ఏ మనిషికైన తాను అనుకున్న దానిని సాధించటానికి ముఖ్యంగా కావాలసినది సమయ పాలన. లోకంలో ఏ మనిషికైన రోజుకు ఉండేది 24 గంటలే. ఎటొచ్చీ ఆ 24 గంటలు సమర్థవంతంగా నిర్వహించుకోవడమే 'టైమ్ మేనేజ్‌మెంట్' అంటారు. ఒక సారి సమయాన్ని పోగొట్టుకుంటే అంటే వృధా చేసుకుంటే మళ్ళీ మనం దానిని ఎప్పటికీ పొందలేము. అందుకే అలాంటి సమయాన్ని ఎంత సమర్థవంతంగా ప్లాన్ వేసుకోవాలో, తద్వారా మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ మనిషికైనా విజయం వరించాలి అంటే ప్లానింగ్ అవసరం. ప్లానింగ్ లేని మనిషి గమ్యం అగమ్యగోచరంలా ఉంటుంది. ఒక క్రమ పద్దతిలో ప్లాన్ వేసుకుంటే జీవితం నందనభరితం అవుతుంది. కొద్ది పాటి ప్లానింగ్‌తో జీవితాన్ని ఎలా సుఖమయం చేసుకోవచ్చునో తెలుసుకుందాం. [ఇంకా... ]