భగవంతునికి సంబంధించిన గాధలను ప్రచారం చేయడం వలన వీరిని భాగవతులు అన్నారు. ఆంధ్ర దేశంలో నృత్య కళను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వారిలో వీరి స్థానం ప్రత్యేకమైంది. వీరు యక్ష గానాలూ, వీధి భాగవతాలూ, భామాకలాపాల ద్వారా నృత్య కళను ప్రచారం చేశారు. వీరిది నాట్య మేళ సాంప్రదాయం. పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలను నృత్య నాటకాలుగా ప్రదర్శించే సంప్రదాయం నాట్యమేళ లేక భాగవత మేళ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో స్త్రీలు పాల్గొనరు. స్త్రీ పాత్రల్ని కూడా పురుషులే ధరిస్తారు. [ ఇంకా...]