Friday, October 17
మీకు తెలుసా - కాగితం కథ
క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది. ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, ఎడారిలోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత నాగరికతల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక మేక తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. [ఇంకా... ]