Wednesday, August 22

నీతి కథలు - తగని సలహా

అనగా అనగా ఓ అడవి. అడవి అనగానే మీకు పులులూ, సింహాలు, పాములు, తోడేళ్ళు, పొడుగాటి చెట్లూ, ఎత్తైన గట్లూ గుర్తుకు రావొచ్చు. ఇవన్నీ ఉండే మాట నిజమే కాని, ఆ అడవిలోని కోతుల మందని గురించి చెప్పుకుందాం.
ఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి. కడుపునిండా నిద్రపోయి, హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి. ఇలా ఉండగా ఈ శీతాకాలంలో ఈ రోజున ఏం జరిగిందనుకున్నారూ! ఆ వేళ మరీ చలివేస్తోంది. బారెడు పొద్దుండగానే మంచు గడ్డల్లే అయిపోయింది! జిమ్ముమంటూ ఒళ్ళు బిగుసుకు పోతోంది. మనకంటే దుప్పట్లు ఉంటాయి. కోతులకేం ఉంటాయ్? 'ఏంచేద్దాం? ఏంచేద్దాం' అన్నాయి కోతులు. [ ఇంకా...]