ఉదయం ఆరు గంటలు కావొస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. "ఒరేయ్ రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు, మరచిపోయావా"? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో వున్న రవి, తల్లి పిలుపుతో లేచికూర్చున్నాడు. అది చూసి సునీత "హ్యపీ బర్తడే" అంటు శుభాకాంక్షలు తెలిపింది. "ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా! మీ డాడీ హాల్లో ఎదురచూస్తున్నారు" అంటూ వెళ్ళిపోయింది.
రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్ధుడు. రవి వారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డయినా క్రమశిక్షణతో పెరిగాడు. మాష్టార్లకు రవి అంటే చాలా యిష్టం. చదువుల్లోను, ఆటల్లోను ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ వందరూపాయల నోటును రవి చేతికిచ్చి "నీ కిష్టమైన వస్తువు కొనక్కో" అని చెప్పి వెళ్ళి పోయాడు. [ఇంకా... ]