Thursday, October 23
ఇతిహాసాలు - రామాయణము - పాత్రలు - ముఖ్యాంశాలు
రామాయణము మహాకావ్యము. ఇందులో 24,000 శ్లోకాలు సంస్కృత భాషలో వాల్మీకి మహర్షిచే రచించబడ్డాయి. ఇందులో సీతారాముల పవిత్ర చరిత్ర, కొడుకు తండ్రిని ఏవిధంగా గౌరవించాలీ, సోదురులు ఒకరిపట్ల మరొకరు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి, మిత్రుల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి, రాజు ప్రజలనెలా పాలించాలి మొదలైన వివరాలుంటాయి. శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణుడే అయినప్పటికీ దైవశక్తిని వినియోగించకుండా మానవ శక్తితోనే దుష్ట శిక్షణ చేయడమే కాకుండా ఒక సాధారణ మానవుడుగా జీవించాడు. అరణ్యవాసం, భార్యావియోగం వంటి కష్టాలన్నీ అనుభవించాడు. రావణ సంహారం మాత్రమే రామాయణ పరమార్ధం కాదు. ఆ త్రేతాయుగాన చెలరేగిన అధర్మాన్ని, బహుభార్యత్వాన్నీ, అసత్యాన్నీ కూడా నిర్మూలించడం,మనిషిలోని దుర్గుణాలన్నీ తొలగించడమే రామావతారం ఉద్దేశం. ఈ సత్కార్యాలవల్ల సాధారణ ప్రజలు ఆయన బాటలోనే నడిచి సుఖ జీవనం సాగించే అవకాశం కలిగింది. అందుకే ఏ యుగానికైనా ఆయనే ఆదర్శ పురుషుడు. [ఇంకా... ]