Saturday, September 29

వంటలు - సేమ్యా పాయసం

కావలసిన వస్తువులు:
పాలు - ఒక లీటరు.
సేమ్యా - ఒక కప్పు.
సన్నటి సగ్గు బియ్యం - అర కప్పు.
పంచదార - సరిపడినంత.
యాలుకల పొడి - రెండు టీ స్పూన్లు.
పచ్చి కోవా - 50 గ్రాములు.
బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు - కావలసినన్ని.
నెయ్యి - ఆరు టీ స్పూన్లు.

తయారు చేసే విధానం:
మూకుడులో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత దాంట్లో బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు దోరగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఆ మూకుడులో మరో రెండు స్పూన్ల నెయ్యి వేసి సేమ్యాను దోరగా వేయించాలి. [ ఇంకా...]

Friday, September 28

వంటలు - సోయా పన్నీర్ పఫ్

కావలసిన వస్తువులు:
సోయా పన్నీర్ - 100 గ్రా.
పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర - సరిపడినంత.
కర్న్ ఫ్లోర్ - 10 గ్రా.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
తయారు చేసే విధానం:
ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. [ ఇంకా...]

నాటికలు - "కుక్కపిల్ల దొరికింది"

[పరిశుభ్రంగా అలంకరించబడిన ఒకగది, ఒకమూల టెలిఫోను ఉన్నది. గోడకు ఎదురుగా పటాలూ, కాలెండర్లూ వున్నై. కాలెండరుకు దిగువగా "కుక్క ఉన్నది జాగ్రత్త!" అనే బోర్డు వ్రేలాడుతున్నది. తెర లేచేసరికి స్టేజిమీద మనుషులెవరూ లేరు. కాసేపటికి టెలిఫోన్ మ్రోగింది. ఇంట్లోంచి నౌకరు "సీను" అనే కుర్రాడు వచ్చాడు. వచ్చి ఫోనుతీసి]
సీను : ఎవరండీ ఆఁ...అయ్యా, లేరండి...అవునండి...అయ్యగారు లేరు...తెలీదండి...తెలీదండి ఏదీ తెలీదండి... (కాసేపు విని కుక్కపిల్లకు అన్నంపెట్టే ఒకగిన్నె ఒకమూలవుంటే వెళ్ళి దానికేసి దీనంగా చూస్తూన్నాడు. [ ఇంకా...]

సంస్కృతి - దేవదాసి నృత్యాలు

తమ జీవిత సర్వస్వాన్నీ దేవునికే అంకితం చేసి ఆ ఐక్యమునకై తహతహలాడేవారే దేవదాసీలు. స్వామి సన్నిధిలో బలిపీఠంపై నృత్యం చేయడానికి అధికార ముద్రల్ని పొందిన వారే నిజమైన దేవదాసీలు. వీరు ఆంధ్ర దేశంలో నృత్య కళను పోషించి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వీరు దేవాలయాల నృత్య మండపాలలో, దేవుని సన్నిధానంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించి ఆరాధనా నృత్యాలు, అష్టదిక్పాలికల నృత్యాలు, కేళికా ప్రదర్శనలు, కలాపాలూ మొదలైన నృత్యాలను ప్రదర్శించేవారు. ఈ సంప్రదాయాన్ని నట్టువ మేళ సంప్రదాయం అంటారు. [ ఇంకా...]

Thursday, September 27

వనితల కోసం - మామిడి పండ్లతో పసందైన పదార్ధాలు

ఋతువులో ప్రతి గృహిణి మామిడితో ఊరగాయ తయారు చేస్తుంది. మామిడి కాయలతో చేసే మరికొన్ని వంటకాలను ఇక్కడ అందిస్తున్నాము. ఇవి చల్లగా, రుచికరంగా ఉంటాయి.
మాంగో ఖీర్: తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. అతి నెమ్మదిగా ఉడక బెట్టండి. దీనికి చక్కెర పాకం కలుపుతూ బాగా కదపండి. అది గట్టిపడగానే, కొబ్బరి పాలు చేర్చి మరోసారి కాగపెట్టండి. స్టవ్ నుంచి తీసి ద్రాక్ష వంటి ఎండిన పండ్లను దీనితో కలపండి. [ ఇంకా...]

విజ్ఞానం - వ్యకిత్వ వికాసం

వ్యక్తిత్వం మనిషికి ఆభరణం లాంటిది. వ్యక్తిత్వం లేకపోతే మనిషి ఇతరులపై ఆధారపడవలసి వుంటుంది. ఇతరులపై ఆధారపడ్డప్పుడు మనిషికి గౌరవం వుండదు. గౌరవం లేని వ్యక్తి జీవితం దుఃఖమయమవుతుంది. దుఃఖం మనిషిని జీవితాంతం మానసికంగాను, శారీరకంగానూ కృంగదీస్తుంది. [ ఇంకా...]

మీకుతెలుసా - గుండుసూదుల కథ

నీళ్ళు గడ్డ కట్టే చలికాలపు బాధ ఎక్కువనప్పుడు వెచ్చటి గుడ్డలతో శరీరాన్ని కప్పుకునే ఆవశ్యకత మనిషికి పెరిగింది. తాను కప్పుకుంటున్న చర్మాలను ఒకటిగా జతచేయడానికి ఒక వస్తువును కనుగొనాల్సి వచ్చింది. అప్పుడు మనిషి వదునైన ముల్లును కనుగొన్నాడు. నిన్న మొన్నటిదాకా జిప్సీలు నూనెలో ఉడికించి గట్టిపడిన ముళ్ళను సూదులుగా వాడుతూ వచ్చారు. ఉత్తర అమెరికాకు చెందిన కొంతమంది రెడ్ ఇండియన్లు తేనె మిడుతల ముళ్ళను జత చేసేందుకు వాడేవారు. [ ఇంకా...]

