Monday, November 24

వ్రతములు - పోలి స్వర్గమనకు వెళ్ళు వ్రతము

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి మిగిల రోజులు చేసినట్టుగా (నెల రోజులు చేసి నట్టుగా) స్నానం చేసి అరటి డొప్పలో ఒత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన్‌లో నీళ్ళు పొసి కాని దీని వొదులుతూ ఈ కథను చదువుకోవాలి.

ఒక చాకలిముసలికి ఐదుగురు కోడుకులువున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామునలేచి, యేటిలో స్నానముచేసి దీపములు పెట్టు కొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట నదికార్తీక బహుళ అమావాస్యనాడు చిన్నకోడలిని యింటికి కాపలాగనుంచి, పెద్దకోడండ్లను ముగ్గురును వెంటబెట్టుకొని నదియొడ్డునకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసి కవ్వమునంటియున్న వెన్న తీసి, ప్రత్తి చెట్టుకింద రాలిన ప్రత్తి గింజలతో వత్తిచేసి, ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కాని అత్తగారువచ్చి తిట్టునను భయముతో ఆ దీపముమీద చాకలిబాన కప్పెను. దేవతలు దానిభక్తికి మెచ్చి విమానము బంపి, దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలిదాని చిన్న కోడలును చూచి దగ్గర నున్న వారందరు "చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్న" దని ఆశ్చర్య పడసాగిరి. [ఇంకా... ]