అందరం సుబ్బారావు కూతురు పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అంటే వేరే చెప్పాలా? ఆడవాళ్ళు అందరూ రంగురంగుల పట్టుచీరెలు కట్టుకుని వచ్చారు. అందరూ సీతాకోక చిలుకల్లా మెరిసిపోతున్నారు. పట్టుబట్టలకు మనదేశంలో వున్నంత గిరాకీ యింక ఏ దేశంలోనూ లేదు. అసలు ఈ పట్టు విశేషాలు ఏమిటో చూద్దాం.
పట్టుబట్టలు ఎలా తయారు అవుతాయి?
పట్టు దారంతో పట్టు బట్టలు నేస్తారు. అయితే పత్తిలాగా పట్టు ఒక చెట్టుకాదు. పట్టు పురుగు అనే ఒక రకం కీటకం ఉంటుంది. ఇది రక్షణ కోసం తన చుట్టూ గూడు అల్లుకుంటుంది. ఈ గూడు బలమైన సన్నని దారాలు దారాలుగా వుంటుంది. ఈ సన్నని దారాలే పట్టుదారాలు. ఈ దారాలనే సాగదీసి మగ్గం మీద బట్టలుగా నేస్తారు.
పట్టు - పరిశ్రమగా ఎలా ఎదిగింది?
మన దేశంలో పట్టుతో బట్టలు నేయడం ఈనాటిది కాదు! 4,5 వేల ఏళ్ళ పై నుంచే అమలులో వుంది. రెండో ప్రపంచ యుద్ధంలో పారాచూట్‌ల తయారీలో పట్టును వాడారు. ఇవి సన్నగా గట్టిగా వుండడమే కారణం. మన దేశమే యితర దేశాలకు పట్టును సరఫరా చేసేది. తర్వాత పట్టుకు గిరాకీ పెరిగింది.
ఆ గిరాకీ తట్టుకోవడం కోసం పట్టును ఎక్కువగా తయారు చేయాలి. అందుకు పట్టు పురుగుల్ని పెంచడం ఎక్కువ చేశారు. ఇదే పరిశ్రమగా ఎదిగింది. [ఇంకా... ]