Wednesday, November 19

మీకు తెలుసా - వాడుక భాష

ప్రజలు తమ నిత్య జీవితంలో మట్లాడుకునే భాష వాడుక భాష. సనాతన భావాలను సమర్ధిస్తూ గ్రాంధిక భాషలో రచనలు చేయడమేగాక బిచ్చగాడితో సైతం గ్రాంధిక భాషలోనే మట్లాడేవారు కోక్కొండ వెంకటరత్నం (1852-1915)గారు. ఇంట్లో భార్యతో కూడా గ్రాంధికంలోనే సంభాషించేవారు. వాడుక భాషలో గ్రంధ రచన సాగాలని గురజాడ పిలుపునిచ్చారు. వాడుక భాషను 'కులట' అని గేలి చేసే పండితులు దానిని దూరంగా విసర్జించక యేల వాడుక చేతురు? వారు యాంటీ నాచ్ కాదు కాబోలు? అంటూ ఒక చురక తగిలించి ఆ పండితులు చేసే తప్పులను ఆయన ఎత్తి చూపారు. 1917లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు వాడుక భాషను రాసే విధానంలో కొత్త దారులు తొక్కారు. "మండలాల్లో మాటలు మారినాయని భాష చెడ్డ భాష అవుతుందా? కొత్త గ్రంధాలు చదువుకోని, కొత్త మాటలు నేర్చుకొన్నట్లు అన్య మాండలిక గ్రంధాలు చదువుకోని ఆ పదాలు నేర్చుకోవాలి. ఆ మాటలు తెలియని ఆ భాష చెడ్డదనడం మంచిది కాదు. మారడం భాషకు సహజం" అన్నారు. [ఇంకా... ]