Friday, August 31

పిల్లల పాటలు - చిట్టి తల్లులు

మా మోముపై ప్రకాశం
మా ముంగిట ప్రసన్నం
మా మదిలో ప్రభాతం
మా మహిలో ప్రమోదం
[ ఇంకా...]

వంటలు - గుత్తివంకాయ మ్యాంగో కర్రీ

కావలసిన వస్తువులు:
వంకాయలు - 250 గ్రాములు.
పచ్చి మామిడి - 1.
పచ్చిమిర్చి - 30 గ్రాములు.
అల్లం - చిన్న ముక్క.
జీలకర్ర - 1/2 టీ స్పూను.
వెలుల్లి - 10 రేకులు.
పసుపు - 1/2 టీ స్పూను.
కొత్తిమీర - 1 కట్ట.
కరివేపాకు -2 రెమ్మలు.
ఉల్లిపాయ - 1.
ధనియాలు - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం:
ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చిల మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి. [ ఇంకా...]

వంటలు - గుమ్మడికాయ హల్వా

కావలసిన వస్తువులు:
తురిమిన గుమ్మడికాయ - 3 కప్పులు.
నెయ్యి - 3 చెంచాలు.
చక్కెర - 3 చెంచాలు (లేదా).
పాలపొడి - 1 చెంచా.
ఇలాచీ పొడి - 1/2 చెంచా.
కుంకుమ పువ్వు - 1/4 చెంచా.
చిన్నగా తరిగిన బాదం, పిస్తా పప్పులు - 1 చెంచా.
ద్రాక్షా - 1 చెంచా.

తయారు చేసే విధానం:
మందంగా మూకుడులో నెయ్యి వేసి వేడి చేయండి. దీంట్లో తురిమిన గుమ్మడికాయను వేసి, మూత పెట్టి చిన్న మంట మీద ఉడక నివ్వండి. [ ఇంకా...]

పిల్లల పాటలు - అక్షర జ్యోతి

పలకేమో నల్లన
అక్షరాలు తెల్లన
నలుపంటే చీకటి
తెలుపంటే వెలుతురు
చదువు దివ్వె వెలిగిద్దాం
చీకట్లను తరిమేద్దాం. [ ఇంకా
...]

నీతి కథలు - మార్పు

అది బస్టాండ్. ప్రయాణికుల అరుపులు, పాప్‌కార్న్ అమ్మే కుర్రాళ్ళ కేకలతో గందరగోళంగా ఉంది. ఇంతలో చేతిలో బ్రీఫ్‌కేస్‌తో బస్‌స్టాండ్‌లోకి అడుగుపెట్టాడు నవీన్. కళ్ళకు గ్లాసులు, మెడలో గోల్డ్‌చెయిన్, సఫారీ డ్రస్‌తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు. తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో బాబూ అన్న పిలుపుకు పక్కకి తిరిగి చూసాడు నవీన్. తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు, మాసిన గడ్డం అక్కడక్కడ చిరిగిన బట్టలతో అసహ్యంగా ఉన్నాడు. ఏమిటి అంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూసాడు నవీన్. [ ఇంకా...]

Thursday, August 30

వంటలు - పెసర గారెలు

కావలసిన వస్తువులు:
పచ్చి పెసలు - 1 కిలో.
ఛాయమినపప్పు - 1 కప్పు.
నూనె - తగినంత.
పచ్చిమిర్చి - 50 గ్రా.
అల్లం - అంగుళం ముక్క.
జీలకర్ర - టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:
పెసలు, మినపప్పు కడిగి ముందురోజు రాత్రే నానబెట్టి ఉంచాలి. [ ఇంకా...]

భక్తి గీతాలు - నమో ఆంజనేయా నమో పవనపుత్ర

నమో ఆంజనేయా నమో పవనపుత్ర నమోనమో పవనపుత్ర న
మహదివ్య తేజ నీ మహిమలెన్నతరమా "న"
సీతాన్వేషణకై శ్రీరాముడు నిను ఒంపా
దక్షిణదిశకేగి సీతమ్మను గాంచితివి ''సీ'' న [ ఇంకా...]

