Thursday, January 8

ఆహార పోషణ సూచిక - ఆరోగ్యం - ప్రాముఖ్యత

సృష్టిలోని అన్ని సంపదలకన్నా ఆరోగ్యంగా జీవించడమే అసలైన సంపద. ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఆరోగ్యం ఉన్నతంగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. ఉన్నవారికీ, లేనివారికీ కావలసిన ఏకైక సంపద ఆరోగ్యం మాత్రమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆర్ధిక ఉన్నతి అదృష్టం మీదనఒ, కష్టానికి తగిన ఫలితం మీదనో ఆధారపడి ఉండగా ఆరోగ్యం మాత్రం వారి వారి చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ మహద్భాగ్యాన్ని పొందడం కోసం అందరూ అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు యోగాను ఆశ్రయిస్తే, మరికొందరు ఇతర వ్యాయామాలను, మరికొందరు ప్రాణాయామాన్ని, ఆరోగ్య నియంత్రణ సూత్రాలను పాటిస్తుంటారు. జాతిపిత మహాత్మా గాంధి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో విలువైనవి బంగారు, వెండి ఆభరణాలు కాదు, అరోగ్యం మాత్రమే అన్నారు. ఈ మాటని అంగీకరించకుండా ఉండడం అసాధ్యం. అయితే నేడు ఎంతమంది ఈ సత్యానికి దగ్గరగా ఉంటున్నారు? ఎందరు ఆరోగ్యంపట్ల నిజమైన శ్రద్ధ కనబరుస్తున్నారు? అని అలోచిస్తే సమాధానం అంత ఆశాజనకంగా కనిపించదు. స్పీడు యుగంలో ఆహారాన్ని కూడా అంతే స్పీడుగా అదేదో మొక్కుబడి వ్యవహారంగా భావిస్తూ ఎందరో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. [ఇంకా... ]