పూర్వం ఇంటికి ముదురు రంగులు వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్లు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి ముదురు రంగులను వాడటం ఫ్యాషన్ అయ్యింది. పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నా వేరే రంగుతో కలిసినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. ఏ రంగు ఎలా ఉంటుందో ఆ వివరాలే ఇవి...
* పసుపు, ఎరుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్నిస్తాయి. వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎలాగంటే అలా తీసుకుంటే మరీ గాడిగా కనిపిస్తాయి.
* పోస్టల్ రంగులైన పౌడర్ పింక్, బేబి బ్లూ, సాఫ్ట్ గ్రీన్‌లు చూడగానే హాయిగా అనిపిస్తాయి. ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ రంగుల వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది. [ఇంకా... ]