ప్రాచీనమైన దేశీ సారస్వత శాఖలో సంగీత రూపక ప్రధానమయిన యక్షగానాలను యక్షులు పాడే గీతాలు కనుక యక్ష గానాలు అనే పేరు వచ్చిందనీ, జక్కు జాతివారు వీటిని ఎంతో మక్కువతో ప్రదర్శిస్తారు కనుక యక్ష శబ్దం జక్కు శబ్దంగా మారిందనీ పలు వ్యాఖ్యానాలున్నాయి. 16వ శతాబ్దంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
యక్షగానం అనగా దేశీయ చందోబద్ధమయిన నాటకము. దీనినే పాటగా కూడా పేర్కొనక పోలేదు. యక్షగానాల గురించి బ్రౌణ్య నిఘంటువులో పాటగా పేర్కొనబడింది. అయితే అప్పకవి దృష్టిలో యక్షగానం పాటలుగల ప్రబంధం అయివుండవచ్చునని తోస్తుంది. ఎందుచేతనంటే అప్పకవీయంలో యక్షగాన ప్రశస్తి ఉంది. అందులో అర్ధచంద్రికలూ, త్రిపుట, జంపె, ఆటతాళము, 'వీనయక్షగాన ప్రబంధంబులతుకవచ్చు ' అని పేర్కొన్నాడు. [ఇంకా... ]