తినీ. [ ఇంకా
...]

Tuesday, November 13

వంటలు - మజ్జిగ పులుసు

కావలసిన వస్తువులు:
పెరుగు - 2 కప్పులు.
శనగ పిండి - 1 స్పూను.
ధనియాలు - 1/4 టీ స్పూను.
మెంతులు - 1/4 టీ స్పూను.
ఎండు మిర్చి - 6.
వెల్లుల్లి - 10 పాయలు.
ఆవాలు - 1/2 టీ స్పూను.
కరివేపాకు - 1 రెమ్మ.
పసుపు - 1/2 టీ స్పూను.
పచ్చి మిర్చి - 5.
ఉల్లిపాయ - సగం.
సొరకాయ, వంకాయ, క్యారట్, గుమ్మడి, బెండ - 100 గ్రా.
రెఫైండ్ ఆయిల్ - కొద్దిగా.

తయారు చేసే విధానం:
పెరుగును బాగా గిలకొట్టాలి. శనగపిండిని కొన్ని నీళ్ళతో కలిపి వరుసగా కలపాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - వారాలు - బాలుడు

ఆదివారం పుట్టిన బాలుడు - అద్భుతంగా చదువుతాడు
సోమవారం పుట్టిన బాలుడు - సత్యమునే పలుకుతాడు
మంగళవారం పుట్టిన బాలుడు - మంచి పనులు చేస్తాడు
బుధవారం పుట్టిన బాలుడు - బుద్దిమంతుడై ఉంటాడు [ ఇంకా...]

నీతి కథలు - నిద్రమత్తు

ఒక గ్రామములో రాము, రవి అనే యువకులుండేవారు. రాము ఉదయాన్నేలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యముగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని పొలము వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయము నిద్రలేచేవాడుకాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. [ ఇంకా...]

Saturday, November 10

వంటలు - లైం షర్బత్

కావలసిన వస్తువులు:
నిమ్మరసం - 1 గ్లాసు.
పంచదార - 4 గ్లాసులు.
నీళ్ళు - 1/2 గ్లాసు.
ఉప్పు - 1 టీ స్పూన్.


తయరుచేసే విధానం:
ముందుగా మంచి రసం ఉన్న నిమ్మకాయాలు తీసుకొని, కడిగి, శుభ్రపరచి, రసం తీసి, గింజలు రాకుండా వడకట్టాలి. పంచదారలో అర గ్లాసు నీళ్ళు పోసి, తీగపాకం వచ్చేంతవరకు ఉడికనివ్వాలి. [ ఇంకా...]

వంటలు - ద్రాక్ష రసం

కావలసిన వస్తువులు:
ద్రాక్షపండ్లు - 1 కిలో.
నీళ్లు - 2 కప్పులు.
చక్కెర - తగినంత (సుమారుగా కప్పు).
బ్లాక్‌సాల్ట్ - అర టీ స్పూను.


తయారు చేసే విధానం :
కడిగిన ద్రాక్షపండ్లని మిక్సీలోగానీ జ్యూసర్‌లోగానీ వేసి నీళ్లు, చక్కెర పోసి గ్రైండ్ చేయాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - కోయిలొచ్చింది 

కోయిలొచ్చిందమ్మ
కోయి లొచ్చింది.
చలి వదలి పోగానే
సాగి వచ్చింది.
గున్న మామిడిపైని
కొలువు తీర్చింది. [ ఇంకా
...]

Thursday, November 8

వంటలు - క్యారెట్ జామ్

కావలసిన వస్తువులు:
క్యారెట్ - 250గ్రా.
పంచదార - 350 గ్రా.
నిమ్మరసం - 1 చెంచా.
నీళ్ళు - 1కప్పు.

తయారు చేసే విధానం :
క్యారెట్లను కడిగి, చెక్కుతీసుకుని తురుముకోవాలి. తురుముకు నీళ్ళు చేర్చి స్టౌమీద పెట్టి మెత్తగా ఉడికించాలి. ఉడికిన తురుముకు పంచదార చేర్చి నీళ్ళన్నీ ఇంకిపోయేవరకూ స్టౌమీద ఉంచాలి. [ ఇంకా...]

Wednesday, November 7

వంటలు - బ్లాక్ వండర్

కావలసిన వస్తువులు:
నేరేడు పండ్ల రసం - ఒక కప్పు.
రాగిపిండి - 1/2 కప్పు.
ఖర్జూరపళ్ళు - 6.
రోజ్ వాటర్ - 1 కప్పు.
ఫైవ్ స్టార్ చాక్లేట్ - 1.