నీతి కథలు - మూడు చేపలు

మంచిని ఎవరు చెప్పినా వినాలి. అలాకాక అజ్ఞానంతో, మూర్ఖత్వంతో ఆ మంచిమాటలను పెడచెవిన పెడితే అందుకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదు. ఇతరులందరూ అబద్దాలు చెప్పేవాళ్ళు అనుకుంటే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు. అలాంటి పొరపాటులు ఒక్కొక్కసారి ప్రాణాలకే ముప్పు తెస్తాయి అది ఎలాగో ఈ మూడు చేపల కధ ద్వారా తెలుసుకుందాం. [ ఇంకా...]

Wednesday, August 29

పండుగలు - దుర్గాష్టమి

దుర్గాదేవి "లోహుడు" అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయతి వచ్చింది అని చెప్తారు. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గ అయింది. "దుర్గలోని 'దుర్' అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. 'గ' అంటే నశింపచేసేది", అని దైవజ్ఞులు వివరణ చెప్తూ ఉంటారు. ఈమె ఆరాధనవల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు. [ ఇంకా...]

నీతి కథలు - బంగారు ఊయల

అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అనే రైతు ఉన్నాడు. ఆయనికి ఒక చిన్నారి కూతురు ఉంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయ పడేది. మందరమ్మకి ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. [ ఇంకా...]

వంటలు - సోయా మిల్క్

కావలసిన వస్తువులు:
సోయా విత్తనాలు - 500 గ్రా.
బేకింగ్ సోడా - 1 టీ స్పూన్.
మంచి నీళ్లు: - 2 లీటర్లు.

తయారు చేసే విధానం :
సోయా విత్తనాలను పావు గంటసేపు నీటిలో నానబెట్టండి. ఈ నీళ్లను వార్చండి. [ ఇంకా
...]

వంటలు - సజ్జ బూరెలు

కావలసిన వస్తువులు:
సజ్జపిండి - 1 కిలో.
బెల్లం - 1/2 కిలో.
పచ్చికొబ్బరి తురుము - రెండు కప్పులు.
నూనె - వేయించడానికి.

తయారు చేసే విధానం:
సజ్జ పిండిలో బెల్లం పొడిగొట్టి వేసుకోవాలి. ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - చిలకలు

చింతా చెట్టు చిలకలతోటి
ఏమని పలికిందీ!
చిలకల్లారా! చిలకల్లారా!
ఛీ! ఛీ! పొమ్మంది
[ ఇంకా...]

Tuesday, August 28

భక్తి గీతాలు - ముద్దుగారే

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు ముద్దుగారే
అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
[ ఇంకా...]

నీతి కథలు - అసలుకి ఎసరు

ఒక అడవిలో నివసిస్తుండే ఒక నక్కకి ఒకనాడు బాగా ఆకలి వేసింది. దాంతో అది అడవి అంతా గాలించి ఎక్కడా ఆహారం దొరకక అది విసిగి వేసారిపోయింది. చివరికి ఆ నక్క కొన్ని జింకలు, దుప్పులు ఐక్యమత్యంగా కలిసి జీవించే ఒక చోటుకి బయలు దేరింది. అక్కడ తనకేదయిన ఆహారం దొరక్కపోతుందా అని అనుకుంటూ. నక్క అక్కడికి చేరే సరికి కొన్ని జింక పిల్లలు, దుప్పి పిల్లలు సంతోషంతో కేరింతలు కొడూతూ ఆడుకోసాగాయి. [ ఇంకా...]

Monday, August 27

నీతి కథలు - పసిమనసు

రాఘవరావుగారు కూతురును చూడటానికి పట్నం నుండి వచ్చారు. ఆయన కర్నూలు జిల్లాలో హెడ్‌మాస్టర్. తాతగారిని చూసి పరుగున వచ్చాడు పవన్. మనవడిని ఎత్తుకొని ముద్దాడుతూ ఇంట్లోకి నడిచాడు రాఘవరావుగారు. అమ్మా! అమ్మా! తాతయ్య వచ్చాడు. అరిచాడు పవన్. శైలజ కిచెన్ రూం నుండి బయటికి వచ్చి తండ్రిని క్షేమసమాచారాలడిగింది. అనంతరం అల్లుడుగారింకా రాలేదా? అడిగారాయన. [ ఇంకా...]

