టీనేజ్ నుంచి మధ్య వయస్కుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు అందరూ నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు . అందుకు డైటింగ్, యోగా, వ్యాయామం... ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఎంత వ్యవధిలో ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో షెడ్యుల్ తయారుచేసుకోనే ముందు వయసు, శరీరాకృతి, ఆరోగ్య పరిస్థితి... ఇలా ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే బరువు తగ్గే మాట అటుంచి లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి.
ఒకేసారి డైటింగ్ చేసి అంటే పూర్తిగా బోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటారు చాలా మంది, ఇది పొరబాటు. ఇలా చేయడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపు కోల్పోతుంది. వ్యార్ధకపు చయలు కనిపిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో క్యాల్షియం , ఇనుము, విటమిన్ - ఎ,ఇ,సి,బి కాంప్లెక్స్‌లు వంటి సూక్ష్మపోషకాలు తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి . [ఇంకా... ]