తయారు చేసే విధానం:
ముందుగా నేరేడు పళ్ళను కడిగి నీటిలో వేసి పిసికి గింజలను తీసి ఒక కప్పు రసాన్ని తీసుకోవాలి. [ ఇంకా...]

వంటలు - బటర్ బర్ఫీ

కావలసిన వస్తువులు:
బటర్ - 3 కిలోలు.
చక్కెర - 2 కిలోలు.
అమూల్ మిల్క్ పౌడర్ - 1 కిలో.
గ్లూకోజ్ పౌడర్ - 100 గ్రా.
ఐస్‌క్రీం పౌడర్ - 1 టీ స్పూను.
మైదా - 100 గ్రా.

తయారు చేసే విధానం:
బటర్, మిల్క్ పౌడర్, మైదాలను మిశ్రమం చేసుకోవాలి. గిన్నెలో చక్కెరకు తగినన్ని నీళ్ళుపోసి సన్నని సెగపై తీగపాకం పట్టి బటర్, మైదా మిశ్రమాన్ని, ఐస్‌క్రీం పౌడర్, గ్లూకోజ్ పౌడర్ వరుసగా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - చిట్టీ చిట్టీ చెల్లమ్మా

చిట్టీ చిట్టీ చెల్లెమ్మా!
పలకాబలపం తేవమ్మా!
అక్షరాలు నేర్వమ్మా
చదువు బాగా చదువమ్మా
తెలివిని బాగా పెంచమ్మా
ఇంటికి పేరు తేవమ్మా [ ఇంకా
...]

Tuesday, November 6

నీతి కథలు - నాన్నా పులి వచ్చే

ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉన్నాడు. అతనికి పొలం ఉంది. గొర్రెల మంద కూడా ఉంది. కూలీలతో ఒక రోజు మందని తోలుకొని వెళుతూ తన కొడుకు రంగడుని కూడా పొలానికి తీసుకుని వెళ్ళాడు.మందకి కొడుకుని కాపలా ఉండమని చెప్పాడు. సరే అన్నాడు రంగడు. 'ఇక్కడ అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది జాగ్రతా అని హెచ్చరించి, 'ఒక వేళ పులి వస్తే కేకలు వేయమని చెప్పి తాను పొలంలోని కూలీలతో పనులు చేయించటంలో నిమగ్నమయ్యాడు సోమయ్య. [ ఇంకా...]

వంటలు - మిల్క్ మైసూర్‌ పాక్

కావలసిన వస్తువులు:
చక్కెర - 1 కిలో.
నెయ్యి - 1 కిలో.
మిల్క్‌పౌడర్ (అమూల్) - 250 గ్రా.
మైదా - 250 గ్రా.
యాలుకల పొడి - 1 టీ స్పూను.
నీళ్లు - అర లీటరు.

తయారు చేసే విధానం:
మిల్క్ పౌడర్‌లో 150 గ్రాముల నెయ్యి వేసి మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా వరుసగా వేసి కలపాలి. [ ఇంకా...]

వంటలు - వెజిటబుల్ కట్‌లెట్

కావలసిన వస్తువులు:
క్యారెట్ (సన్నగా తరిగి) - 100 గ్రా.
బీన్స్ (సన్నగా తరిగి) - 100 గ్రా.
కాలిఫ్లవర్ (సన్నగా) - 100 గ్రా.
ఆలూ గుజ్జు - 200 గ్రా.
మిర్చిపొడి, ఉప్పు, ఉల్లిపాయలు - సరిపడినంత.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 5 గ్రా.
పసుపు - అర టీ స్పూను.
చాట్ మసాలా - 1 టీ స్పూను.
జీరా పొడి - అర టీ స్పూను.
బ్రెడ్‌ పౌడర్ - సరిపడినంత.
మైదా - 50 గ్రా.
గుడ్లు - 2.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారుచేసే విధానం:
కడాయిలో ఆయిల్ వేడిచేసి తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేయించాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - బడిపిల్లలం

పిల్లలం బడిపిల్లలం
తెల్లని మల్లెలపూవులం
బాగుగ ఆటలు ఆడెదం
చక్కగా చదువులు చదివెదం [ ఇంకా
...]

