సుక్కలన్ని కొండమీద - సోకుజేసుకునే వేళ,
పంటబోది వరమడితో - పకపక నవ్వే వేళ,
సల్లగాలి తోటకంత - సక్కలగిల్లి పెట్టువేళ,
మొక్కజొన్న తోటలో - ముసిరిన సీకట్లలో,
మంచెకాడ కలుసుకో, - మరువకు మామయ్య,
చీకటి మిణుగురు జోతుల - చిటిల చిల్లులడక మునే,
సుద్దులరాగాలు చెవుల - నిద్దరతీయక మునుపే,
ఆకాశపుటొడిని తోట - ఆవలింత గొనక మునే,
పొద్దువాలుగంటనే - పుంతదారి వెంటనే,
సద్దుమణగనిచ్చిరా - ముద్దులమామయ్య! [ఇంకా... ]