సాహిత్యం - మహాత్ముని పలుకులు

  • ఆత్మార్పణకు,స్వచ్చతకు నిలయం కానప్పుడు స్త్రీకి విలువ లేదు.
  • హక్కులకు వాస్తవమైన మూలాధారం-కర్తవ్య నిర్వహణం.మనం మన కర్తవ్య నిర్వహణ చేసినట్లయితే హక్కులు పొందేందుకు ఎంతో దూరంలో ఉండము.మన విధులు నిర్వర్తించకుండా హక్కుల కోసం పరుగెత్తినట్లయితే అవి మనల్ని దాటి పోతాయి.మనం ఎంతగా వాటిని వెంబడిస్తే అవి అంత త్వరితంగా ఎగిరిపోతాయి. [ ఇంకా...]

Wednesday, September 26

నీతికథలు - పరివర్తన

పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పాలిస్తూండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు. న్యాయశీలుడు. మంచి దైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖసౌఖ్యాలను పాటుపడుతూండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూండేవాడు. వారివారి తాహతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. [ ఇంకా...]

విజ్ఞానం - నిత్యజీవితం ఒక కళ

పుట్టిన క్షణం మొదలు మరణించేదాక సుఖదుఖాలతో దుర్ఘటమైన మన జీవితం అనేక సంక్షోభాలతో, సందిగ్ధాలతో, పోరాటాలతో, ఆరటాలతో, కష్ట పరంపరతో కూడి ఉంటుంది. జీవిత కళ అద్భుతమైన ఖళ. ఒక్ ముఖ్యమైన కళ. రాజకీయ వ్యవస్థకంటే, వార్తా ప్రసారాలకంటే బ్రహ్మాండమైన వ్యవస్థ. [ ఇంకా...]

అందరి కోసం - పర్యాటక ప్రణాలిక

నాలుగు ప్రాంతాలకు తిరిగితేనే లోకం తీరు తెలుస్తుంది. మనుషుల పోకడలు అవగతమౌతాయి. జీవితపు వైవిధ్యం అనుభవలోకి వస్తుంది. రోజులు కొత్తగా వెలుగుతాయి. విలక్షణ అనుభవాలు వినూత్న అనుభూతుల్ని అందిస్తాయి. అందుకే పర్యటించాలి .కొత్త ప్రాంతాలలోకి ప్రవహించాలి. మామూలు రోజుల్లో ఏదో ఒక హడావిడి వుంటూనే వుంటుంది. జీవిక కోసం పరుగులు తీయక తప్పదు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - తులసీదాస్

మొగల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనా కాలంలో (16వ శతాబ్ది) తులసిదాస్ నామధేయం గల ఒక పుణ్యపురుషుడు.ఇట్టా జిల్లా (ప్రసుతం ఉత్తరప్రదేశ్‌లో ఉంది) అలీగంజ్ పరగణాకు చెందిన సోరోన్ గ్రామ వాస్తవ్యుడు - ప్రస్తుతం రాజపూర్ నెలకొన్న జమునా నదీ తీరంలోని అరణ్య ప్రాంతానికి వచ్చినట్లు సంప్రదాయ సిద్దంగా చెప్పబడుతున్నది. తులసీదాస్ రాజపూర్ స్థాపించి, ఒక దేవాలయాన్ని నిర్మించి,అనేకమంది అనుచరుల్ని ఆకర్షించాడు. [ ఇంకా...]

Tuesday, September 25

ఆహార పోషణ - పెరుగు ప్రయోజనాలు

వేసవి కాలంలో ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తినడంవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపులో మంట తగ్గుతుంది. మెదడుకి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి పెరుగును మించిన వస్తువు మరొకటి లేదు. పెరుగున ఎక్కువగా వాడుతూండటం చేత పంజాబీలు అంత దిట్టంగా, బలంగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారాలలో పెరుగు చాలా ముఖ్యమైనది. దీనిలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. [ ఇంకా...]

సంస్కృతి - పీర్ల పండుగ

పీర్ అంటే మహాత్ముడు అని అర్ధం. మొహరం పండగనే పీర్ల పండగ అంటారు. హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్ధం ముస్లింలు జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండగ. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారుచేసి, వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించేవాటిని పీర్లు అని పిలుస్తారు. [ ఇంకా...]

ఆహార పోషణ - చింతలు తీర్చే చింత

చింత ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం.
ఇది ఇప్పుడు ఉష్ణ ప్రదేశాలలో అనేక చోట్ల ప్రవృద్ధి పొందుతూంది. వృక్ష శాస్త్రంలో దీన్ని టామరిండస్ ఇండీకా అంటారు. తెలుగులో చింత, కన్నడంలో హుళి, తమిళంలో పుళి, హిందీలో ఇంలి, మరాటీలో చించి, సంస్కృతంలో తింత్రిణీ అని వివిధ పేర్లతో ఇది పిలవబడుతుంది. [ ఇంకా...]

Monday, September 24

నృత్యం - అభినయం

మానవుడు ఒక పనిని నిర్వర్తించడానికి ముందు ఉచ్చ్వాస నిస్వాసాలు, చేష్ట లేక కదలిక ముఖ్యం. కదలిక మానవుని సజీవ లక్షణం. కదలిక లేనప్పుడు మానవునికి, చెట్లు చేమలకి భేదం కనిపించదు. అభినయం, నాట్యం రెండూ ప్రాధమిక దశలో చేష్ట ప్రాతిపదికగా ఏర్పడినవే. ఇది రానురాను ఒక కళగా రూపొందింది. ఈనాటి అభినయ కళకుగానీ, నాట్య కళకుగానీ ఆదిమ దశలో మానవ శరీరావయవాల వివిధ చేష్టలు, విన్యాసాలు ముఖ్యాధారం. [ ఇంకా...]

