Wednesday, October 22

జానపద కళారూపాలు - తోలుబొమ్మలు

దీర్ఘ కాలంగా ఆంధ్ర దేశంలోని ఆబాల గోపాలాన్ని అలరిస్తున్న కళారూపం తోలుబొమ్మలాట. ప్రేక్షకులకు కన్నులపండుగ కల్పించే కళారూపమిది. బొమ్మలతో నాట్యం చేయించడమే తొలుబొమ్మలాట కళారూపం.తోలుబొమ్మలాటల గురించి అనేక శాసనాల్లో కూడా లిఖించబడి ఉంది.

మన ప్రాచీన కళారూపలలో తోలుబొమ్మలు ఒకటి. ఇవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్ధినాటికే చాలా ప్రచారంలో ఉన్నాయని తెలుస్తూంది. తెనుగువారి ప్రాచీన కళా వైదగ్ద్యాన్ని ఖండాంతరాలకు వ్యాపించి పెట్టిన కళ ఇది. నేడు పాశ్చాత్య దేశాలలో గొప్పగా చెప్పుకొనే ఛాయా ప్రదర్శనాలకు మూలం ఈ తోలుబొమ్మలే. ఖండాంతరాలకు - జావా, బోర్నియా, సుమిత్ర, బలి, సయాం, కంబోడియా, బర్మా మొదలయిన దేశాలలో - మన దేశంనుంచీ వలస వెళ్ళినవారు తోలుబొమ్మలను ప్రదర్శిస్తూ, రామాయణం, భారతం మొదలయిన కథలను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. [ఇంకా... ]