Friday, August 10

పండుగలు - వినాయక చవితి

పూజా విధానం
ఏడాదిలో మహా ప్రధానమైన పర్వదినమిది. మహా గణపతి పార్వతీ తనయుడుగా ఆవిర్భవించిన రోజు ఇది. ప్రతి ఏటా భాద్రపద చవితి రోజున వచ్చే పండుగ ఇది. మధ్యాహ్నం చవితి (చతుర్థి) ఉన్న రోజునే 'వినాయక చవితి'ని జరుపుకోవాలి.
శాస్త్రోక్తంగా, మట్టితోగానీ లేదా వెండి వంటి లోహాలతోగానీ తయారు చేసిన గణపతి ప్రతిమని అర్చించాలి. దూర్వాలు, బిల్వాలు (మారేడు) గణపతికి ప్రీతికరాలు. కనుక వాటితో అర్చించాలి. అవేకాక, శాస్త్రంలో చెప్పబడ్డ 21 పత్రులతో పూజించాలి. ఇవన్నీ ఔషధీయ విలువలున్న పత్రులు. [ ఇంకా
...]