మీకు తెలుసా - చీమ

ఐకమత్యం అనగానే ముందు చీమలే గుర్తుకొస్తాయి. వాటి గొప్పతనం అలాంటివి.ఒకే పుట్టలో కొద్దీ కలిసి ఉండడమే కాదు. వాటి పని అవి క్రమం తప్పక చేసుకోవడంలో ఎంతో క్రమశిక్షణ పాటిస్తాయి కూడా. చీమలు పుట్టుకొచ్చింది కందిరీగల నుంచే అంటే నమ్ముతారా? ఇవి సుమారు 10 కోట్ల ఏళ్ళ కిందట కందిరీగలతో విడిపోయి, ప్రత్యేక జీవులుగా రూపొందాయి. [ ఇంకా...]

సంస్కృతి - హరికథ

ఈ కళా రూపంలో ఒకే కథకుడు దాదాపు మూడు గంటలకుపైగా గానం చేస్తాడు. ఆకర్షణీయమైన ఆహార్యంతో ప్రేక్షకులకు విసుగు కలగకుండా చేతిలో చిరతలతో ఆయన చేసే కథా కాలక్షేపం వేదాంత సహితంగా ఉంటుంది. సంపూర్ణ రామాయణం, సంపూర్ణ భారతం, భాగవతం వంటి అనేక ఆధ్యాత్మిక సంబధిత పురాణేతిహాసాలలొనై కథలను అత్యంత రమణీయంగా ఆలపిస్తూ, భక్తి సూత్రాలను ఉపదేశిస్తూ వీరు చేసే గానం ప్రజలను ముక్తి మార్గంపట్ల పయనించేటట్లు చేస్తుంది. [ ఇంకా...]

Saturday, September 22

మీకుతెలుసా - వయసుతో పని ఏముంది

ఏ వయసుకా ముచ్చట అన్నారు పెద్దలు. అంటే ఏ వయసుకైనా ముచ్చట్లు ఉంటాయన్నది అందరూ ఒప్పుకుంటున్న విషయం అన్నమాట. మరి ఆ ముచ్చట్లు ఎలా ఉండాలి? చిన్న వయసువాళ్ళకైతే ఆటలు, పాటలు, అల్లరి. మధ్య వయస్కులకు ఆటలు, పాటలు, కబుర్లు. వృద్ధులకు కూడా ఆటలుంటాయి, పాటలుంటాయి, వాటితోపాటు వారు తలచుకుంటే అనేక రకాలైన ముచ్చట్లుంటాయి. వయసుకు తగ్గ ముచ్చట్లు అనేది ఉద్యోగం-సద్యోగాలకీ, పెళ్ళి పేరంటాలకీ సంబంధించినవని మన పెద్దోళ్ళ భావన. [ ఇంకా...]

Friday, September 21

ఆధ్యాత్మికం - మీరాబాయి

మీరాబాయి 1498 లో రాజస్థాన్‌లో మెర్బా పట్టణంలో రాధోర్స్ రాజవంశంలో జన్మించింది. ఈమె తండ్రి రావు రతన్‌సింగ్ గొప్ప వైష్ణవ భక్తుడు. వీరు నివసించే ఇంటికి సమీపంలో ఒక విష్ణు దేవాలయం ఉండేది. మీరాబాయి తన తల్లిదండ్రులతో తరచు ఈ విష్ణుదేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తూండేది. అక్కడ విష్ణువుని స్తుతించే స్తోత్రాలు, కీర్తనలు మిరాబాయి మనస్సులో పూర్తిగా నాటుకున్నాయి. [ ఇంకా...]

సంస్కృతి - పేరిణి

పేరిణి శివతాండవం వీర నాట్యశైలికి చెందింది. ఈ సంప్రదాయం శైవ మతానికి సంబంధించింది. పేరిణికి సంబంధించిన ప్రస్తావన పాల్కురికి సోమనాధుని పందితారాధ్య చరిత్రలోనూ, శ్రీనాధుని కాశీఖండం, భీమఖండంలోనూ వర్ణించబడింది. కాకతి గణపతి చక్రవర్తికి సేనా నాయకుడైన జయప సేనాని 1253-54లో రచించిన నృత్యరత్నావళిలో పేరిణి గురించి వర్ణించాడు. [ ఇంకా...]

ఆహార పోషణ - ఆయుర్వేదం

ఆయుర్వేదం అతి ప్రాచీనమైన భారతీయ వైద్య విధానం. ఆంగ్లేయుల పరిపాలన ఫలితంగా దేశంలో అల్లోపతి బాగా ప్రబలి ఆయుర్వేదానికి గల గౌరవం, ప్రసిద్ధి క్షీణించిపోయాయి. కానీ, ఈనాటికీ ఈ వైద్య విధానం పట్ల అపార నమ్మకంగల వారు ఎందరో ఉన్నారు.
ఆయుర్వేదం అనగా "ఆయుర్వేత్తీతి ఆయుర్వేద:" ఆయ్యుర్దాయమును తెలుసుకొనునది ఆయుర్వేదము. ఇది వేదములందలి ఒక భాగం.మానవునికి సామాన్యంగా శరీరంలో త్రిదోషముల వృద్ధి, క్షయము వలన ఆరోగ్యము చెది రోగాలు సంభవిస్తాయి. [ ఇంకా...]

Thursday, September 20

సైకాలజీ - అసూయ-అనారోగ్యం

అసూయ అన్నది ఎంత మోతాదులో ఉన్నా అది విషంలా పనిచేస్తుంది. అంతేకాదు అది మన మానసిక అరోగ్యంపై దెబ్బతీస్తుంది. దయాగుణం మనకు రెండింతల ఆశీర్వచనాలను అందజేస్తుంది. కాని అసూయ గుణం మనకు రెండింతల హానిని కలిగిస్తుంది.
మన నిజజీవితంలోనూ, పుస్తకాలలోనూ అసూయ వల్ల గలిగే నష్టాలను చూస్తూనే ఉన్నాము. తొలుత ఇది అతి చిన్న భావనగా మొలకెత్తుతుంది. ఆ తరువాత ఇది పెరుగుతూ వస్తుంది. ఆ కారణంగా మనం చెప్పలేనన్ని కష్టాలకు గురి అవుతుంటాము. [ ఇంకా
...]