వంటలు - సేమ్యాతో అరిసెలు

కావలసిన వస్తువులు:
నెయ్యి - అర కిలో.
బియ్యం - అర కిలో.
సేమ్యా - పావు కిలో.
తెల్లనువ్వులు - 100 గ్రాములు.
పంచదార - పావు కిలో.
గసగసాలు - 10 గ్రా.
యాలుక్కాయ పొడి - సరిపడినంత.

తయారు చేసే విధానం :
ముందురోజు రాత్రి బియ్యాన్ని నీళ్లలో నానబోయాలి. ఉదయం పిండి దంచాలి. తర్వాత మెత్తటిపిండిని జల్లెడ పట్టాలి. [ ఇంకా...]

Saturday, August 25

పిల్లల పాటలు - బాల శిల్పులు

ఎవరా పనివా
ళ్ళెవరా శిల్పులు?
ఏమా పనితన
మేమా సరదా!
[ ఇంకా...]

Friday, August 24

భక్తి గీతాలు - నాగేంద్ర హారాయ త్రిలోచనాయ

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ
భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై మకారాయ నమశ్శివాయ [ ఇంకా...]

వంటలు - వెజిటబుల్ వడ

కావలసిన వస్తువులు:
బంగాళాదుంపలు - పావు కిలో.
క్యారెట్ - ఒకటి.
క్యాబేజి - ఒక కప్పు (తరిగినది).
సగ్గుబియ్యం - 50 గ్రా.
కొత్తిమీర - ఒక కప్పు (తరిగినది).
కారం - ఒక టీ స్పూను.
జీడిపప్పు - 25 గ్రా.
జీలకర్ర పొడి - అర టీ స్పూను.
నూనె వేగించడానికి - సరిపడినంత.
నిమ్మకాయ - ఒకటి.
ఉప్పు - తగినంత.
పసుపు - చిటికెడు.
పచ్చిమిర్చి - నాలుగు.
అల్లం ముక్కలు - 2 టీ స్పూన్లు.
మైదా పిండి - 25 గ్రా.

తయారు చేసే విధానం :
దుంపలు ఉడకపెట్టి పొట్టుతీసి ఉంచాలి. [ ఇంకా
...]

వంటలు - శనగపప్పు పొడి

కావలసిన వస్తువులు:
వేయించిన శనగపప్పు - పావు కిలో.
ఎండుమిర్చి - 50 గ్రా.
జీలకర్ర - 25 గ్రా.
ఉప్పు - సరిపడినంత
ఎండుకొబ్బరి - చిన్నముక్క
వెల్లుల్లి - రెండు రెబ్బలు

తయారు చేసే విధానం :
ఖాళీ మూకుట్లో ఎండుమిర్చిని అరకొరగావేయించి శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, ఎండుకొబ్బరి, వెల్లుల్లి కలిపి మెత్తగా దంచుకోవాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - చదువు నేర్చుకుంటాం

పాలబుగ్గల పిల్లలం
పసిడి మొగ్గల మల్లెలం
కురిసే చిరుజల్లులం
మెరిసే హరివిల్లులం [ ఇంకా...]

Thursday, August 23

పిల్లల పాటలు - గుడు గుడు కుంచం...

గుడు గుడు కుంచం గండే రాగం
పాముని పట్నం పడిగే రాగం
అప్పడాల గుఱ్ఱం ఆడుకోబోతే
పే పే గుఱ్ఱం పెళ్ళికిపోతే
అన్నా! అన్నా! నీ పెళ్లెపుడంటే
రేపుగాక ఎల్లుండి
కత్తిగాదు బద్దాగాదు గప్,చిప్ [ ఇంకా
...]

