ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక బ్రాహ్మణునకు ప్రాణగండ ముండెను. అతని భార్య గ్రామ కుంకుమనోము నోచి, యధావిధిగ పండ్లు, పసుపు, కుంకుమలు పట్టుకొని వీధివీధుల పంచిపెట్టసాగెను. ఆమె మొదటవీధీలో పంచి పెట్టునంతలో పెద్దకొడుకువచ్చి తండ్రికి జబ్బుగానున్నదని తెలుపగా నామె ఇంకొక వీధి యున్నదని చెప్పెను. ఆమె రెండవ వీధిలో పంచి పెట్టుచుండగా రెండవ కొడుకు వచ్చి తండ్రికి రోగము ముదిరి పోయినదని చెప్పెను. ఆమె యింకొక వీధి యున్నదని చేప్పి, మూడవవీధిలో పంచిపెట్టుచుండగా మూడవకుమారుడు వచ్చి తండ్రికి ప్రాణము మీదికి వచ్చెనని చెప్పెను. అప్పుడామె యింకొక వీధిమాత్ర మున్నదని నాల్గవవీధిలో పంచిపెట్టుచుండగా నాల్గవకొడుకువచ్చి తండ్రిని క్రిందబెట్టినట్లు చెప్పెను. ఆమె ఇంకొక వీధిమాత్రమున్నదని చెప్పి అయిదవవీధిలో పంచిపెట్టుచుండగా ఐదవకొడుకువచ్చి చనిపోయినట్లు చెప్పెను. కాని ఆమె ఆవీధికంతకు పంచిపెట్టువరకు ఇంటికి వెళ్ళలేదు. [ఇంకా... ]