ఆధ్యాత్మికం - కబీరు

కబీరు 15 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ విప్లవాత్మక యోగి. ఆధ్యాత్మిక సిద్ధ పురుషుడు, ఆనాడు తీవ్ర మత వైషమ్యాల వల్ల, పరస్పర విరోధాల వల్ల హిందూ, మహమ్మదీయుల మధ్య ఏర్పడిన అగాథానికి గొప్ప సేతువు వంటి కబీరు ఉపదేశాలు రెండు మతాల సామరస్యానికి అధికంగా సహకరించాయి అనడంలో సందేహం లేదు. [ ఇంకా...]

ఆహార పోషణ -  పుదీనాతో వైద్యం

వికారం మటుమాయం:
చక్కని సువాసనను ఇచ్చే పుదీనా ఆకులు వంటలలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.చాలా రకాల కూరల్లో పోపుల్లో కూడా ఈ పుదీనా ఆకుల్ని వేస్తారు.కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా వాసన చూస్తే ఆ వికారం మాయం అవుతుంది. పుదీనాను టూత్ పేస్ట్ పిప్పర్ మెంట్లు, చూయింగ్ గమ్ మెంథాల్‌తో పాటు అనేక మందుల్లో వాడుతున్నారు. [ ఇంకా...]

సంస్కృతి - కోలాటం

పిల్లల్నీ, పెద్దల్నీ అందర్నీ అలరించే కళారూపమిది. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ ప్రదర్శిస్తుంటారు. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల ఈ పదం ఏర్పడిందంటారు. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. [ ఇంకా...]

Wednesday, September 19

సాహిత్యం - ఇతర బాషాపదాలు

మనకు తెలీకుండానే మనం కొన్ని ఇతర భాషా పదాలను నిత్యం వాడుతూ ఉంటాం. భౌగోళికంగా ఇతర రాష్త్రాలతో మనకున్న సరిహద్దు సంబంధాల వల్లగానీ, వ్యాపార సంబంధాలవల్లగానీ లేక వలసలవల్లగానీ ఇతర భాషలు మన భాషలో మిళితంకావడం జరుగుతుంది. అది సంసుకుతం కావొచ్చు, తమిళం, కన్నడ, మలయాళ్లం, మరాఠి లేదా ఏ ఇతర భాషైనా కావొచ్చు. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. [ ఇంకా...]

Tuesday, September 18

సైన్స్ - రక్తదానము

సుప్రసిద్ద ఆంగ్లేయ వైద్యుడు, శరీర శాస్త్రజ్ఞుడు విలియం హార్వే (1578 - 1657) మానవ శరీరంలో రక్త ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. రక్త ప్రసార కార్యక్రమాన్ని ఇతడు ప్రత్యక్షంగా నిరూపించాడు. దీనిని తెలుసుకున్న తరువాత మానవుని యందు రక్తదానము, శరీరంలోకి నెత్తురు ఎక్కించుట అనే విషయాలపై అభిలాష, ఆసక్తి పెరిగింది. ఇంతకుముందు శరీరంలో రక్తం పోటుతో ప్రవహిస్తుందనే సిద్ధాంతం ప్రచారంలో ఉండేది. [ ఇంకా...]

వ్యాయామ శిక్షణ - యోగ

సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన భారత దేశానికి అత్యంత ప్రాచీనమైన సంపద యోగ.భారత సంతతికి వంశపారంపర్యంగా, గురూపదేశంగా నేటికీ విడువకుండా అనుసరిస్తూ వస్తున్న ఏకైక హృదయ తరంగమిది. ఇది భారత ఋషుల అద్భుత సృష్టి. ఈ సృష్టికి 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మనసుని అధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాణ శక్తిని పెంపొందించడమనే ఈ ప్రక్రియ అద్భుతాలలోకెల్లా అద్భుతం. [ ఇంకా...]

సంస్కృతి - భాగవతులు

భగవంతునికి సంబంధించిన గాధలను ప్రచారం చేయడం వలన వీరిని భాగవతులు అన్నారు. ఆంధ్ర దేశంలో నృత్య కళను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వారిలో వీరి స్థానం ప్రత్యేకమైంది. వీరు యక్ష గానాలూ, వీధి భాగవతాలూ, భామాకలాపాల ద్వారా నృత్య కళను ప్రచారం చేశారు. వీరిది నాట్య మేళ సాంప్రదాయం. పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలను నృత్య నాటకాలుగా ప్రదర్శించే సంప్రదాయం నాట్యమేళ లేక భాగవత మేళ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో స్త్రీలు పాల్గొనరు. స్త్రీ పాత్రల్ని కూడా పురుషులే ధరిస్తారు. [ ఇంకా...]

ఆధ్యాత్మికం - మహమ్మద్ ప్రవక్త సూక్తులు

ప్రేమించు-ప్రేమింపజేసుకో-ఇదే జీవిత ముఖ్య లక్ష్యం.
పరస్పానురాగాలతో ప్రవృద్ధి పొందే వారిని స్వర్గం ఆహ్వానిస్తుంది. పరస్పర ద్వేషులకు నరకమే ప్రాప్తి.
వివేకాన్ని మించిన అమూల్య వస్తువు లేదు.
[ ఇంకా...]

సాహిత్యం - నిఘంటువు

సమాచారాన్ని, విజ్ఞానాన్ని అందించే విజ్ఞానఖనులు నిఘంటువులు. అనంతమైన పదాల సమూహాన్ని అందించే సంపుటాలు. సామాజిక, రాజకీయ, ఆర్ధిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విస్తరిస్తున్న ప్రగతిని ప్రతిఫలించే పదజాలాన్ని దాచుకున్న పెన్నిధులు. వివిధరంగాల్లో ఆదానప్రదానాలకు అనువైన వేదికలు. హద్దులు, సరిహద్దులు చెరిపేస్తూ ప్రపంచ దేశాల ప్రజల మధ్య అనుసంధానానికి ఉపకరించే వారధులు. ఆధునిక జీవితానికి అవసరమైన జ్ఞాన గవాక్షాలు. [ ఇంకా...]

