తమ జీవిత సర్వస్వాన్నీ దేవునికే అంకితం చేసి ఆ ఐక్యమునకై తహతహలాడేవారే దేవదాసీలు. స్వామి సన్నిధిలో బలిపీఠంపై నృత్యం చేయడానికి అధికార ముద్రల్ని పొందిన వారే నిజమైన దేవదాసీలు. వీరు ఆంధ్ర దేశంలో నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు దేవాలయాల నృత్య మండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి ఆరాధనా నృత్యాలు, అష్టదిక్పాలికల నృత్యాలు, కేళికా ప్రదర్శనలు, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ సంప్రదాయాన్ని నట్టువ మేళ సంప్రదాయం అంటారు. [ ఇంకా...]