వంటలు - రవ్వట్టు

కావలసిన వస్తువులు:
బొంబాయిరవ్వ - 25 గ్రా.
మైదా, బియ్యపు పిండి - 25 గ్రా.
నూనె - 100 గ్రా.
పచ్చిమిర్చి - 4.
జీలకర్ర - 2 చెంచాలు.
పుల్లనిమజ్జిగ - తగినంత.
ఉప్పు - తగినంత.
కరివేపాకు - 2 రెబ్బలు.

తయారుచేసే విధానం:
రవ్వ, మైదా, బియ్యపు పిండి మజ్జిగలో (నీళ్ళలో) పోసి జారుగా కలిపి 1-2 గంటలు నాననివ్వాలి. [ ఇంకా
...]

వంటలు - రాగి దోసె

కావలసిన వస్తువులు:
రాగిపిండి - 2 కప్పులు.
వేయించిన శనగపిండి - 1/2 (అర) కప్పు.
పుల్లటి పెరుగు - 1/2 (అర) కప్పు.
కొత్తిమీర తరిగినది - కొంచెం.
ఉప్పు - సరిపడినంత.
ఆవాలు - టీ స్పూను.
జీలకర్ర - చిటికెడు.
ఇంగువ, కరివేపాకు - సరిపడినంత.
నూనె - సరిపడినంత.
ఉల్లిపాయ - 1.

తయారు చేసే విధానం:
ముందుగా రాగిపిండిని రెండుగంటల పాటు నాననివ్వాలి. [ ఇంకా...]

Wednesday, August 22

నీతి కథలు - తగని సలహా

అనగా అనగా ఓ అడవి. అడవి అనగానే మీకు పులులూ, సింహాలు, పాములు, తోడేళ్ళు, పొడుగాటి చెట్లూ, ఎత్తైన గట్లూ గుర్తుకు రావొచ్చు. ఇవన్నీ ఉండే మాట నిజమే కాని, ఆ అడవిలోని కోతుల మందని గురించి చెప్పుకుందాం.
ఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి. కడుపునిండా నిద్రపోయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇలా ఉండగా ఈ శీతాకాలంలో ఈ రోజున ఏం జరిగిందనుకున్నారూ! ఆ వేళ మరీ చలివేస్తోంది. బారెడు పొద్దుండగానే మంచు గడ్డల్లే అయిపోయింది! జిమ్ముమంటూ ఒళ్ళు బిగుసుకు పోతోంది. మనకంటే దుప్పట్లు ఉంటాయి. కోతులకేం ఉంటాయ్? 'ఏంచేద్దాం? ఏంచేద్దాం' అన్నాయి కోతులు. [ ఇంకా...]

సౌందర్య పోషణ - చర్మ సంరక్షణకు

  • కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంద
  • క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది.
  • ఖరీదైన స్కిన్ టోనర్లకు బదులుగా చర్మానికి నిమ్మకాయ రసాన్ని వాడండి. [ ఇంకా...]

వంటలు - రవ్వ లడ్డు

కావలసిన వస్తువులు:
బొంబాయి రవ్వ - రెండు కప్పులు.
తురిమిన పచ్చికొబ్బరి - రెండు కప్పులు.
పంచదార - 1 1/2 కప్పు.
నెయ్యి - అర కప్పు.
జీడిపప్పు - రెండు స్పూన్‌లు.
కిస్ మిస్ - రెండు స్పూన్‌లు.
యాలుకల పొడి - పావు స్పూన్.

తయారు చేసే విధానం:
మొదట దళసరి (బాణలీ) మూకుడులో రవ్వను కొంచెం నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. [ ఇంకా...]

వంటలు - మసాల ఇడ్లీ

కావలసిన వస్తువులు:
బాయిల్డ్ బియ్యం - 4 కప్పులు.
మినప్పప్పు - 1 కప్పు.
బఠాణీలు - 50 గ్రా.
కాలిఫ్లవర్ - 50 గ్రా.
బంగాళాదుంపలు - 2.
టమోటా - ఒకటి.
క్యారెట్ - ఒకటి.
ఉల్లిపాయలు - పావు కిలో.
జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్‌ స్పూన్లు.
ఎండుమిర్చి - 6.
వేయించిన శనగపప్పు - 2 టీ స్పూన్లు.
కొబ్బరి తురుము - 1 టీ స్పూను.
మినప్పప్పు - 1 టీ స్పూను.
ఆవాలు - 1 టీ స్పూను.
కరివేపాకు - 10 రెమ్మలు.
నెయ్యి - 50 గ్రా.

