Friday, January 9
వ్యక్తిత్వ వికాసం - సోక్రటీస్
గ్రీస్‌లొ నగర రాజ్యమైన ఏథెన్స్ పౌరుడైన సోక్రటీస్ 470 బి.సి.లో జన్మించాడు. కొంతకాలం తన తండ్రి వృత్తిని చేపట్టాడు. కాని ఇతర ఆశలు అతనికి ఉన్నందువల్ల సైన్యంలో చేరాడు. ఏథెన్స్‌కు తిరిగివచ్చిన తర్వాత తన కాలాన్ని మానవ జీవిత ప్రవర్తనపై అధ్యయానికి వినియోగించి ప్రజా సమస్యలను గురించి ప్రజలకు హెచ్చరిక చేసేవాడు. 406 బి.సి.లో 500 మందితో కూడిన సెనేట్‌లో సభ్యుడయ్యాడు. ఇతర గౌరవాలు కూడా పొందాడు. తన ప్రజాహిత కార్యాలకు తోడు ఒకటి తరువాత ఒకటిగా తన బోధనా వృత్తిని కొనసాగించేవడు. సోఫిస్ట్స్ అని పిలువబడే పాఠశాల ఉపాధ్యాయుల వేదాంత చర్చలను - అతని కాలంనాటి - ఏథెన్స్ వాసులు ఆదరించేవారు. సోఫిస్టులు ధనవంతుల వద్ద డబ్బు తీసుకొని వారి పిల్లలకు - వాదన, ఉపన్యాస విధానం నేర్పేవారు. పాపాన్ని (చెడు) మంచిదాన్నిగా, మంచిదాన్ని పాపంగా రూపొందించేవారు. హృదయపూర్వకంగా, నేర్పుకల వారుగా ఉండేవారు. సన్మార్గం (నీతి)పై మనుషుల విశ్వాసాన్ని బలహీనపర్చే విధంగా వారి బోధనల ప్రభావం ఉండేది. అందరి చేత గౌరవించబడే ఒకే సత్యం, నీతి అనేవి లేవని సోఫిస్టులు చెప్పేవారు. ఒకరికి నీతిగా కనిపించేది మరొకరికి అవినీతి అవుతుంది. [ఇంకా... ]