క్రికెట్ ఆట నిబంధనలు
1. క్రికెట్ మ్యాచ్ రెండు జట్ల మధ్య ఆడబడును. ఒక్కొక్క జట్టులో పదకొండు మంది ఆడతారు.
2. జట్టుకు సారధ్యము వహించుటకు కెప్టెను ఉన్నా కెప్టెన్ హాజరుకాని పక్షములో వైస్ కెప్టెన్ ఆతని స్థానములో వ్యవహరించును.
3. ఆటగాడు గాయపడినా, అనారోగ్యమైనా ప్రత్యామ్నాయ ఆటగానిని అనుమతించవచ్చును. ప్రత్యామ్నాయ ఆటగాడు ఫీల్డింగ్ చేయుట లేక వికెట్ల మధ్య పరుగెత్తుటకు అనుమతించబడును. అతను బౌలింగ్, బ్యాటింగ్ చేయుటకు అనుమతించరాదు.
4. ఇన్నింగ్స్ ప్రారంభమునకు ముందు రెండు చివర్లు, ఆట పర్యవేక్షణకు ఇద్దరూ 'అంపైర్లు' నియమించబడతారు. ఆట ప్రారంభ సమయానికి 30నిమిషాలు ముందుగా అంపైర్లు తమ స్థానాలలో ఉండాలి. ఆట పూర్తి అగు వరకు వారు తమ విధి నిర్వహణలో ఆట స్థలంలో ఉండాలి.
5. పరుగులు, బౌలింగ్ వివరములు, 'స్కోరు షీట్' లో రికార్డు చేయుడానికి 'స్కోరర్లు' నియమించబడతారు. వారు అంపైర్లు యిచ్చు తాఖీదులు (Instructions) , సంజ్ఞలు (Signals) ప్రకారం స్కోరు రికార్డు చేయాలి. అంపైర్ల సిగ్నల్స్ కు అందినట్లుగా జవాబు చెప్పవచ్చును. [ఇంకా... ]