Monday, November 3

ఆధ్యాత్మికం - అద్వైత త్రయం

దేవుడు ఉన్నాడని అంగీకరించే మతం ఆస్తిక మతం. ఆస్తికులలో జీవులు చేతులు, కాళ్ళు మొదలైన వివిధ శరీరావయవాలులాగా దేవుని చేరి ఉంటారని చెప్పేవారు విశిష్టాద్వైతులు. జీవుడికీ, దేవుడికీ అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలలోనూ భేదం ఉంటుందని వాదించేవారు ద్వైతులు. రెండు విధాలు కానిది, భేదం లేదని వాదించేవారు అద్వైతులు. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీ శంకరాచార్యులు. అద్వైత వాదాన్నే "మాయా వాదం" అంటారు. దీనినే ప్రచ్చన్న బౌద్ధం అని కూడా అంటారు. ఈ దేహమే దేవాలయం. అందులో జీవుడే దేవుడు. దేహం పోయినా జీవుడు ఉంటాడని అద్వైతుల వాదన. దేహం నశించాక జీవుడు వేరే శరీరంలో ప్రవేశిస్తాడు. లేకపోతే ప్రకృతితో అంతర్లీనమైపోతాడు. పాలలో ఉండే వెన్నను తీసేస్తే ఆ వెన్న తిరిగి పాలలో కలవదు. అలాగే దేవుడు నుండి జీవుడుని వేరుచేస్తే ఆ జీవుడు తిరిగి దేవుడులో కలవడు. కాబట్టి జగత్తు సత్యం, జీవుడు సత్యం అంటుంది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైత వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీరామానుజాచార్యులవారు.

అద్వైత విశిష్టాద్వైతాల తరువాత ద్వైతమతం ఆవిర్భవించింది. ఈ మతాన్ని స్థాపించింది ఆనందతీర్ధులు. వీరినే మధ్వాచార్యులు అని కూడా అంటారు. వీరు జగత్తు సత్యం, దేవుడు సత్యం, జీవుడు సత్యం అంటారు. జీవుడూ, దేవుడూ ఎప్పటికీ ఒక్కటి కాజాలరు. [ఇంకా... ]