విశ్వాసం విజయావకాశాలను మెరుగు పర్చుకోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి, ఆనందాన్ని అందరికీ పంచి ఇవ్వడానికి కీలకమైన వనరు. ఇది ఆలోచనలనుంచి ఉధ్భవించినది కాబట్టి ఎవరికి వారు స్వయం కృషితో వృధ్ధి చేసుకోవచ్చు.విశ్వాసం తీగ లాంటిది. అది పాకడానికి స్థిరమైన పట్టుకొమ్మ కావాలి. విశ్వాసాన్ని వికసింపచేయడానికి బలమైన ధ్యేయం ఉండాలి. అందువల్ల ప్రతిఒక్కరికీ నిర్ధిష్టమైన జీవిత లక్ష్యం అవసరం. జీవిత లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా నిర్వచించుకోవాలి. లక్ష్యం అందుకోగలదిగా ఉండాలి.
ఒక లక్ష్యాన్ని సాధించిన తరువాత ఇంకొక లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాల లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఎప్పటికప్పుడు అందుకోగల లక్ష్యాన్ని నిర్ణయించుకుంటూ అంతిమ లక్ష్యం వైపు అంచెలవారీగా సాగిపోవాలి. స్వల్పకాల లక్ష్యాలను ముందుగా నిర్ణయించిన కొలమానాలతో సమీక్షించుకోవాలి. అంచనాలు వేసేటప్పుడే కాలాన్ని కూడా అందులో అంతర్భాగం చేయాలి. అంచనాలకు, సాధించిన ప్రగతికి మధ్య ఉన్న తేడాను ఎప్పటికప్పుడు ఆచరణాత్మకంగా సరిచూసుకొని సవరించుకోవాలి. [ఇంకా... ]