Thursday, January 1

మీకు తెలుసా - నూతన సంవత్సర వేడుకలు

కొత్త కొత్త ఆశలతో... నూతన ఆలోచనాల విధానాల సరళితో మార్పులు కోరుకొంటూ... మనిషిగాపుట్టిన ప్రతి ఆశాజీవి రాబోయే సంవత్సరం మరింత శోభాయమానంగా ఉండాలనే ఆకాంక్షతో పాత సంవత్సరపు వైభవాన్ని నెమరువేసుకొంటూ...విషాధచాయలని వదిలించుకొంటూ కనీసం కొత్త సంవత్సరం లో అడుగు పెట్టేవేళ అన్నీ శుభాలే కలగాలని ఆశిస్తూ వేడుకగా కులమతాలకతీతంగా, సనాతన సాంప్రదాయాలపట్టింపులు లేకుండా అన్ని దేశాలలో సర్వమానవ సౌబ్రాతృత్వం పరిపొందేలా వయో బేధం లేకుండా... పేద, గొప్ప అందరూ తమ శక్తికొద్ది జరుపుకొనే వేడుకే ఈ నూతన సంవత్సర సంబరం. ఈ నూతన సంవత్సరానికి ఆది అంతం అనేది ఉండదు. నూతనత్వాన్ని కోరుకోవడము లోనే గొప్ప మార్పు అనేది కనిపిస్తుంది. అలా ఆలోచించబట్టే ఆది మానవుడు నేడు అణుమానవుడైనాడు.

సంవత్సరం అంతా న్యూ ఇయరే...

జనవరి 1 న ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొన్నిదేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఈ నూతన సంవత్సరంను ఒకొక్కరు ఒక్కొక్క నెలలో జరుపుకోవడం విశేషము. ఆరకంగా సంవత్సరంలో వచ్చే ప్రతినెలలోనూ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు చోటు చేసుకోవడం గమనార్హం. [ఇంకా... ]