ఈ ఆటలో ముందుగా చిన్న చిన్న కాగితాల మీద జనరల్ గా ఆడవారు పెట్టుకొనే వస్తువుల పేర్లు వ్రాయాలి.
ఉదా: మట్టిగాజులు, స్టిక్కర్, తిలకం, కుంకుమ, నల్ల పూసలు, లిప్ స్టిక్, ముత్యాలదండ, పగడపు ఉంగరం, ముత్యపు ఉంగరం, మాటీలు, వెడల్పు గాజులు, సన్న గాజులు, లక్ష్మీదేవి ఉంగరము, చీరల రంగులు రాసుకోవచ్చు. ఇలాంటి కాగితం ముక్కలపైన రాసి మడత పెట్టి ఉంచాలి. ఆట ఏమిటంటే ఒక్కొక్కరి చేత ఆ పేపర్ స్లిప్ తీయించాలి. ఆ స్లిప్ లో రాసినది కనక వారు వేసుకొని వుంటే వారు అవుట్. అలా ఒక్కరు మిగిలేంత వరకు తీయించి చివరగా మిగిలిన వారిని విన్నర్స్ గా ప్రకటించటమే. [ఇంకా... ]