పిచ్చుకల మనిషికి అత్యంత చేరువలో ఉండే పక్షి పావురం. దేవాలయాల సిఖరాల పైన దర్పంగా నివశించే ఈ పక్షులంటే అందరికీ ఇష్టమే. అనేకమంది ఇళ్ళలో వీటిని హాబీగా పెంచుతుంటారు. ఇంటికి కొత్త శోభనిచ్చే ఈ పావురాలంటే చిన్నా పెద్దా అందరూ ప్రేమ చూపుతారు. వాటికి ప్రత్యేకమైన గూళ్ళను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా ఇస్తుంటారు. అత్యంత ప్రాచీనమైన విలాసాలలో పావురాలను పెంచడం ఒకటి. అతి సులువుగా మచ్చికవ్వడమే కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్ళినా తిరిగి బయల్దేరిన గమ్యానికి చేరే గుణంగల పక్షి కావడంతో అనేకమంది వీటిని ప్రత్యేకంగా పెంచేవారు. వీటిని విలాసాలకోసమే కాకుండా వీటి ద్వారా లాభాలను కూడా పొందేవారు.
పూర్వం యుద్ధాలలోనూ, శాంతి సమయాల్లోనూ రహస్య సందేశాలను పంపుకోవడానికి వీటిని ఉపయోగించేవారు. 776 బి.సి. మరియు 393 ఏ.డి.ల మధ్య ఒలంపిక్ ఆటల్లో వీటిని ఉపయోగించుకున్నారు. మొగలాయిలు పావురాలను పెంచడమేకాక వాటిపై పందేలు కట్టడానికి వాటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. ఔద్ నవాబు వజాద్ ఆలీ షా తన విలాసం కోసం 25,000 పావురాలను పెంచేవాడు. [ఇంకా... ]