తయారు చేసే విధానం :
బియ్యం, మినప్పప్పు విడివిడిగా రుబ్బుకోవాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - తప్పెట్లోయ్ తాళాలోయ్

తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో బాజాలోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపడికోయ్. [ ఇంకా
...]

Tuesday, August 21

కవితలు - నేను సముద్రం ఒడ్డున నిల్చోని

నేను సముద్రం ఒడ్డున నిల్చోని,
అలలు చూస్తూ, ఉప్పు గాలి పీలుస్తూ
నెమరు వేస్తుంటే ఒకడొచ్చి,
?అచ్చు నీలాటివాడిని ఆ ఒడ్డున చూశా? అన్నాడు
. [ ఇంకా...]

వంటలు - మిల్క్ కేక్

కావలసిన వస్తువులు:
పాలు - 5 కప్పులు.
పంచదార - 4 కప్పులు.
బొంబాయి రవ్వ - 1 కప్పు.
నెయ్యి - 11/2 కప్పు.

తయారు చేసే విధానం:
పాలు, పంచదార, బొంబాయిరవ్వ, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నని సెగపై పెట్టి పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ ఉండాలి. [ ఇంకా
...]

వంటలు - జొన్న రైస్

కావలసిన వస్తువులు:
జొన్న నూక - 500 గ్రా.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:
జొన్న నూకను శుభ్రం చేసి ఉంచుకోవాలి. [ ఇంకా...]

భక్తి గీతాలు - జయ శ్రీరామా!

జయ శ్రీరామా!
రఘురామ శుభకర శ్రీరామా!
త్రిభువన జన నయనాభిరామా జయ [ ఇంకా...]

పిల్లల పాటలు - లేవరా మా బాబు

తొలిపొద్దు పొడిచింది, లేవరాబాబు
మొద్దు నిద్దుర వీడి మేలుకోవాలి
తూరుపుదిక్కున సూరీడు లేచాడు
పక్కపై నినుజూసి ఎర్రబడినాడు [ ఇంకా...]

Monday, August 20

వంటలు - ధనియాలపొడి

కావలసిన వస్తువులు:
ధనియాలు - 200 గ్రా.
ఎండుమిర్చి- 200 గ్రా.
నూనె - 100 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
శనగపప్పు - 50 గ్రా.
చింతపండు - కొంచెం.
ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం :
నూనె కాచి ధనియాలు, ఎండుమిర్చి, పప్పులు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించాలి. [ ఇంకా
...]

నీతి కథలు - తోడేలు - ఒంటె

అనగా అనగా ఒక అడవి ఉంది. ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది. అది బాగా జిత్తులమారిది. అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది. పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి. అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు. తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి. "ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది. ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది. ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది. ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు. నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం" అని అంది. ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది. [ ఇంకా...]

భక్తి గీతాలు - చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటేదిరా

చంచలంబగు జగతిలోపల శాశ్వతం బొకటేదిరా
కన్నుమూసి తెర్చులోపల కవిమిలేములు మారురా.
మాయసంసారంబురాయిది మనసునిలుకడ లేదురా
నాదినీదియనుచు నరుడా వాదులాడబోకురా [ ఇంకా...]

పిల్లల పాటలు - అల్లి బిల్లి పాట...

కొండాపల్లీ కొయ్యా బొమ్మా
నీకో బొమ్మా నాకో బొమ్మా
నక్కపల్లీ లక్కా పిడతలు
నీకో పిడత నాకో పిడత [ ఇంకా...]

