Tuesday, October 14
వ్యక్తిత్వ వికాసం - వివేకానందుడు
1893 సెప్టెంబర్ 11వ తేది - పశ్చిమ దేశాలతో ముఖ్యంగా అమెరికాతో ఇండియా యొక్క సాంస్కృతిక బంధంలో ఒక కొత్త ఘట్టానికి ప్రారంభ చిహ్నంగా నిలుస్తుంది. ఆరోజు చికాగో (అమెరికా)లోని పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్‌లో జరిగిన సమావేశానికి ప్రపంచమంతటి నుండీ ఖ్యాతినొందిన ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో 30 సంవత్సరాల వయసుగల భారతీయుడు శ్రీరామకృష్ణుని శిష్యుడు అయిన స్వామి వివేకానంద ఉన్నారు. పసుపు రంగు దుస్తులు ధరించిన వివేకానంద తన పేరుతోసహా అన్ని భౌతిక సంపదలను పరిత్యజించారు. కేవలం సన్యాసి చిహ్నాలు, భగవద్గీత మరియు థామస్ ఏ. కెంపిస్ రచించిన "ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్" అనే రెండు గ్ర్రంధాలు తప్ప స్వంతమనేదేదీ లేకుండా సర్వం విసర్జించారు. [ఇంకా... ]