Wednesday, October 22
పర్యాటకం - ఉడిపి
కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా మంగళూరుకు 60 కి.మీ. దూరంలో ఉన్న ఉడిపి ఒక పుణ్యక్షేత్రం. అనేక దేవాలయాలతో, ప్రతినిత్యం లక్షలాది మముక్షువులైన యాత్రికులతో, నిత్యనూతనోత్సవాలతో కళకళాలాడుతుంటుంది. ఇచ్చటి వాతావరణం ఎప్పుడూ అనుక్షణ ప్రవర్ధమానమైన దివ్య చైతన్యంతో స్పందిస్తూ ఉంటుంది. 'ఉడుప ' (చంద్రుడు) అనే పదాన్ని అనుసరించి 'ఉడిపి' అనే పేరు ఏర్పడింది. చారిత్రక ప్రసిద్దమైన ఈ పవిత్ర యాత్రాస్ధలం పరిశుభ్రంగా చంద్రుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద అందమైన మామిడి తోటలతో, పనస తోటలతో సువిశాలమైన వరి పొలాలగుండా ప్రయాణంచేసే యాత్రికులకు ఇచ్చటి కొబ్బరి చెట్లు, పోకచెట్లు స్వాగతం పలుకుతుంటాయి. 13వ శతాబ్దానికి చెందిన శ్రీ మధ్యచార్యులు శ్రీ శంకరుల అద్వై తమతాన్ని, శ్రీ రామానుజుల విశిష్టాద్వైత మతాన్ని పూర్తిగా ఖండించి కొత్తగా ద్వైత మతాన్ని (మద్వ మతం) ప్రతిపాదించిన అవతారమూర్తి - వాయుదేవుడు, హనుమంతుడు, భీమసేనుల అవతారం అని ప్రతీతి. గొప్ప పండితుడైన అచ్యుత ప్రేక్షుల ఆశ్రయంలో వేదవేదాంతంగాలు అధ్యయనం చేసిన మధ్వచార్యు (వాసుదేవుడు) ల ధారణాశక్తి సునిశితమైనది. వీరి శరీరం దార్ధ్యం అసాధారణ, అపారం. [ఇంకా... ]