Monday, September 17

స్త్రీల పాటలు - సతిపతి సంవాదము

(తలుపు దగ్గర పాట)
చిలుకల కొలికిరో చిత్రకవాటము బిగియించుట తగవేమి?
ఇవ్వల గుందగపనియేమి పగలు అడుగుటకు యెక్కడ దొంగవు
వదలర వదలవోయి నీవనితల ఒల్లగనోయి చిలుకల [ ఇంకా...]

సంస్కృతి - సంగీత స్తంభాలు

తమిళనాడులోని మధురై మీనాక్షి ఆలయంలో కంపించే సంగీత రాతి స్తంభాలు - భూగర్భ శాస్త్రం మరియు సంగీత శాస్త్రంలో మధ్య యుగాలనాటి భారతీయుల అసాధారణ విజ్ఞానికి స్పష్టమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 500 ఏళ్ళనాటి నల్ల రాతి స్తంభాలపై ఒక కర్రతో కొట్టినప్పుడు యాత్రికులకు దిగ్భ్రమ కలిగిస్తూ వాటినుండి వివిధ రకాల సంగీత స్వరాలు ఉద్భవిస్తాయి. ఈ దేవాలయాన్ని దర్శించే సందర్శకులు తమ పిడికిళ్ళతో స్తంభాలను కొట్టి, అవి ఉత్పత్తి చేసే సంగీత ధ్వనులను ఆలకిస్తుంటారు. [ ఇంకా...]

మీకు తెలుసా - నాణేల చరిత్ర

భారతీయ చరిత్రలో కనిపించే కొన్ని నిశ్శబ్దాలను నాణీలు చేదించాయి కాని, నాణేలకు సంబంధించిన కొన్ని రహస్యాలు మాత్రం ఇప్పటికీ అంతుపట్టకుండా ఉన్నాయి. అవి సామ్రాజ్యాలు విడుదల చేసిన నాణేలు కావచ్చు, జనపదాలలో చెలామణీ అయిన నాణేలైన కావచ్చు, అవి ఏవైనా, తొలి యుగాలకు చెందిన మన నాణేలపై పాలకుల పేర్లేమీ కనపడవు. [ ఇంకా...]

Friday, September 14

పండుగలు - శ్రీ వినాయక వ్రతకల్పము

మన దేశంలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయనన్నే. పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన వంటి కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, మేధస్సుకు సంకేతాలు. వక్రతుండము ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఒక చిన్న ఎలుక. అదే ఆత్మలోని చమత్కారం. [ ఇంకా...]

సంస్కృతి - క్రైస్తవుల కళారుపాలు

క్రైస్తవ కథా గానాన్ని రచించిన ప్రధమ కవి పిడతల జాన్ కవి. ఈయన భారత పురాణాలనూ, హరికథలనూ విని, గ్రహించి వాటిలోని మెళకువలను తెలుసుకుని బైబిలులోని ఘట్టాలను అనుసరించి హరికథా కాలక్షేపాలుగా మలిచారు. వాటిలో ఆదాము-అవ్వ, క్రీక్స్తు జననం పేర్కొనదగినవి. అలాగే మందపాటి భాగవతార్ ఏసు చరితమును రచించారు. [ ఇంకా...]

Thursday, September 13

సాహిత్యం - జానపద సాహిత్యం

కూని రాగాలాపనతో ప్రకృతి లయకు అనుగుణంగా వచ్చిన గానం భాషా సంపర్కంతో గేయంగా రూపొంది మానవ మనుగడకు సంబంధించిన వివిధి దశలకు రూపులో మార్పు, కూర్పులో చేర్పులు పాత ఒరవడిలో కొత్త పదములు కొత్తజీవనానికి పాత బాణీ మొదలగు చేర్పులు, మార్పులు కూర్పులతో నిత్యం సరికొత్త రూప సాక్షాత్కారమిచ్చే జానపద వాజ్ఞ్మయం నిత్యనూతనమైందిగా ప్రశస్తికెక్కినది. జానపద వాజ్ఞ్మయం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. మౌఖిక సంప్రదాయంలో జీవించడం మూలంగా దీనికి ఒక క్రమమైన పరిణత స్వరూపు కానరాము. [ ఇంకా...]

భక్తి గీతాలు - శివుని మీద పాట

శివుని మెడలో నాగరాజ చిన్ని పార్వతి పిలిచిన దేవా
దేవి పిలుపులు ఆలకించేవా! శివనాగరాజా తల్లి పిలుపులు ఆలకించేవా శి
అన్నపూర్ణా హైమావతి పంకజాక్షిపద్మావతి కాళికాంబ నిన్ను పిలచెనుగా!
శివనాగరాజా తల్లి పిలుపులు విన్నవించేవా శి [ ఇంకా...]

పిల్లల పాటలు - బొమ్మరిల్లు

చిట్టి చిట్టి మిరియాలు చెట్టుకింద పోసి
పుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి
అల్లం వారింటికి చల్లకు పోతే
అల్లం వారి కుక్క భౌ భౌ మన్నది
నాకాళ్ళ గజ్జెలు ఘల్లు ఘల్లుమన్నది
చంకలో పాప కేర్ కేర్ మన్నది [ ఇంకా...]

నీతి కథలు - గొప్ప గుణం

మొగసాల మర్రి గ్రామంలో ధర్మయ్య, రంగయ్య అనే ఇద్దరు వడ్డీ వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారిలో ధర్మయ్య తక్కువ వడ్డీ తీసుకొని అడిగిన వారికి లేదనక అప్పులిచ్చి అవసరాలలో ఆదుకొంటుండేవాడు. ఎవరైనా ఇచ్చిన అప్పును సకాలంలో తీర్చకపోతే పీడించేవాడుకాదు. అందువల్ల ఆ ఊరి ప్రజలకు ధర్మయ్య అంటే చాలా ఇష్టం. కాని రంగయ్య మాత్రం పరమలోభి. అధిక వడ్డీలు గుంజి లక్షలకు లక్షలు సంపాదించాలని కలలు కనేవాడు. అప్పులు తీర్చకపోతే వారు తాకట్టు పెట్టిన భూములు, నగలను, ఇండ్లను తిరిగి ఇవ్వక వారికి నిలువ నీడ లేకుండా చేస్తాడు. [ ఇంకా...]

