మానవుడు ఒక పనిని నిర్వర్తించడానికి ముందు ఉచ్చ్వాస నిస్వాసాలు, చేష్ట లేక కదలిక ముఖ్యం. కదలిక మానవుని సజీవ లక్షణం. కదలిక లేనప్పుడు మానవునికి, చెట్లు చేమలకి భేదం కనిపించదు. అభినయం, నాట్యం రెండూ ప్రాధమిక దశలో చేష్ట ప్రాతిపదికగా ఏర్పడినవే. ఇది రానురాను ఒక కళగా రూపొందింది. ఈనాటి అభినయ కళకుగానీ, నాట్య కళకుగానీ ఆదిమ దశలో మానవ శరీరావయవాల వివిధ చేష్టలు, విన్యాసాలు ముఖ్యాధారం. [ ఇంకా...]