Friday, September 28

నాటికలు - "కుక్కపిల్ల దొరికింది"

[పరిశుభ్రంగా అలంకరించబడిన ఒకగది, ఒకమూల టెలిఫోను ఉన్నది. గోడకు ఎదురుగా పటాలూ, కాలెండర్లూ వున్నై. కాలెండరుకు దిగువగా "కుక్క ఉన్నది జాగ్రత్త!" అనే బోర్డు వ్రేలాడుతున్నది. తెర లేచేసరికి స్టేజిమీద మనుషులెవరూ లేరు. కాసేపటికి టెలిఫోన్ మ్రోగింది. ఇంట్లోంచి నౌకరు "సీను" అనే కుర్రాడు వచ్చాడు. వచ్చి ఫోనుతీసి]
సీను : ఎవరండీ ఆఁ...అయ్యా, లేరండి...అవునండి...అయ్యగారు లేరు...తెలీదండి...తెలీదండి ఏదీ తెలీదండి... (కాసేపు విని కుక్కపిల్లకు అన్నంపెట్టే ఒకగిన్నె ఒకమూలవుంటే వెళ్ళి దానికేసి దీనంగా చూస్తూన్నాడు. [ ఇంకా...]