Wednesday, September 12

నీతి కథలు - కప్పరాజు సాయం కష్టాలన్నీ మాయం

అనగనగానేమో ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళు ఇద్దరూ మంచి వాళ్ళుకారు. చిన్నవాడు మంచివాడేకానీ, పాపం అమాయకుడు. వీరిలో రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలా అని రాజు ఆలోచించి, ముగ్గుర్నీ పిలిచి మీకు మూడు పరీక్షలు పెడతాను. గెలిచిన వాడిదే రాజ్యం. మొదటి పరీక్షగా ప్రపంచంలోనే గొప్ప శాలువా తేవాలి అన్నాడు. ముగ్గుర్నీ మైదానంలోకి తీసుకువెళ్ళి మూడు పక్షి ఈకల్ని పైకి ఎగురవేసి అవి ఎటు ఎగిరితే ఆ దిశల్లో వెళ్ళిరండి అని కోటలోకి వెళ్ళిపోయాడు. [ ఇంకా...]

వంటలు - చాంద్ బిస్కట్స్

కావలసిన వస్తువులు:
మైదా - 500 గ్రా.
పంచదార పొడి - పావు కిలో.
యాలకులు - 3 గ్రా.
వనస్పతి - పావు కిలో.

తయారు చేసే విధానం :
మైదాను జల్లించండి. మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచండి. పిదప పంచదార పొడి చేర్చండి. ఇందులోకి కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయండి. [ ఇంకా...]

వంటలు - పప్పు పొంగలి

కావలసిన వస్తువులు:
బియ్యం - 250 గ్రా.
పెసరపప్పు - 100 గ్రా.
పచ్చిమిర్చి (నిలువుగా కట్ చేసినవి) - 8.
ఆవాలు - 1/4 (పావు) టీ స్పూను.
జీలకర్ర - 1/4 (పావు) టీ స్పూను.
ఉప్పు - సరిపడినంత.
అల్లం - చిన్న ముక్క.
కరివేపాకు - 1 రెమ్మ.
కొత్తిమీర - 1 రెమ్మ.
ఖాజూ (జీడి పప్పు ) - సరిపడినంత.
మిరియాలు - కొద్దిగా.
నెయ్యి - సరిపడినంత.

తయారు చేసే విధానం:
బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని నీళ్ళలో పావుగంట నానబెట్టాలి. గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వరుసగా వేసి దోరగా వేగాక సరిపడినన్ని నీళ్ళతో ఎసరు పెట్టాలి
. [ ఇంకా...]

పిల్లల పాటలు - ఏనుగు పాట

ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో చక్కని దేవుడు.
[ ఇంకా...]

Tuesday, September 11

వంటలు - జైపురి ఛాట్

కావలసిన వస్తువులు:
ఆలు - 250 గ్రా.
చాట్ మసాల - 2 టీ స్పూన్లు.
కొత్తిమీర - సరిపడినంత.
మిర్చిపొడి - సరిపడినంత.
ఉప్పు - సరిపడినంత.
చింతపండు చట్ని - సరిపడినంత.
పెరుగు - 2 టీ స్పూన్లు.
ఉల్లిపాయ - 1
టమోట - 1
పచ్చి మిర్చి - 2.
సన్నటి కారంపూస -సరిపడినంత.
సెనగలు (ఉడికించినవి) - 50 గ్రా.

తయారు చేసే విధానం:
ఆలును మెత్తగా ఉడికించి చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి. [ ఇంకా...]

వంటలు - కొర్ర బజ్జీ

కావలసిన వస్తువులు:
శనగపిండి - 250 గ్రా
కొర్ర పిండి (బియ్యపు పిండి) - 500 గ్రా.
జీలకర్ర - 10 గ్రా.
మిర్చి పొడి - 25 గ్రా.
తినే సోడా - చిటికెడు.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - 500 గ్రా.
లావు మిర్చి - సరిపడినన్ని.

తయారు చేసే విధానం :
శనగపిండి, కొర్రపిండి, మిర్చిపొడి, ఉప్పు, జీలకర్ర, తినే సోడా అన్నింటిని పొడిగా కలపాలి. [ ఇంకా
...]

నీతి కథలు - కోతులు - పాలపిట్ట

మూర్ఖులకు మంచి మాటలు, మంచి సలహాలు చెవికెక్కవు. అలాంటి వాళ్ళకి సలహాలు చెప్పటం వృధా ప్రయాస మాత్రమేకాదు. ఒక్కోక్కసారి ప్రాణాలకు కూడా ముప్పు కలుగవచ్చు. అందుకనే సాధ్యమయినంత వరకు మూర్ఖులకు దూరంగా ఉండటం ఉత్తమం. మూర్ఖులైన కోతిమూకకి ఓ సలహా ఇవ్వబోయి తన ప్రాణాలు పోగొట్టుకున్న పక్షి వైనం ఈకధలో తెలిసుకుందాం. [ ఇంకా...]

భక్తి గీతాలు - ఏడుకొండల స్వామి

ఏడుకొండలస్వామి - ఎక్కడున్నావయ్యా
ఎన్ని మెట్లెక్కినా - కానరావేమయ్యా
ఆకాశమందూ ఈ కొండ - శిఖరమ్ము పై
మనుజులకు దూరంగా - మసలుతున్నావా ఏడు [ ఇంకా
...]

