Wednesday, October 15

ఆధ్యాత్మికం - దైవాలు నైవేద్యాలు

మనము పూజించే దైవాలు - అర్పించే నైవేద్యాలు

మనము సకల దేవతారాధనలు చేస్తున్నాము. ఇష్టదైవాల్ని ఎన్నుకోవడం ఆయా భక్తుల అనుభూతులపై, మహిమలపై ఆధారపడి ఉంటుంది. అష్టోత్తర సహస్రనామ అర్చనలు, షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఇష్టదైవాలకు అవసర నైవేద్యం, మహానైవేద్యం, తాంబూల సమర్పణ, హారతి (నీరాజనం) మంత్రపుష్పం, తీర్ధస్వీకారం, ఫలశ్రుతి అనంతరం పూజ సమాప్తమగును. ఐతే సకల దేవతా పూజా విధనం గురించి తెలుసుకుని, నైవేద్యాల వివరణలోకి వెళ్దాం.

సకల దేవతా పూజా విధానము

శ్రీ గురుభ్యోనమహా గురువులందరూ సన్నిహితులుగా నున్నట్లు భావించి వారికి నమస్కరించి "హరిహ్ ఓం" అని దేవుని ధ్యానించాలి. పూజకుముందు రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, పంచామృతము, గోక్షీరము నైవేద్యానికి పటికబెల్లము, ద్రాక్షగానీ, పండ్లుగానీ, వండిన మహానైవేద్యము, దీపములు, ధూపము, హారతి కర్పూరము అన్నీ ముందుగా సిధ్ధంగా ఉంచుకొనవలెను. [ఇంకా... ]