Thursday, October 23
వ్యక్తిత్వ వికాసం - ఆందోళనను అరికడదాం
సగటు మానవుడి సాధారణ స్పందనలలో ఆందోళన ఒకటి. వాస్తవానికి ఇది సర్వసాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఎదో ఒకనాడు కలిగేదే. ఆందోళన చెందని మనిషి ఉండడం అంటూ జరగదు. ఐతే ఆందోళన చెందే పర్సెంటేజిలోనే ఉన్నది అసలు కథంతా. చిన్నా, పెద్దా ప్రతి సంఘటనకీ స్పందించే మనిషికే ఎన్నో తలనొప్పులు. ప్రతి సంఘటన సంఘర్షణ కాబోదు. అలా అవుతుందేమోనన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తుంది ఎవరినైనా.ఆందోళన అనేది ఒక మానసిక వ్యాధి. మెదడును తొలుచుకుతినే క్రిమిలాంటిది. శరీరంలోని జీవ శక్తిని ఇది పీల్చేస్తుంది. మనస్సు నీరసపడిపోయి, అంతర్దృష్టి లోపించినప్పుడు మనస్సు అంతే మబ్బులు క్రమ్మేస్తాయి. మనస్సు గాబరాపడిపోతుంది. దుఖంతోనూ, విచారంతోనూ మునిగిపోతుంది. కాబట్టి, ఆందోళన, ఆదుర్దా, దుఖం అన్నీ ఏకమవుతాయి. ప్రతి నిత్యం ఎన్నో అవసరాలు,కోరికలు మనను చుట్టేస్తుంటాయి. ప్రతిదీ అవసరంగానే కనిపిస్తుంటుంది. ఆ అవసరాన్ని సాధించుకోవడంకోసం తీవ్రంగా ప్రయత్నించడం, అది సాధ్యం కాకపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురికావడం జరుగుతుంటుంది. [ఇంకా... ]