Thursday, August 16

అందరి కోసం - ఆంధ్రులు

ఆంధ్రులు ఎవరు? ఎక్కడి వారు?
మహాభారతంలో ఆంధ్రులు రాజ్యాధిపతులనీ, ధర్మరాజును సేవించారనీ ఒక సందర్భంలో ప్రస్తావనకు వస్తుంది. మయ సభలో అంగ, వంగ, పుండ్రక, పాండ్య, ఓఢ్ర రాజులతోపాటు ఆంధ్ర రాజులు కూడా ధర్మరాజుని కొలిచారని సభా పర్వంలో చెప్పబడింది.
క్రీ.శ. 1వ శతాబ్దానికి చెందిన భరతుని నాట్య శాస్త్ర గ్రంధంలో పాత్రోచిత భాష గురించిన సందర్భంలో ఆంధ్రుల గురించి ప్రస్తావిస్తూ నబర్బర కిరాతాంధ్ర దమిలాది జాతుల విషయంలో ప్రాక్రుతాలను వాడరాదనీ, వారి వారి మాండలికాలనే వాడాలని తెలిపాడు. [ ఇంకా
...]