Monday, November 5

నీతి కథలు - అతి పండితుడు

వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యపాలన చేస్తుంటే బోధిసత్వుడు వైశ్యకులంలో పుట్టాడు. అతనికి పండితుడని పేరు పెట్టారు. అతను పెద్దవాడయ్యాక మరో వర్తకుడితో కలిసి వ్యాపారం చెయ్యసాగారు. ఆ వ్యాపారి పేరు అతిపండితుడు. వాళ్ళిద్దరూ పై వూళ్ళు వెళ్ళి వ్యాపారం చేసి లాభంతో తిరిగి వచ్చారు. లాభం పంచుకునే సమయంలో ' నాకు రెండువంతులు రావాలి ' అన్నాడు అతి పండితుడు. [ ఇంకా...]

పిల్లల పాటలు - తెల్లవారక ముందె

తెల్లవారక ముందె నిదుర లేవాలి
తెల్లగా మీ పండ్లు తోము కోవాలి
చలియనక గిలియనక స్నానాలు చేయాలి
చలువ బట్టలు తీసి వేసుకోవాలి [ ఇంకా
...]

వంటలు - బూంది

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1/2 కిలో.
వేరుశనగగింజలు - 1/4 కిలో.
కారం - తగినంత.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 2 కట్టలు.
నూనె - 1/2 కిలో.

తయారు చేసే విధానం:
శనగపిండిని జారుగా కలుపుకోవాలి. బాండీలో నూనెపోసి కాగిన తరువాత బూందీ గరిటతో బూంది దుయ్యాలి. [ ఇంకా...]

వంటలు - రవ్వ పుడ్డింగ్

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - 1/2 కప్పు.
పాలు - ఒకటిన్నర కప్పు (1 1/2).
యాలుకలు - 4.
జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్.

తయారు చేసే విధానం:
ముందుగా పాలు ఒక గిన్నెలో పోసి బాగా మరగ బెట్టాలి. తీసుకున్న పాలు సగం వరకు వచ్చేటట్లు కాచాలి.
[ ఇంకా...]

Saturday, November 3

కాలచక్రం - క్యాలండర్ కథ

మానవ జీవితంలోని ప్రతి ముఖ్య ఘట్టానికీ ఓ కారణముంటుంది. అనేక ఘట్టాల ఆ సమాహారంలో లెక్కలేనన్ని వింతలు, విశేషాలు. కొన్ని వింతలు తాత్కాలికమైనవైతే, మరికొన్ని శాశ్వతమైనవి. శాశ్వతమైన ఆ వింతే .... మనిషి నిద్ర లేచినప్పటినుంచీ, పడుకునేవరకు, పుట్టిన నాటినుంచి, గిట్టే వరకు తోడు-నీడై, మార్గదర్శై, ఘడియ ఘడియకూ ఆధారభూతమైన కేలెండెర్ ఆవిష్కరణ. [ ఇంకా...]

సంస్కృతి - తప్పెట గుళ్ళు

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ప్రచారంలో ఉన్న జానపద కళారూపమిది. ఇది సంప్రదాయ నృత్యం.వర్షాలు పడక పశుగ్రాసం కష్టమైనప్పుడు దైవానుగ్రహంకోసం గొల్ల కులస్తులుఈ నృత్యం చేస్తారు. తప్పెటలను గుండెలకు వ్రేలాడగట్టుకుని వాటిని వాయిస్తూ నృత్యం చేస్తారు. ఇది జానపద సంగీత నాట్య దృశ్య రూపకం. [ ఇంకా...]

Friday, November 2

సాహిత్యం - జానపదగేయం

మానవుడు పుట్టిన పిదప పాడిన మొట్టమొదటి పాట జానపదమే. జనసామాన్యంలోనుంచి పుట్టుకొచ్చిన పాట కాబట్టి జనావళిలో ఆ పాటకు అధిక ప్రాధ్యానత ఉండడం సహజం. ఇతర ఏ సాహిత్యంతో పోల్చి చూసినా జానపద గేయమే జనం పాటగా వెలుగొందుతుంది. భాష పుట్టకముందునుంచి ఈ పాట ఉంది. జానపదం అంటే పల్లెటూరు. కావడానికి పల్లెటూరి పాటలైనా నాగరికత పూర్తిగా వెల్లివిరియని కాలంలోని ఆవాస ప్రాంతాలన్నీ జానపదాలే కాబట్టి ఈ సాహిత్యం నేడు సకల జన సాహిత్యమయ్యింది. [ ఇంకా...]