Saturday, August 18

నీతి కథలు - జీతము ఇవ్వని యజమాని

పూర్వము ఒక పట్టణములో వినాయకరావు అనే వ్యాపారి వుండేవాడు. ఆయన పనివాళ్ళను పెట్టుకోవటం వారికి జీతము ఇవ్వకుండా ఏవో సాకులు చెప్పి పంపేవాడు. ఆయన జీవితంలో ఎవ్వరికీ జీతం ఇవ్వలేదు. ఒకసారి వినాయకరావు వద్దకు చిరంజీవి అనే కుర్రవాడు వచ్చాడు. పని కావాలంటూ అడిగాడు. పనివాడులేక ఇబ్బందిగానే వుంది వినాయకరావుకి. తాను చెప్పిన పని చెయ్యాలనీ, చెయ్యకపోతే జీతం ఇవ్వననీ ముందే చెప్పాడు వినాయకరావు. [ ఇంకా...]

భక్తి గీతాలు - దేవదేవ ధవళాచల మందిర

దేవదేవ ధవళాచల మందిర
గంగాథరా హర నమో నమో
దైవతలోక సుధాకర హిమకర
లోకశుభంకర నమో నమో దేవ [ ఇంకా
...]

వంటలు - పుచ్చకాయ జ్యూస్

కావలసిన వస్తువులు:
పుచ్చకాయ - 1.
పంచదార - 150 గ్రా.
నిమ్మకాయ - 1.
అల్లం - చిన్న ముక్క.
చాట్ మసాల - 5 గ్రా.

తయారు చేసే విధానం :
ముందుగా పుచ్చకాయ చెక్కు తీసి, విత్తనాలు కూడా తీసివేయాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - ఉయ్యాల జంపాల...

ఉయ్యాల జంపాలలూగరారమ్మ
వెలలేని బంగారుటుయ్యాల ఉయ్యాల
కమలమందున బుట్టీ కమలాక్షుని చేపట్టి
కాముని కన్నట్టి కంజదళనేత్రి ఉయ్యాల [ ఇంకా
...]

Friday, August 17

సంస్కృతి - పురాణాలు

"పురాపినవం పురాణం" అన్నారు. అంటే ఎంత ప్రాచీనమైనదైనా కొత్తగా అనిపిస్తుందని దీని భావన. పురాణాలలో భారతీయ ఆత్మ ఉందంటారు. వేద ధర్మాలను ప్రచారం చేయడానికే పురాణాలు వెలువడ్డాయి.
పురాణాలు ప్రాచీన విజ్ఞాన సంపుటాలు. ప్రప్రంచం పుట్టుక దగ్గర్నుంచి ప్రపంచంలో మానవుడు నడుచుకోవలసిన విధానందాకా ఎన్నెన్నో విషయాలను పురాణాలు మనకు వివరిస్తాయి. చరిత్ర, భౌగోళికం, పౌర విజ్ఞానం...ఒక్కటేమిటి? ప్రపంచంలో ఎన్ని విభాగాల విజ్ఞానముందో అన్నీ పురాణాలలో కనిపిస్తాయి.
[ ఇంకా...]

సాహిత్యం - మాతృ భాష

సాహిత్యం లోకి ప్రవేశించేముందు భాష అంటే ఏంటి? అది ఎలా పుట్టింది? వంటి విషయాలు కూడా తెలుసుకుని ఆ తర్వాత సాహిత్యంలోకి ప్రవేశించడం ఎంతైనా అవసరం. దాంతోపాటు మన మాతృభాష పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత కూడా మనకుంది కాబట్టి తెలుగు భాష ఎలా ఆవిర్భవించిందీ వంటి విషయాలను కూడ తెలుసుకుని ఆ తర్వాత అసలైన సాహిత్యంలోకి అడుగుపెడదాం. [ ఇంకా...]

