ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకి సుతుడు ||ముద్దుగారే||
అంత నింత గొల్లెతల అరచేత మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చబూ
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||ముద్దుగారే||
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖు చక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు ||ముద్దుగారే|| [ఇంకా... ]