ఒకసారి మీ కంప్యూటర్ బల్లను గమనించండి. బల్ల చిన్నదే అయినా దాన్ని పుస్తకాలు, పెన్నులు, చిన్న చిన్న కాగితాలు, సీడీలు, చిల్లర, డైరీలు ఇలా బోలెడు ఆక్రమిస్తాయి. బల్లను అందంగా సర్దుకోవాలంటే కష్టమంటూ చాలామంది నిర్లక్ష్యం చేసేస్తారు. కానీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే బల్ల ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మీ దైనందిన కార్యక్రమాలు, పూర్తిచేయాల్సిన ముఖ్యమైన పనులు, డెడ్‌లైన్స్, సంప్రదించాల్సిన వ్యక్తులు ఇలా ఎన్నో వివరాలను మనం డైరీలో రాసుకుంటాం. ఇక నుంచి ఓ డిస్‌ప్లే బోర్డు బల్లకు సమీపంలో తగిలించండి. అన్ని ముఖ్యమైన అంశాలను దానిపై రాసుకుంటే మరిచిపోరు. డైరీ అవసరం అంతగా ఉండదు కూడా..! అయితే అన్నీ ఒకేరంగు పెన్నుతో రాయాలని చూడకండి. నాలుగైదు రంగుల పెన్నులు ఉంటే బాగుంటుంది. [ఇంకా... ]