Friday, November 7

జానపద కళారూపాలు - వీధి నాటకాలు

ఇప్పుడంటే రంగ స్థలం హాలు, కర్టెన్లు - ఇలా ఎన్నో విధాల అభివృద్ది చెందిందిగాని, ఒకనాడు వినోద ప్రదర్శనలు అన్నీ వీథిల్లోనే జరిగేవి. ఒకనాడు వీధులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. పాఠశాలలన్నీ వీధుల్లోనే ఉండవి. అందుకే వాటిని వీధి బడులు అనే వారు. నడి వీధిలోనే దేవదాసి నృత్యాలు, మేజువాణీలు జరిగేవి. పురాణ గాధలను కూడా పండితులు వీధులలోనే చెప్పేవారు. వీధికి అంతటి ప్రాముఖ్యత ఉండేదానాడు. అలాగే నాటకాలు కూడా. నాటకాలను వీధుల్లో ఆడేవారు గనుక వాటిని వీధి నాటకాలు అనేవారు. వాటిని ప్రదర్శించేవారిని భాగవతులు అనేవారు. అసలు ఒకనాడు గ్రామ పంచాయితీల పాలనా వ్యవహారాలన్నీ వీథుల్లోనే ఏ వేప చెట్టుక్రిందో, ఏ రావి చెట్టు క్రిందో జరిగేవి. ప్రధానంగా రామాయణం, భారతం, భాగవత, గాథలూ, బసవపురాణ కథలూ వీథి నాటకాలుగా ప్రదర్శిస్తూండడం పరిపాటి. వీటిని దేశి నాటక ప్రదర్శనలు అంటే సరిపోతుందనుకుంటాను. ఈ దేశి నాటకాల పురోగతి శివకవుల ఆద్వర్యంలోనే జరిగింది. [ఇంకా... ]