Monday, September 10

నీతి కథలు - కోతి యువకుడు

ఒక బిచ్చగాడుండేవాడు. దొరికినదేదో తిని, ఏ అరుగు మీదనో నిద్రపోయేవాడు. ఖరీదైన కోరికలు లేనందున వాడికి సుఖాల మీదికి మనసు పోలేదు. ఒకసారి వాడికి, ఓ గొప్పదాత ఐదు దీనారాలు బహుమతిగా ఇవ్వగా దాంతో ఒక కోతిని కొన్నాడు. అది ఆడిస్తూ బతికితే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చని బిచ్చగాడి ఊహ. ఓ రాత్రి వేళ కోతి ఒక యువకుడిగా మారిపోయింది. అతడు బిచ్చగాణ్ణి పేరుపెట్టి పిలిచి, ఒక బంగారు నాణెం ఇచ్చి ఇద్దరికీ భోజనం తెమ్మన్నాడు. నువ్వు ఏ శాపం వల్ల ఇలా అయ్యావని అడగబోయాడు బిచ్చగాడు. [ ఇంకా...]

వంటలు - చిక్కుడుగింజలతో కుడుములు

కావలసిన వస్తువులు:
చిక్కుడుగింజలు : రెండుకప్పులు
బియ్యం పిండి : మూడు కప్పులు
ఉప్మారవ్వ : ఒక కప్పు
పచ్చిమిరపకాయలు : 10
జీలకర్ర : ఒక టీ స్పూన్
ఉల్లి ఆకు : ఒకకప్పు
కొత్తిమీర : అర కప్పు
చాట్ మసాలా : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె: కొద్దిగా

తయారు చేసే విధానం:
ముందుగా చిక్కుడు గింజలను ఉడికించుకోవాలి. అందులో నుంచి ఒక కప్పు గింజలు తీసుకుని మెత్తగా దంచుకోవాలి. [ ఇంకా
...]

వంటలు - చేమదుంప వేపుడు

కావలసిన వస్తువులు:
చేమదుంపలు - అర కిలో.
నూనె - వేయించటానికి సరిపడినంత.
ఉప్పు - తగినంత.
కారం - తగినంత.

తయారు చేసే విధానం :
ముందుగా చేమదుంపల్ని ఉడకబెట్టి తొక్కలు వలిచి ముక్కలుగానో, చక్రాలుగానో తరుక్కోవాలి. [ ఇంకా
...]

పిల్లల పాటలు - ఎంతపెద్దదొ !

ఎంత పెద్దదొ
ఎంత పెద్దదొ
ఏనుగంటే
ఎంత పెద్దదొ !
[ ఇంకా...]

Saturday, September 8

వంటలు - గోధుమ అట్టు

కావలసిన వస్తువులు:
గోధుమ పిండి - పావు కిలో.
నూనె - 100 గ్రా.
పుల్లని మజ్జిగ - తగినన్ని..
పచ్చిమిర్చి - 10.
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు - 2.

తయారుచేసే విధానం:
పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గోధుమపిండి మజ్జిగలో వేసి బాగా గరిటె జారుగా కలిపి ఉప్పు, మిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. [ ఇంకా...]

వంటలు - కొబ్బరి బూరెలు

కావలసిన వస్తువులు:
పచ్చి కొబ్బరి చిప్పలు - 2.
గోధుమపిండి - 1/2 కేజి.
బియ్యపు పిండి - 1/4 కేజి.
నెయ్యి - 100 గ్రా.
యాలుకలు - 4.
బెల్లం - 1/2 కేజి.
నూనె - తగినంత.

తయారు చేసే విధానం:
ముందుగా గోధుమపిండి, బియ్యపు పిండి రెండింటిని ఒకే గిన్నెలోకి తీసుకొని, పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి చిప్పలను కోరుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో బెల్లాన్ని తీగపాకం పట్టుకోవాలి. [ ఇంకా...]

పిల్లల పాటలు - ఒప్పులకుప్పా ఒయ్యారి భామ

ఒప్పులకుప్పా ఒయ్యారి భామ
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూలాడి [ ఇంకా...]

నీతి కథలు - మారిన మనసు

రామచంద్రయ్య ఆ వూరిలో పెద్ద వ్యాపారస్తుడు. అతనికి పువ్వులంటే చాలా ఇష్టం. అందువలనే ఇంటి చూట్టూ వున్న ఖాళీస్థలంలో రకరకాల పూల మొక్కలను నాటించాడు. ఆ మొక్కల పెంపకం కొరకు రాజయ్య అనే ఓ తోటమాలిని ఏర్పాటు చేసాడు. రాజయ్య సోమరిపోతు. ఆ మొక్కలకు నీరు పోయడానికే చాలా కష్టపడేవాడు.
వేసవికాలం వచ్చింది. దాంతో పాటు ఆ వూరికి నీళ్ళ కరువు వచ్చింది. రామచంద్రయ్య ఇంట్లో వారి ఉపయోగానికే నీరు దొరకడం చాలా కష్టమవసాగింది. అందువలన ఇంట్లోని నీరు మొక్కలకు పోయడానికి ఉండేదికాదు.
[ ఇంకా...]

Friday, September 7

వంటలు - కాజు క్యారెట్

కావలసిన వస్తువులు:
కాజూ - 1 కిలో.
చక్కెర - 900 గ్రా.
నెయ్యి - 100 గ్రా.
రెడ్ కలర్ - 3 చుక్కలు.

తయారు చేసే విధానం:
కాజూను అరగంట పాటు నీటిలో నానబెట్టి, గ్రైండర్‌తో రుబ్బి చక్కెర వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. [ ఇంకా...]

నీతి కథలు - ఐకమత్యమే బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు. అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే. అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం. లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు. వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది. [ ఇంకా...]

పిల్లల పాటలు - ఈ దేశం నా దేశం

ఈ దేశం నా దేశం
ఎన్నటికీ నాదేశం
కాశ్మీరీ, బెంగాలీ
గుజరాతీ, మళయాళీ
అంగామీ, లంబాడీ
నా వాడే ఎవడైనా
. [ ఇంకా...]

