ఈ రోజుల్లో ఫోను వాడకం తప్పనిసరి అయ్యింది. కొన్ని కుటుంబాల్లో మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటాయి. సాధారణంగా ల్యాండ్ లైన్ ఒకటి ఇంట్లో ఉంటుంది. ఇది కాకుండా కొందరి ఇళ్ళల్లో పిల్లల దగ్గరకూడా ఫోన్లు ఉంటున్నాయి. ఒకే మనిషి రెండూ, మూడు ఫోన్లు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు. సెల్‌ఫోను కంపెనీలు రకరకాల ఆఫర్లలో ముందుకు వస్తున్నాయి. దీనితో కొందరు ఫోన్లని కూడా మార్చేస్తున్నారు. కొత్త ఫోన్లు కొంటున్నారు. ఆఫర్ల ఆకర్షణకు లోనయి అవసరమున్నా లేకున్నా మరో సెల్ కొంటున్నవారి సంఖ్య బాగానే పెరుగుతుంది. దీనితో నెలవారీ ఫోను బిల్లులు బాగానే చెల్లించాల్సి వస్తుంది. మధ్యతరగతి కుటుంబాల వారికి ఈ బిల్లులు కొన్నిసార్లు భారంగా తయారవుతున్నాయి. అలాగే ఫోన్లు కొనడంలో, వాడకంలో, నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నెల తిరిగేసరికి ఫోను బిల్లు తడిసి మోపెడు అవుతుంది. పర్సు బరువు తగ్గుతుంది.
1. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుంది. బయట భర్త లేదా భార్య దగ్గర ఉన్న సెల్‌కు ఫోను చేస్తుంటారు. అయితే ల్యాండ్ లైన్ నుంచి సెల్‌ఫోనుకు ఫోను చేస్తే చార్జి ఎక్కువ పడుతుంది. కనుక సెల్ టు సెల్ చేయటమే ఉత్తమం. లేదంటే అవసరమున్నంతవరకే మాట్లాడాలి. మాట్లాడటం అయిన తరువాత నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టు అని భార్యాభర్తలు వంతులకు పోతే బిల్లు ఎక్కువవుతుంది. [ఇంకా... ]