హాస్య కధలు - రుబ్బుగుండు

అనగనగా ఒక ఊరు. ఆ వూళ్ళో ఒక్కటే బ్రాహ్మలిల్లు. ఆ ఇంటాయన చాలా మంచివాడు. భార్య మాత్రం చాలా కఠినురాలు.
ఒకరోజు మిట్టమధ్యాహ్నం వేళ ముసలి బ్రాహ్మణుడొకడు బాటసారియైపోతూ ఎండదెబ్బకు భయపడి ఇంటివారు బోజనమేమైనా పెడతారేమో? అనిఆశగా అరుగుపై చతికిలపడ్డాడు. బయటకు వచ్చిన ఆ ఇంటాయన ' అయ్యో! పాపం! ముసలి బ్రాహ్మణుడు. ఎండకు భయపడుతున్నాడని జాలిపడి " అయ్యా మీరు బోజనం చేసి విశ్రాంతి తిసుకొని తరువాత ప్రయాణం చేద్దురుగాని. స్నానానికి రండి ' అంటూ లోపలకు పిలిచాడతనిని. [ ఇంకా
...]

వేదాలు - వేదకాల విశిష్టత

వేదాలు అపౌరుషేయాలు. అంటే ఇతర గ్రంధములవలె అవి ఋషులచే రచించబడినవికావు. వేదాలలో చెప్పబడిన విషయాలనే స్మ్రుతులు, ఇతిహాసాలు, పురాణాను మున్నగునవి పలు విధాలుగా విశదీకరిస్తున్నాయి. ఉపనిషత్తులను వేదాంతమంటారు. హిందూ మతములోని మహోన్నత సిద్ధాంతములన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నాయి. ప్రపంచ సాహిత్యంలో వేదములకంటే అత్యంత పురాతనమైన సాహిత్యం మరోటి లేదు. [ ఇంకా...]

Thursday, August 16

అందరి కోసం - ఆంధ్రులు

ఆంధ్రులు ఎవరు? ఎక్కడి వారు?
మహాభారతంలో ఆంధ్రులు రాజ్యాధిపతులనీ, ధర్మరాజును సేవించారనీ ఒక సందర్భంలో ప్రస్తావనకు వస్తుంది. మయ సభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓఢ్ర రాజులతోపాటు ఆంధ్ర రాజులు కూడా ధర్మరాజుని కొలిచారని సభా పర్వంలో చెప్పబడింది.
క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన భరతుని నాట్య శాస్త్ర గ్రంధంలో పాత్రోచిత భాష గురించిన సందర్భంలో ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తూ నబర్బర కిరాతాంధ్ర దమిలాది జాతుల విషయంలో ప్రాక్రుతాలను వాడరాదనీ, వారి వారి మాండలికాలనే వాడాలని తెలిపాడు. [ ఇంకా
...]

సాహిత్యం - సామెతలు

సామెత
ఈ మాట వినని తెలుగు వ్యక్తి ఉండడు. మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ మాట వింటున్నాం. ఆనాటికీ, ఈనాటికీ సామెతలు ఎవరు చెప్పినా ఆనందిస్తున్నాం. సామెతలు చెప్పేవారిని అభిమానిస్తున్నాం. సందర్భానికి తగ్గట్లుగా సామెతలు చెప్పేవారంటె మనకు అపరిమితమైన ప్రేమ. అదొక గొప్ప విద్యని మన భావన. అది నిజం కూడ. దానికి సమయస్ఫూర్తి ఎంతో అవసరం. [ ఇంకా
...]

హాస్య కధలు - పండగ అల్లుడు

పండక్కి అల్లుడుగారొస్తున్నారని ఉత్తరం రాంగానే గుండెల్లో గుఱ్ఱాలు పరుగెట్టాయి నాకు! బోలెడంత ఖర్చు! అష్టకష్టాలుపడి పిండివంటలు చేయటం, అవి తిని హరించుకోలేక నానా అవస్థా పడటం అంతా వేస్టనీ విడప్పుడే రోజుకు ఒక రకం పిండివంట చేసుకుని, తీరిగ్గా తిని, తాపీగా హరించుకోవటమే బెస్టనీ నా అభిప్రాయం. దీనితో మా ఆవిడ ఏకీభవించదు. నూటికి తొంభై పాళ్ళు నాతో వక్రీభవించటమే ఆవిడ సహజలక్షణం! [ ఇంకా...]