Thursday, September 6

నీతి కథలు - అపాయానికి ఉపాయము

అపాయానికి ఉపాయము ఎంత ముఖ్యమో, ఉపాయానికి అపాయము లేకుండా జాగ్రత్త పడటం అంతే ముఖ్యము.
ఉపాయములో ఎలాంటి అపాయమున్నా తప్పించుకోవచ్చు. తెలివి, ఆలోచన సమయస్ఫూర్తి ఉంటే శత్రువును ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు త్రాగించవచ్చు. అలా సింహాన్ని చంపిన చిన్న కుందేలు కథ. [ ఇంకా...]

వంటలు - మసాలా పకోడీ

కావలసిన వస్తువులు:
శనగపిండి - 1/4 కిలో.
బియ్యప్పిండి - 3/4 కిలో.
ఉల్లిపాయ చీలికలు - ఒకటిన్నర (1 1/2)కిలో.
నూనె - తగినంత.
కరివేపాకు(వేయించినది) - 1కప్పు.
పచ్చిమిర్చి(సన్నగా తరిగినది) - అర కప్పు.
కొత్తిమీర తురుము - అర కప్పు.
అల్లంవెల్లుల్లిగుజ్జు - 2 టీ స్పూన్లు.
కారం - 2 టీ స్పూన్లు.
గరం మసాలా - 1 టీ స్పూను.
ఉప్పు - తగినంత.
బేకింగ్ పౌడర్ - పావు టీ స్పూను.

తయారుచేసే విధానం:
ఉల్లిపాయలు చీలికల్లా కోయాలి. ఈ ముక్కల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, అల్లంవెల్లుల్లి గుజ్జు వేసి బాగా కలపాలి. [ ఇంకా
...]

Wednesday, September 5

పిల్లల పాటలు - కలసి ఉందాం

అమ్మ అప్పచ్చి
కమ్మనప్పచ్చి
కోరితెచ్చాను
చేరి తిందాము
సగము నీకు
సగము నాకు
వద్దనబోకు - కద్దనబోకూ
కలసితిందాం - కలిసిఉందాం [ ఇంకా...]

నీతి కథలు - మోసగాళ్ళకు మోసగాడు

పాలకొల్లు చంద్రశేఖరం, సూర్యం ప్రాణ స్నేహితులు, ఇద్దరు సినిమాలకి షికార్లకీ తిరుగుతూ కాలక్షేపము చేస్తుంటారు. ఓ రోజు ఇద్దరూ సినిమాకని బయల్దేరారు. కొత్త సినిమా కారణముగా వాళ్ళు వెళ్ళేటప్పటికే బుకింగ్‌లో టికెట్స్ అయిపోయాయి. ఆ హాలులో దొంగటికెట్లు, అమ్ముతున్నారన్న పేరు బాగా వుంది.సార్! మీకు టికెట్స్ కావాలా, అన్న పిలుపుకు సూర్యం గమనించి కావాలి అన్నాడు. [ ఇంకా...]

పండుగలు - ఉపాధ్యాయుల దినోత్సవం

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి
ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి
జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు
సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు
అతడు ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !
పాఠశాల లేని పల్లెటూరైనా ఉండవచ్చేమోగానీ, ఉపాధ్యాయుడు లేని ఊరు మాత్రం ఉండకూడదు. [ ఇంకా...]

Tuesday, September 4

పండుగలు - కృష్ణాష్టమి

ఆ బాలకృస్తుడు దినదిన ప్రవర్థమానమగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగనా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగిలిస్తూ వెన్నదొంగగా ముద్ర వేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనములో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట! వెన్న జ్ఞానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! [ ఇంకా...]

వంటలు - క్యారెట్ లడ్డు

కావలసిన వస్తువులు:
క్యారెట్ తురుము - 200 గ్రా.
పచ్చి కొబ్బరి తురుము - 50 గ్రా.
బొంబాయి రవ్వ - 30 గ్రా.
జీడిపప్పు - 10 గ్రా.
కిస్ మిస్ - 10 గ్రా.
పంచదార - 50 గ్రా.
యాలుకల పొడి - చిటికెడు.

తయారు చేసే విధానం :
క్యారెట్‌ను తురిమి కొద్దిగా రసాన్ని వడగట్టి తురుమును తీసుకోవాలి. బొంబాయి రవ్వ, జీడిపప్పులను ఆయిల్ లేకుండా విడిగా దోరగా వేయించాలి.
[ ఇంకా...]

వంటలు - క్యారెట్ జ్యూస్

కావలసిన వస్తువులు:
క్యారెట్ - 200 గ్రా.
బొప్పాయి - 50 గ్రా.
కర్బూజ - 50 గ్రా.
బెల్లం ముక్కలు - సరిపడినన్ని.
యాలుకల పొడి - చిటికెడు.

తయారు చేసే విధానం :
క్యారెట్, బొప్పాయి, కర్బూజా లను విడివిడిగా మిక్సీలో వేసి జ్యూస్ తయారు చేసుకోవాలి. [ ఇంకా
...]

Saturday, September 1

పిల్లల పాటలు - ఏనుగొచ్చింది...

ఏనుగొచ్చింది ఏనుగు - ఏ వూరొచ్చిందేనుగు
మావూరొచ్చిందేనుగు - మంచినీళ్ళే తాగిందేనుగు
ఉప్పునీళ్ళు తాగిందేనుగు - ఊరెళ్ళగొట్టిందేనుగు.
[ ఇంకా...]

నీతి కథలు - స్నేహ ఫలం

చ్యవన మహాముని గంగా యమునల సంగమ ప్రదేశాన నీళ్ళలో మునిగి సమాధిపరుడై తపస్సు చేస్తున్నాడు. చేపలు ఆయన శరీరమంతా ఎక్కి హాయిగా తిరగటం మొదలు పెట్టాయి. ఆయన కరుణతో వాటిని మన్నించాడు. వాటి చేష్టలకు సంతోషపడ్డాడు. అలా పన్నెండేళ్ళు గడిచిపోయాయి. ఒకసారి జాలరులు ఆ ప్రాంతానికి వచ్చి వల వేశారు. చేపలతో పాటు చ్యవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు. [ ఇంకా...]