మీరాబాయి 1498 లో రాజస్థాన్‌లో మెర్బా పట్టణంలో రాధోర్స్ రాజవంశంలో జన్మించింది. ఈమె తండ్రి రావు రతన్‌సింగ్ గొప్ప వైష్ణవ భక్తుడు. వీరు నివసించే ఇంటికి సమీపంలో ఒక విష్ణు దేవాలయం ఉండేది. మీరాబాయి తన తల్లిదండ్రులతో తరచు ఈ విష్ణుదేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తూండేది. అక్కడ విష్ణువుని స్తుతించే స్తోత్రాలు, కీర్తనలు మిరాబాయి మనస్సులో పూర్తిగా నాటుకున్నాయి. [ ఇంకా...]